Saturday, May 25, 2024
Saturday, May 25, 2024

మోదీ ఇంటిపేరు కేసులో రాహుల్ గాంధీకి ఊరట..

జైలు శిక్ష అమలుపై స్టే విధించిన సుప్రీంకోర్టు!

మోదీ ఇంటి పేరుపై చేసిన వ్యాఖ్యల కేసులో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీకి సుప్రీంకోర్టులో ఊరట లభించింది. సూరత్ కోర్టు విధించిన రెండేళ్ల జైలు శిక్షపై సుప్రీం స్టే విధించింది. శుక్రవారం ఈ మేరకు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. తాను నిర్దోషినని, తనకు విధించిన రెండేళ్ల జైలు శిక్షపై స్టే విధించాలని కోరుతూ సుప్రీంకోర్టును రాహుల్ గాంధీ ఆశ్రయించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో జస్టిస్ బీఆర్ గవాయ్, జస్టిస్ పీఎస్ నరసింహా, జస్టిస్ సంజయ్ కుమార్‌‌తో కూడిన ధర్మాసనం శుక్రవారం విచారణ జరిపింది. ఈ సందర్భంగా రాహుల్ గాంధీ తరఫున సీనియర్ న్యాయవాది అభిషేక్ మను సింఘ్వీ వాదనలు వినిపించారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img