విశాలాంధ్ర – పెద్దకడబూరు (కర్నూలు) : మండల పరిధిలోని చిన్నతుంబలం గ్రామానికి చెందిన చాకలి శివ (11)అనే బాలుడు కరెంటు షాక్ తో మృత్యువాత పడ్డాడు. చాకలి లక్ష్మి, రామాంజిని కుమారుడు శివ ఉదయం మిద్దె పైకి వెళుతుండగా ఇంటి పైన వేలాడుతున్న కరెంటు వైర్ తాకడంతో షాట్ సర్క్యూట్ సంభవించింది. కుటుంబ సభ్యులు అప్రమత్తం అయ్యేలోగా శివ మృతి చెందాడు. అల్లారు ముద్దుగా పెంచుకున్న కొడుకు కళ్లముందే మృతి చెందడంతో తల్లిదండ్రులు శోకసంద్రంలో మునిగిపోయారు.