Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Tuesday, September 17, 2024
Tuesday, September 17, 2024

బ్యాంకింగ్, ఆధార్, ఐటీ… విషయాలలో వచ్చే ఏడాది నుంచి అమల్లోకి రానున్న కొత్త రూల్స్

నూతన సంవత్సరంలో అడుగిడబోతున్నాం. దీంతో పాటూ బ్యాంకింగ్, ఇతర విషయాల్లో పలు కీలక మార్పులు రానున్నాయి. అవేంటంటే..డీమాట్ అకౌంట్ హోల్డర్లు జనవరి 1 లోపు తమ నామినేషన్ వివరాలు సమర్పించాలి. ఈ రూల్ పాటించని వాళ్లు స్టాక్స్‌తో ఎటువంటి లావాదేవీలు నిర్వహించలేరు.
ఆధార్‌ కార్డు వివరాల్లో ఉచితంగా మార్పులు చేసుకునేందుకు డిసెంబర్ 31 చివరి తేదీ. ఆ తరువాత చేసుకునే మార్పులకు రూ.50 రుసుము చెల్లించాల్సి ఉంటుంది. సిమ్ కార్డుల కేవైసీ ధ్రువీకరణ మొత్తం ఇకపై డిజిటల్ రూపంలోనే జరుగుతుంది. ఎటువంటి దరఖాస్తులు నింపాల్సిన అవసరం ఉండదు. కొత్త సిమ్ కొనుగోలు సమయంలో టెలికాం కంపెనీలు కస్టమర్ల నుంచి బయోమెట్రిక్ వివరాలు సేకరిస్తాయి. మోసాలకు కళ్లెం వేసేందుకు ఈ నిబంధన ప్రవేశపెట్టారు. బ్యాంక్ లాకర్లు ఉన్న వారందరూ డిసెంబర్ 31లోపు తమ బ్యాంకులతో రివైజ్డ్ అగ్రిమెంట్లు కుదుర్చుకోవాలి. లేకపోతే, లాకర్‌ను ఫ్రీజ్ చేస్తారు.
కొత్త టెలీకమ్యూనికేషన్ బిల్లు ప్రకారం, ఫేక్ సిమ్‌లు కొనుగోలు చేసేవారికి మూడేళ్ల జైలు, రూ.50 లక్షల జరిమానా విధిస్తారు. 2022-23 ఆర్ధిక సంవత్సరానికి చెందిన ఐటీ రిటర్నుల దాఖలుకు డిసెంబర్ 31 చివరి తేదీ. ఈలోపు పెనాల్టీ సహా రిటర్నులు దాఖలు చేయాలి.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img