Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Tuesday, September 17, 2024
Tuesday, September 17, 2024

పేదలకు అండగా సంక్షేమ పథకాలు

మంత్రి గుమ్మనూరు జయరాం

విశాలాంధ్ర ఆస్పరి : రాష్ట్రంలో అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు పేద ప్రజలకు కొండంత అండగా నిలుస్తున్నాయని కార్మిక శాఖ మంత్రి గుమ్మనూరు జయరాం అన్నారు. శుక్రవారం మండల పరిధిలోని నగరూరు గ్రామంలో గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని సర్పంచ్ సావిత్రమ్మ అధ్యక్షతన నిర్వహించారు. ముందుగా స్థానిక వైకాపా నాయకులు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం 30 లక్షల రూపాయలతో నిర్మిస్తున్న బీటీ రోడ్డుకు భూమి పూజ చేశారు. ఆలాగే సచివాలయ ఉద్యోగులతో సమీక్ష సమావేశాన్ని నిర్వహించి, ఇంటింటికి వెళ్లి ప్రజల సమస్యలు తెలుసుకుంటూ ప్రభుత్వం ద్వారా వారికి చేకూరిన లబ్ధికి సంబంధించి పత్రాలు అందజేశారు. నివాస గృహాల మధ్య ఎలాంటి రక్షణ లేకుండా అపాయకరంగా ఉన్న విద్యుత్ ట్రాన్స్ ఫార్మర్ చూసిన మంత్రి విద్యుత్ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. వారం రోజుల లోపల సమస్యను పరిష్కరించాలని ఆదేశించారు. ఈ సందర్భంగా మంత్రి జయరాం మాట్లాడుతూ అర్హత ప్రామాణికంగా అన్ని వర్గాల, ప్రజలకు సంక్షేమ ఫలాలను అందించిన ఘనత ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డికే దక్కిందన్నారు. జల జీవన్ పథకం ద్వార ఇంటి ఇంటికి మంచినీటి కుళాయిలకు రూ. 55.00 లక్షలు మంజూరు మంజూరయ్యాయన్నారు. గ్రామంలో 17 లక్షల రూపాయలతో డ్రైనేజ్ పనులకు నిధులు కేటాయించారు. జగనన్న సూరక్ష పథకాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలి కోరారు. ఈ కార్యక్రమంలో ఆలూరు వైకాపా ఇన్చార్జి గుమ్మనూరు నారాయణస్వామి, జడ్పిటిసి దొరబాబు, మాజీ కన్వీనర్ సుంకర రామాంజనేయులు, సొసైటీ చైర్మన్ కట్టెల గోవర్ధన్, జిల్లా కేడీసీసీ డైరెక్టర్ మూడింటి రాఘవేంద్ర, ఎంపీటీసీ శంకరప్ప, మాజీ ఎంపీటీసీలు మురళీమోహన్, ప్రసాద్, సీనియర్ పాత్రికేయులు వెంకన్న, ఆస్పరి, ఆలూరు వైకాపా కన్వీనర్లు పెద్దయ్య, వీరేష్, సొసైటీ సీఈవో అశోక్, మండల జెసిఎస్ మండల కన్వీనర్ బసవరాజు, కేశవరెడ్డి, మండల కో కన్వీనర్ పురుషోత్తం రెడ్డి, రాధాకృష్ణ, నాయుడు, పెద్దిరెడ్డి ఎంపీడీవో రాణమ్మ, సచివాలయ ఉద్యోగులు, గ్రామ వాలంటరీలు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img