Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Sunday, September 8, 2024
Sunday, September 8, 2024

సరికొత్త ఆశలతో.. నూతన సంవత్సర సంబరాలు

సందడిగా నేతల ఇళ్ళు, పార్టీ కార్యాలయాలు

విశాలాంధ్ర ఆస్పరి (కర్నూలు జిల్లా) : 2024 నూతన సంవత్సర సంబరాలు అంబరాన్నంటేలా మండలంలో యువత, విద్యార్ధులు, అధికారులు, వివిధ పార్టీల రాజకీయ నాయకులు, అన్నివర్గాల ప్రజలు జరుపుకోవడం కనిపించింది. సోమవారం పండగ వాతావరణంలో పల్లె పట్టణం అన్న తేడా లేకుండా యువత భాగస్వామ్యంతో వేడుకలు అట్టహాసంగా జరిగాయి. 2023కు వీడ్కోలు చెబుతూ 2024 సంవత్సరానికి స్వాగతం పలకడానికి చిన్నాపెద్దా తేడాలేకుండా రోడ్లపైకి వచ్చారు. స్థానిక సొసైటీ కార్యాలయంలో సీఈఓ అశోక్ నాయుడు ఆధ్వర్యంలో చైర్మన్ కట్టెల గోవర్ధన్, ఎంపీపీ సుంకర ఉమాదేవి భర్త రామాంజనేయులు, వైయస్సార్సీపి మండల కన్వీనర్ పెద్దయ్యలు, సచివాలయ కేంద్రంలో సర్పంచ్ మూలింటి రాధమ్మ, జిల్లా కేడీసీసీ డైరెక్టర్ మూలింటి రాఘవేంద్రలు తాసిల్దార్ కార్యాలయంలో తాసిల్దార్ కుమారస్వామి లు 2024 కేకును కట్ చేస్తూ శుభాకాంక్షలు తెలియస్తూ.. స్వీట్లు పంచిపెట్టారు. క్రైస్తవ సోదరులు చర్చిల్లో ప్రత్యేక ప్రార్దనలు నిర్వహించారు. హిందూదేవాలయాలు భక్తులతో కిటకిటలాడాయి. ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఎన్నికల ఈఏడాదే రానుండటంతో రాజకీయనేతల ఇళ్ళు మరియు పలు పార్టీల కార్యాలయాలు నేతలు, కార్యకర్తలతో సందడి చేసాయి. నూతన సంవత్సరవేడుకల సంధర్భంగా పూలు, పళ్ళకు, ప్రత్యేక బహుమతులకు, బర్త్ డే కేకులకు డిమాండ్‌ పెరిగింది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img