Friday, June 14, 2024
Friday, June 14, 2024

జగనన్న సురక్ష కార్యక్రమం

విశాలాంధ్ర, పెద్దకడబూరు :మండల పరిధిలోని చిన్నతుంబలం గ్రామంలో ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్న జగనన్న సురక్ష కార్యక్రమం మంగళవారం సచివాలయ – 1 పరిధిలో నిర్వహించారు. ఈ తహసీల్దార్ వీరేంద్ర గౌడ్, ఎంపీడీఓ ప్రభాకర్ మాట్లాడుతూ ప్రజా శ్రేయస్సు కొరకు ప్రభుత్వం జగనన్న కార్యక్రమం చేపట్టినట్లు తెలిపారు. ప్రతి ఇంటికి వెళ్లి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో ఈఓఆర్డి జనార్ధన్, పంచాయతీ కార్యదర్శి అయ్యప్ప రెడ్డి , వీఆర్వో కృష్ణమూర్తి, మాజీ ఎంపీటీసీ యల్లప్ప, సచివాలయ సిబ్బంది, గ్రామ వాలంటీర్లు, గృహ సారధులు తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img