Monday, May 20, 2024
Monday, May 20, 2024

లెఫ్టినెంట్ కమాండర్ మరియు వార్షిక శిక్షణా శిబిరం

కొడవలూరు మండలం , రామన్న పాళెం గ్రామంలో గల ఆది శంకర ఇంజినీరింగ్ కళాశాలలో 10 ఆంధ్ర నేవల్ యూనిట్ ఎన్.సి.సి ,నెల్లూరు లెఫ్టినెంట్ కమాండర్ మరియు వార్షిక శిక్షణా శిబిరం కమాండెంట్ వినయ్ రామచంద్రన్ సారధ్యంలో 13 ఆగస్టు నుంచి నిర్వహించ బడుతున్న వార్షిక శిక్షణా శిబిరంలో భాగంగా కాడెట్లకు పెరేడ్ డ్రిల్, నేవల్ ఓరి యెంటేషన్,సామాజిక అవగాహన, క్రీడలు, ఓడ నిర్మాణంసాహసం, నాయకత్వం,నెల్లూరు నగర వనం దగ్గర గల ఫైరింగ్ రేంజ్ నందు (ఫైరింగ్) తుపాకీ శిక్షణ , రహదారి నియమాలు మరియు భద్రత గురించి వై.రంగనాథ్ గౌడ్ నెల్లూరు సౌత్ ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ అవగాహన కల్పించడం జరిగింది. ఈ కార్యక్రమంలో అసోసియేట్ ఎన్.సి.సి.అధికారులు గుండాల నరేంద్ర బాబు,షేక్ ఖాదర్ బాష, పెంచలయ్య,నాగమోహన్,విద్యా సాగర్,షిప్ మోడలింగ్ శిక్షకులు రామన్, పి.ఐ.స్టాఫ్ సుశీల్ కుమార్ సమోటా, అప్పారావు, ఈశ్వర రావు, చంద్రమోహన్, ఎన్.సి.సి.కేడెట్లు ,కొడవలూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఆరోగ్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img