విశాలాంధ్ర – పెద్దకడబూరు (కర్నూలు) : మండల పరిధిలోని ముచ్చిగిరి గ్రామంలో గ్రామ సర్పంచ్ హనుమంతు ఆధ్వర్యంలో రిపేరికి వచ్చిన చేతి పంపులకు గురువారం మెకానిక్ పౌలయ్య మరమ్మతులు చేపట్టారు. గ్రామంలోని ఆయా కాలనీలలో రిపేరికి వచ్చిన చేతి పంపులను కాలనీవాసుల సహాయంతో బోర్ బయటకు తీసి కొత్త పరికరాలను వేసి మరమ్మతులు చేశారు. చేతి పంపుల నుంచి నీళ్లు రావడంతో గ్రామస్తులు సంతోషం వ్యక్తం చేశారు.