Friday, May 31, 2024
Friday, May 31, 2024

జమ్మూకశ్మీర్‌ ఎన్నికలు ఆసక్తికరం

అనంతనాగ్‌రాజౌరీపైనే అందరి దృష్టి

ప్రధాన పార్టీల మధ్య హోరాహోరీ 7న పోలింగ్‌

జమ్మూకశ్మీర్‌లో ఎన్నికలు ఆసక్తికరంగా సాగుతున్నాయి. 2019, ఆగస్టు 5న 370 అధికరణ రద్దు తర్వాత జమ్మూకశ్మీర్‌లో మొదటిసారి లోక్‌సభ ఎన్నికలు జరుగుతున్నాయి. మొత్తం ఐదు దశల్లో పోలింగ్‌ నిర్వహిస్తున్నారు. ఫలితాలు జూన్‌ 4న వెలువడుతాయి. బారాముల్లా, శ్రీనగర్‌, అనంతనాగ్‌రాజౌరీ, ఉధంపూర్‌, జమ్మూ లోక్‌సభ స్థానాలకు దశలవారీగా ఎన్నికలు జరుగుతున్నాయి. మొదటి దశ అనగా ఏప్రిల్‌ 19న ఉధంపూర్‌, రెండవ దశ అనగా ఏప్రిల్‌ 26న జమ్మూలో పోలింగ్‌ జరిగింది. తాజాగా మూడవ దశలో భాగంగా అనంతనాగ్‌రాజౌరీ స్థానానికి మే 7న ఎన్నికలు జరగబోతున్నాయి. ప్రధాన పార్టీల మధ్య రసవత్తర పోరు సాగబోతోంది. ఆ తర్వాత దశలో శ్రీనగర్‌ లోక్‌సభ స్థానానికి పోలింగ్‌ నిర్వహిస్తారు. ఎన్నికల దృష్ట్యా కేంద్ర పాలిత ప్రాంతంలో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. 635 సీఏపీఎఫ్‌ కంపెనీలను జమ్మూకశ్మీర్‌, లడాఖ్‌లో మోహరించారు. ఈవీఎంలు/స్ట్రాంగ్‌ రూమ్‌ల భద్రతతో పాటు కౌంటింగ్‌ కేంద్రాల వద్ద 36 కంపెనీలు విధులు నిర్వర్తిస్తున్నాయి.
తొలి రెండు దశల్లో ఒకే ఒక్క మహిళ పోటీ
సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా తొలి రెండు దశలు ముగిశాయి. జమ్మూకశ్మీర్‌లో 34 మంది పోటీ చేయగా వీరిలో ఒక్క మహిళ మాత్రమే ఉండటం అక్కడి లింగ అసమానతలకు అద్దం పట్టింది. జాతీయ స్థాయిలో కేవలం ఎనిమిది శాతం మంది మహిళా అభ్యర్థులు ఉండగా జమ్మూకశ్మీర్‌లో అది 2.9శాతానికి పడిపోయింది. ఉధంపూర్‌దోదా లోక్‌సభ స్థానం నుంచి 12 మంది పోటీ చేయగా ఏ పార్టీ కూడా మహిళలకు టికెట్‌ ఇవ్వలేదు. ఓటర్లలో మహిళలు 50శాతం మేర ఉన్నారు. జమ్మూ స్థానంలో 22 మంది పోటీ చేస్తే అందులో ఏకైక మహిళా అభ్యర్థిగా నేషనల్‌ అవామీ యునైటెడ్‌ పార్టీ నేత శిఖా బంద్రాల్‌ నిలిచారు. తర్వలో ఎన్నికలు జరగబోయే అనంతనాగ్‌రాజౌరీ స్థానం నుంచి మొత్తం 22 మంది అదృష్టాన్నీ పరీక్షించుకుంటున్నారు. ఈ స్థానం నుంచి పీడీపీ అధినేత్రి మెహబూబా ముఫ్తీ, స్వతంత్ర అభ్యర్థి గుల్షన్‌ అక్కర్‌ మాత్రమే మహిళా అభ్యర్థులుగా ఉన్నారు. 2019 ఎన్నికలలో జమ్మూకశ్మీర్‌ రాష్ట్రంగా ఉన్నప్పటికీ ముగ్గురు మహిళలు మెహబూబా ముఫ్తీ, రిద్వానా సనమ్‌ (అనంతనాగ్‌ స్వతంత్ర అభ్యర్థి), మీనాక్షి (శివసేనఉధంపూర్‌) మాత్రమే పోటీ చేశారు. ఆ ఎన్నికల తర్వాత సనమ్‌, మీనాక్షి రాజకీయాల నుంచి కనుమరుగయ్యారు. అనంతనాగ్‌ ప్రత్యేక స్థానం కశ్మీర్‌ లోయ, జమ్మూ ప్రాంతాలతో కూడుకున్న అనంతనాగ్‌రాజౌరీ స్థానానికి ప్రత్యేక ఏర్పడిరది. ఇక్కడి ఎన్నిక ఆసక్తికరంగా మారింది. పునర్విభజన తర్వాత రాజౌరీ, పూంచ్‌ ప్రాంతాలు అనంతనాగ్‌ నియోజకవర్గం పరిధిలోకి వచ్చాయి. 2022లో ఏర్పడిన అనంతనాగ్‌` రాజౌరీ నియోజకవర్గంలో అనంతనాగ్‌, షోపియాన్‌, కుల్గామ్‌ జిల్లాలు (దక్షిణ కశ్మీర్‌), జమ్మూకశ్మీర్‌లోని రాజౌరీ, పూంచ్‌ ఉన్నాయి. బీజేపీ తన సీట్లను పెంచుకోవాలని భావిస్తుండటంతో ఈ స్థానంపై దృష్టిని కేంద్రీకరించింది. పునర్విభజన ప్రక్రియలో ఈ నియోజకవర్గం హద్దులు మారాయి. ప్రస్తుతం ఈ స్థానానికి నేషనల్‌ కాన్ఫరెన్స్‌ నాయకులు హస్నైన్‌ మసూదీ ప్రాతినిధ్యం వహిస్తున్నారు. 2019 ఎన్నికల్లో కాంగ్రెస్‌ అభ్యర్థి గులాం నబీ మీదర్‌, పీడీపీ అభ్యర్థి మెహబూబా ముఫ్తీపై మసూదీ గెలుపొందారు. తాజా ఎన్నికల్లో ఈ స్థానం నుంచి పోటీ చేస్తున్న ప్రముఖ అభ్యర్థుల్లో మియాన్‌ అల్తాఫ్‌ లర్వీ (ఎన్‌సీ), మెహబూబా ముఫ్తీ (పీడీపీ), అర్షీద్‌ అహ్మద్‌ లోనె (జమ్మూకశ్మీర్‌ నేషనల్‌ ప్యాంథర్స్‌ పార్టీ), జాఫర్‌ ఇక్బాల్‌ మన్హాస్‌ (అప్నీ పార్టీ), మహమ్మద్‌ సలీం పారే (డెమొక్రాటిక్‌ ప్రోగ్రెసివ్‌ ఆజాద్‌ పార్టీ) ఉన్నారు.

అనంతనాగ్‌రాజౌరీ... పేదధనిక అభ్యర్థులు వీరే
అనంతనాగ్‌` రాజౌరీ లోక్‌సభ స్థానానికి పోటీ చేస్తున్న 20 మంది అభ్యర్థుల్లో ఎటువంటి ఆస్తులు లేని పేద అభ్యర్థిగా జమ్మూకశ్మీర్‌ నేషనల్‌ ప్యాంథర్స్‌ పార్టీ (జేకేఎన్‌పీపీ) తరపున బరిలో నిలిచిన అర్షీద్‌ అహ్మద్‌ లోనె (28) నిలిచారు. ప్రచారం కోసం డబ్బులు లేక తన తండ్రి వద్ద అర్షీద్‌ అప్పు చేశారు. ఎటువంటి ఆదాయం, ఆస్తులు లేనందున ఆదాయపు పన్ను చెల్లించలేదని ఐదేళ్ల రికార్డులు చెబుతున్నాయి. కారు కొనుక్కునేందుకు రూ.2.60లక్షల అప్పు చేసినట్లు అఫిడవిట్‌ పేర్కొంది. అర్షీద్‌ తండ్రి గులామ్‌ మహమ్మద్‌ లోనె యాపిల్‌ సాగుదారుడు. అర ఎకరం పొలంలో యాపిల్‌ సాగు చేస్తారు. ఇదే వారికి జీవనోపాధి. దీనిపైనే వీరి కుటుంబం ఆధారపడుతోంది.
ఇక ధనిక అభ్యర్థుల్లో నేషనల్‌ కాన్ఫరెన్స్‌ తరపున పోటీ చేస్తున్న అల్తాఫ్‌ అహ్మద్‌ది అగ్రస్థానం. ఆయనకు రూ.21 కోట్ల ఆస్తి ఉన్నది. కోటి కంటే తక్కువ ఆస్తిగల ప్రముఖ అభ్యర్థుల్లో మెహబూబా ముఫ్తీ ఒక్కరే ఉన్నారు. ఆమె తన మొత్తం ఆస్తి విలువను రూ.75లక్షలుగా అఫిడవిట్‌లో పేర్కొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img