Saturday, May 25, 2024
Saturday, May 25, 2024

ఆర్డీఎస్ కుడి కాలువ ప్రాజెక్టు పూర్తి చేయాలి

విశాలాంధ్ర, పెద్దకడబూరు : ఆర్డీఎస్ కుడి కాలువ ప్రాజెక్టు పూర్తి చేయాలంటూ గురువారం సిపిఐ ఆధ్వర్యంలో పెద్దకడబూరు మండల సమితి తరపున జీపు జాతకు బయలుదేరారు. ఈ సందర్భంగా సిపిఐ జిల్లా కార్య వర్గ సభ్యులు భాస్కర్, మండల కార్యదర్శి వీరేష్ రైతు సంఘం తాలూకా కార్యదర్శి ఆంజనేయ మాట్లాడుతూ రాజోలిబండ డైవర్షన్ స్కీం కు కుడి కాలువ నిర్మాణాన్ని పూర్తి చేసి రైతులకు సాగునీరు, తాగునీరు అందించాలని డిమాండ్ చేశారు. ఆర్డీఎస్ లో నీరు లేక పోవడంతో ఇసుకమేటలతో కనిపిస్తుందన్నారు. ఖరీఫ్ సీజన్ ప్రారంభమయ్యేనాటికి ఆర్డీఎస్ నిండుకుండలా కళకళలాడేదన్నారు. వర్షాలు లేకపోవడంతో వెలవెలబోతుందన్నారు. కావున ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి తక్షణమే రైతులను, ప్రజలను ధృష్ఠిలో ఉంచుకుని ఆర్డీఎస్ కుడి కాలువ ప్రాజెక్టు పూర్తి చేసి రైతులకు సాగునీరు, తాగునీరు అందించాలన్నారు. అలాగే మంత్రాలయం నుండి కర్నూలుకు రైల్వేలైన్ ఏర్పాటు చేయాలని వారు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు వీరేష్, హనుమన్న, నరసింహులు ముద్ద రంగప్ప, రామాంజనేయులు, సిపిఐ సహాయ కార్యదర్శి కుమ్మరి చంద్ర, నాగరాజ్ తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img