Free Porn
xbporn
https://www.bangspankxxx.com
voguerre
southampton escorts
Wednesday, September 25, 2024
Wednesday, September 25, 2024

మంత్రాలయం అభివృద్ధిలో పెను మార్పులు. ఎంపీ నాగరాజు

విశాలాంధ్ర – పెద్దకడబూరు (కర్నూలు) : రాబోయే ఐదు సంవత్సరాలలో మంత్రాలయం నియోజకవర్గంలో అభివృద్ధిలో పెను మార్పులు సంభవిస్తాయని కర్నూలు ఎంపీ బస్తిపాటి నాగరాజు అన్నారు. బుధవారం మండల కేంద్రమైన పెద్దకడబూరులో ప్రత్యేక అధికారి వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో జరిగిన ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా కర్నూలు ఎంపీ బస్తిపాటి నాగరాజు, మంత్రాలయం నియోజకవర్గ టీడీపీ ఇంచార్జీ రాఘవేంద్రరెడ్డి, టీడీపీ రైతు విభాగం రాష్ట్ర అధికార ప్రతినిధి నరవ రమాకాంతరెడ్డి, టీడీపీ మహిళా జిల్లా ఉపాధ్యక్షురాలు నరవ శశిరేఖ, జనసేన ఇంచార్జీ లక్ష్మన్న, బిజెపి ఇంచార్జీ విష్ణు వర్ధన్ రెడ్డి లు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ నాలుగు సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన బాలనాగిరెడ్డి మంత్రాలయం నియోజకవర్గ అభివృద్ధి చేసింది శూన్యమని విమర్శించారు. రానున్న రోజుల్లో మంత్రాలయం నియోజకవర్గ అభివృద్ధికి అన్ని విధాలా కృషి చేస్తానని హామీ ఇచ్చారు. కూటమి ప్రభుత్వంతోనే అభివృద్ధి, సంక్షేమం, సుపరిపాలన సాధ్యమన్నారు. వంద రోజుల పాలనలో ఎన్నో సంక్షేమ పథకాలను ప్రజలకు అందించడం జరిగిందన్నారు. రాబోయే రోజుల్లో ఎన్నికల ముందు ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చినందుకు కృషి చేస్తామన్నారు. రాష్ట్రంలో వైసీపీ మళ్లీ కొలుకొనే పరిస్థితి లేదని, వైసీపీది ముగిసిన అధ్యాయమని ఎంపీ ఎద్దేవా చేశారు. వైసీపీ ఐదేళ్ల పాలనలో రాష్ట్రం చాలా వెనుకబడి ఉందన్నారు. రాష్ట్రాభివృద్ధికి ముందు చూపు ఉన్న నాయకుడు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు అని, ఇప్పటికే కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి వేల కోట్ల రూపాయలు తెచ్చారన్నారు. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో ప్రాజెక్టులను పూర్తి చేయడంలో ఘోరంగా విఫలమైందని ఆరోపించారు. పెండింగ్ లో ఉన్న ప్రాజెక్టులను కూటమి ప్రభుత్వం పూర్తి చేస్తుందన్నారు. అనంతరం ప్రతి ఇంటికి వెళ్లి కూటమి ప్రభుత్వం ఏర్పడిన 100 రోజుల్లో చేసిన మంచి పనులు ప్రజలకు తెలియజేసి స్టిక్కర్లను అతికించారు. అలాగే పీకలబెట్ట గ్రామానికి రైల్వే గేటు ఏర్పాటు చేయాలని గ్రామస్తులు తోవి ఈరన్న, హనుమంతు వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ మండల అధ్యక్షుడు బసలదొడ్డి ఈరన్న, ఎస్సీ సెల్ రాష్ట్ర నాయకులు ఏసేపు, మల్లికార్జున, మీసేవ ఆంజనేయ, వీరేష్ గౌడ్, విజయ్ కుమార్, తలారి అంజి, జనసేన మండల అధ్యక్షులు గణేష్, బిజెపి నాయకులు శ్రీ రామ్ కోటి, పురుషోత్తం గౌడ్,బొగ్గుల నరసన్న, రాజు, రామన్న, రామాంజనేయులు, తిప్పన్న, ఆయా గ్రామాల కార్యకర్తలు, సచివాలయ సిబ్బంది, గ్రామస్తులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img