Saturday, May 25, 2024
Saturday, May 25, 2024

ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేయాలని విద్యార్థులు ఆందోళన

విశాలాంధ్ర, పెద్దకడబూరు : విద్యార్థుల కోసం ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేయాలని సోమవారం మండల పరిధిలోని కంబలదిన్నె గ్రామ సమీపంలో కోసిగి ఎమ్మిగనూరు ప్రధాన రహదారిపై విద్యార్థులు ఆందోళన చేపట్టారు. విద్యార్థులకు ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేయాలంటూ రోడ్డుపై బైటాయించి, ఆర్టీసీ అధికారులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. విద్యార్థులు రహదారిపై ఆందోళన చేయడంతో కిలోమీటర్ మేర వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. సమాచారం తెలుసుకున్న ఎస్ఐ శ్రీనివాసులు అక్కడికి చేరుకొని విద్యార్థులతో మాట్లాడారు. ఆర్టీసీ డిపో మేనేజర్ తో మాట్లాడి బస్సు ఏర్పాటుకు కృషి చేస్తానని ఆందోళన విరమించాలని విద్యార్థులకు సూచించారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img