Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Sunday, September 8, 2024
Sunday, September 8, 2024

జాతీయ నులిపురుగుల నిర్మూలన గోడ పత్రికలు విడుదల

విశాలాంధ్ర, పెద్దకడబూరు :మండల కేంద్రమైన పెద్దకడబూరులోని తహసీల్దార్ కార్యాలయం నందు డాక్టర్ సయ్యద్ తాహెబ్ ఆధ్వర్యంలో సోమవారం తహసీల్దార్ వీరేంద్ర గౌడ్, ఎంపీడీఓ శ్రీనివాసరావు, ఎంఈఓ సువర్ణ సునియం, ఈఓఆర్డి జనార్ధన్ చేతుల మీదుగా జాతీయ నులిపురుగుల నిర్మూలన గోడ పత్రికలను విడుదల చేశారు. ఈ సందర్భంగా వైద్యాధికారి సయ్యద్ తాహెబ్ మాట్లాడుతూ ఈ నెల 10న జాతీయ నులిపురుగుల నిర్మూలన కార్యక్రమంలో భాగంగా అంగన్వాడీ కేంద్రాలు, పాఠశాలలో పిల్లలకు అల్బెండజోల్ మాత్రాలను పంపిణీ చేయడం జరుగుతుందన్నారు. నులిపురుగులు సోకిన పిల్లలు రక్తహీనత, పోషకాల లోపం, ఆకలి మందగించడం, నీరసం, కడుపునొప్పి, బరువు తగ్గడం వంటివి ఉంటాయన్నారు. వీటిని వేసుకోవడం వలన రక్తహీనతను నివారిస్తుందని, పోషకాల గ్రాహ్యతను మెరుగుపరుస్తుందన్నారు. అంతే కాకుండా పిల్లలకు చదువుపై ఏకాగ్రతను, నేర్చుకునే సామర్థ్యాన్ని పెంచుతుందన్నారు. కావున ఆయా గ్రామాల్లోని అంగన్వాడి కేంద్రాల కార్యకర్తలు, ఆయా పాఠశాలల ప్రధానోపాధ్యాయులు పాఠశాలలకు 100% విద్యార్థులు హాజరయ్యేటట్లు చూడాలని సూచించారు. ఈ కార్యక్రమంలో గ్రంథాలయ అధికారిణి ఆశాజ్యోతి, ప్రాథమిక ఆరోగ్య కేంద్రం సీ హెచ్ఓ కృష్ణ మోహన్, సూపర్ వైజర్ కిషోర్, ల్యాబ్ టెక్నీషియన్ ఖాదర్ బాషా తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img