Thursday, May 9, 2024
Thursday, May 9, 2024

సీనియర్ కామ్రేడ్ ప్రకాష్ రావు మృతి సిపిఐ కి తీరని లోటు – దోనే పూడి శంకర్

( విశాలాంధ్ర) వత్సవాయి/ పెనుగంచిప్రోలు సీనియర్ కామ్రేడ్ ప్రకాష్ రావు(76) మృతి సిపిఐ శ్రేణులకు అత్యంత బాధాకరమని ఎన్టీఆర్ జిల్లా సిపిఐ కార్యదర్శి దోనేపూడి శంకర్అన్నారు…. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కుసుమరాజు ప్రకాష్ రావు 1974 సంవత్సరంలో వీర్లపాడు తాలూకా కౌన్సిల్ నెంబర్ గా మరియు వ్యవసాయ కార్మిక సంఘం నాయకులుగా, విశాలాంధ్ర పత్రిక విలేకరుగా దశాబ్దాల కాలం పాటు పనిచేశారని, జనసేవాదళ్ కర్ర సామ్ విభాగంలో కీలకపాత్ర పోషించారని అదేవిధంగా 2019 వ సంవత్సరం వరకు క్రియాశీలక కార్యకర్తగా ఎంతో చురుగ్గా పాల్గొని వీటితోపాటు ఆర్ఎంపి వైద్యుడిగా రాణిస్తూనే పార్టీలో కీలక పాత్రను పోషిస్తూ పార్టీ అభ్యున్నతికి తోడ్పడుతూ తనకంటూ చెరగని ముద్రను సంపాదించుకున్నారని ప్రజా వైద్యుడిగా పేరుఘడించారని అనడంలో ఎటువంటి సందేహం లేదని పేర్కొన్నారు…. 2022 లో అనారోగ్య సమస్యలను ఎదుర్కొంటూ తన కుమార్తె గ్రామమైన కొనకంచి గ్రామంలో తుది శ్వాసను విడిచారు….. సీనియర్ కామ్రేడ్ ప్రకాష్ రావు కుటుంబానికి భారత కమ్యూనిస్టు పార్టీ ఎల్లవేళలా సహాయ సహకారాలు అందించడంలో వెనకాడబోదని జిల్లా కార్యదర్శి అన్నారు… ఈ కార్యక్రమంలో సిపిఐ నందిగామ నియోజకవర్గ, జిల్లా రైతు సంఘం ప్రధాన కార్యదర్శి చుండూరి సుబ్బారావు, సిపిఐ సెక్రటరిట్ నెంబర్ వల్లం కొండ బ్రహ్మం, సీనియర్ నాయకులు పొన్నం నరసింహారావు, జగ్గయ్యపేట నియోజకవర్గ కార్యదర్శి అంబోజి శివాజీ, నందిగామ మండల కార్యదర్శి మన్నే హనుమంతరావు, సిపిఎం సీనియర్ నాయకులు వట్టి కొండ పార్థసారథి, పద్మాల వెంకటేశ్వరరావు, సీనియర్ నాయకులు మన్యం నారాయణరావు, నందిగామ పట్టణ న్యాయవాది బొందలపాటి రామకృష్ణ, ఏవైఎఫ్ జిల్లా అధ్యక్షులు లంక గోవిందరాజులు, ప్రకాశరావు సహచరులు చెన్నారావుపాలెం మాజీ సర్పంచ్ అబ్దుల్లా, పెనుగంచిప్రోలు మండల కార్యదర్శి కనకపుడి బాబురావు, చందర్లపాడు మండల కార్యదర్శి మరియు విశాలాంధ్ర విలేకర్ ఖాసిం, కృష్ణాజిల్లా సహాయ కార్యదర్శి అడ్డాడ ప్రసాద్ , సీనియర్ కామ్రేడ్ వేల్పుల శాంతయ్య ,వత్సవాయి కార్యదర్శి షేక్ జానీ…. తదితర పార్టీ శ్రేణులు వారి అంతిమయాత్రలో పాలుపంచుకున్నారు

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img