London Escorts sunderland escorts asyabahis.org www.dumanbet.live www.pinbahiscasino.com sekabet.net olabahisgir.com www.maltcasino.net www.faffbet-giris.com www.asyabahisgo1.com dumanbetyenigiris.com pinbahisgo1.com www.sekabet-giris2.com olabahisgo.com www.maltcasino-giris.com www.faffbet.net betforward1.org betforward.mobi www.1xbet-adres.com 1xbet4iran.com www.romabet1.com www.yasbet2.net 1xirani.com romabet.top 3btforward1.com 1xbet 1xbet-farsi4.com بهترین سایت شرط بندی betforward
Friday, October 18, 2024
Friday, October 18, 2024

అల్ట్రాటెక్ సిమెంట్ ప్రమాద ఘటనపై జ్యుడీషియల్ విచారణ జరిపించాలి – దోనెపూడి శంకర్

ఘటనకు బాధ్యులైన అధికారులను, యాజమాన్యాన్ని కఠినంగా శిక్షించాలి..
చనిపోయిన వారి కుటుంబాలకు కోటి రూపాయలు నష్టపరిహారం చెల్లించాలి…

విశాలాంధ్ర- జగ్గయ్యపేట/వత్సవాయి :అల్ట్రాటెక్ సిమెంట్ ఫ్యాక్టరీలో ఈనెల ఏడో తారీకు జరిగిన ప్రమాదంలో మృత్యువాత చెందిన ఆవుల వెంకటేష్, బాణావత్ స్వామి నాయక్, పరిటాల అర్జునరావు, బొంత శివన్నారాయణ వీరి మృతులకు సంతాపాన్ని తెలియజేశారు…. బుధవారం నాడు బుధవాడ గ్రామంలో మృతుల సంతాప సభ కార్యక్రమంలో ఎన్టీఆర్ జిల్లా సిపిఐ కార్యదర్శి దోనేపూడి శంకర్ మాట్లాడుతూ ఈ ప్రమాదంలో 16 మంది కార్మికులకు క్షతగాత్రులు రావడంతో వీరిలో నలుగురు మరణించడం పదిమంది మృత్యువుతో పోరాడుతున్నారని ఆయన అన్నారు…. ఇంత ప్రమాదం జరిగిన రాష్ట్ర ప్రభుత్వం తగిన రీతిలో స్పందించకపోవడం బాధాకరం యాజమాన్య నిర్లక్ష్యం భద్రత వైఫల్యతే దీనికి ప్రధాన కారణం అని పేర్కొన్నారు… అధికార యంత్రాంగం లంచాల మత్తులో ఊగుతున్న ప్రభుత్వ అధికారులు తనిఖీలను మరచి కార్మికుల ప్రాణాల పట్ల నిర్లక్ష్యం వహించడమే దీనికి కారణం అల్ట్రాటెక్ యాజమాన్యంపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాల్సి ఉన్న ప్రభుత్వం మాత్రం నిమ్మకు నీరెత్తినట్లుగా ఉన్నదని ఎద్దేవా చేశారు నైతిక బాధ్యత వహించాల్సిన ప్రభుత్వం కార్మికుల చావుల పట్ల నిర్లక్ష్య ధోరణితో వ్యవహరిస్తూ ఉందని…. ఫ్యాక్టరీలో వరుస ప్రమాదాలు జరుగుతున్న తమకున్న ఆర్థిక రాజకీయ పలుకుబడితో భద్రతా ప్రమాణాలను గాలికి వదిలేసి కార్మికులను యాజమాన్యం కట్టు బానిసలు లాగా కార్మికుల పట్ల వ్యవహరిస్తూ 16 మంది కార్మికులు క్షతగాత్రులు అవ్వడానికి కారణభూతమైన ఫ్యాక్టరీ యాజమాన్యాన్ని కఠినంగా శిక్షించి ఈ దుర్ఘటనపై న్యాయ విచారణ జరిపించాలని …
– అగ్నికి ఆహుతి అయిన కార్మిక కుటుంబాలకు కోటి రూపాయల నష్టపరిహారం
– గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న కార్మికులకు 50 లక్షల రూపాయలు మరియు పూర్తిస్థాయిలో కోలుకునే వరకు నెలకు లక్ష రూపాయలు పరిహారంగా ఇవ్వాలని
– చట్ట ప్రకారం పర్మినెంట్, కాంట్రాక్టు కార్మికులకు సిమెంట్ బోర్డు నిర్ణయం మేరకు 41016 రూపాయల వేతనం చెల్లించాలని
– సి ఎస్ ఆర్ నిధులను గ్రామాలకు వెచ్చించి అభివృద్ధి చేయాలి
– స్థానికులకు ఉద్యోగ అవకాశాలు కల్పించడంలో పెద్దపీట వేయాలని డిమాండ్ చేశారు…. ఈ ఘటనపై ప్రభుత్వం వెంటనే తక్షణ నిర్ణయం తీసుకొని బాధిత కుటుంబాలకు న్యాయం జరగని పక్షంలో ఉదృతస్థాయిలో ఉద్యమాలను చేపడతామని దోనె పూడి శంకర్ హెచ్చరించారు… కనివిని ఎరుగని రీతిలో పొట్టకూటి కోసం వచ్చిన కార్మికులు మృత్తి ఒడికి చేరిన సంఘటన అత్యంత దౌర్భాగ్యమైన విషయమని రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే ఇటువంటి ప్రమాదాలు వాటిల్లకుండా ఫ్యాక్టరీలకు నియమ నిబంధనలు కఠినంగా ఏర్పాటు చేయాలని సరళీకృతంగా పెట్టిన షరతులు వలన నేడు కార్మికులను పొట్టని పెట్టుకున్న ఘనత అల్ట్రాటెక్ సిమెంట్ కర్మగారానికి దక్కిందని ఏఐటీయూసీ రాష్ట్ర అధ్యక్షులు రావులపల్లి రవీంద్రనాథ్ ఘాటుగా విమర్శించారు.. బాధితులకు న్యాయం జరిగే వరకూ అవిశ్రాంతంగా పోరాడుతామని నియోజకవర్గ సిపిఐ కార్యదర్శి అంబోజి శివాజీ సభాముఖంగా తెలిపారు…. ప్రతిసారి ప్రమాదాలకు గురి చేస్తూ ప్రజలను పొట్టన పెట్టుకుంటున్న అల్ట్రాటెక్ కర్మాగారాన్ని మూతపడేయాలని పట్టణ కార్యదర్శి ప్రముఖ న్యాయవాది జూనెబోయిన శ్రీనివాసరావు అన్నారు…. ఈ కార్యక్రమంలో సిపిఐ రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు బుట్టి రాయప్ప ఏఐటియుసి రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు కొత్తూరి రమణ ఏఐవైఎఫ్ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షులు లంకా గోవిందరాజులు స్థానిక ఏఐటియుసి నాయకులు పోతుపాక వెంకటేశ్వర్లు మా శెట్టి రమేష్ బాబు బుధవాడ ఏఐటీయూసీ బాలాజీ నాయక్ సిపిఐ నాయకులు మహమ్మద్ అసుదుల్లా షేక్ జానీ మేటికల శ్రీనివాసరావు గ్రామ ప్రజలు భారీ స్థాయిలో పాల్గొన్నారు

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img