Monday, April 22, 2024
Monday, April 22, 2024

వామపక్ష విద్యార్థి సంఘాల ఆదర్శం

అరుణ్‌ శ్రీ వత్సవ

దిల్లీ జేఎన్‌యూ విశ్వవిద్యాలయంలో జరిగిన విద్యార్థి సంఘాల ఎన్నికల్లో వామపక్ష విద్యార్థిసంఘాలు, దళిత విద్యార్థినాయకుడుకలిసి పోటీ చేసి ఘనవిజయం సాధించారు. మొదటిసారిగా అంటే 27ఏళ్ల తర్వాత దళితవిద్యార్థి (ఏఐఎస్‌ఏ)విద్యార్థి యూనియన్‌ అధ్యక్షుడు ధనుంజయ్‌ ఎన్నికయ్యారు. వామపక్ష, మితవాద శక్తులమధ్య ఈ ఎన్నికల పోరాటం జరిగింది. వామపక్ష విద్యార్థుల విజయం వామపక్ష రాజకీయ పార్టీలకు ఆదర్శనీయమైంది. వామపక్ష పార్టీలు, దళితులు సమైక్యంగా కార్యకలాపాలను నిర్వహించినట్లయితే మత, మితవాద శక్తులను ఎన్నికల్లో ఓడిరచడానికి వీలవుతుంది. చాలాకాలం నుంచి వామపక్షశక్తుల ఐక్యత దేశానికి ప్రయోజనం కలిగిస్తుందన్న అభిప్రాయం బలంగా వ్యక్తమవుతోంది. 2014లో బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత జెఎన్‌యూలో అన్ని డిపార్టుమెంట్లలో వామపక్ష బోధకులను ఉద్యోగాలలో లేకుండా చేయాలని అన్నిరకాల ప్రయత్నాలను చేశారు. వామపక్ష విద్యార్థులలో కూడా యూనివర్సి టీలో పెరగకుండా అణచివేయాలని వ్యూహాలు పన్నారు. ఏబీవీపీ, సంఫ్‌ుపరివార్‌ శక్తులు వామపక్ష విద్యార్థిసంఘాలను ఎదగకుండా చేయాలని అనేక వ్యూహాలు పన్నారు. దీర్ఘకాలంగా జేఎన్‌యూ వామపక్ష విద్యార్థులకు, ఉపాధ్యాయులకు బలమైన స్థావరంగా ఉన్నది. నరేంద్ర మోదీ ప్రధానిగా ప్రభుత్వం అధికారంలోకి వచ్చినతర్వాత వామపక్ష శక్తులను జెఎన్‌యూ నుంచి పూర్తిగా లేకుండా చేయాలని సంఫ్‌ుపరివార్‌ పూనుకున్నది. వామపక్ష విద్యార్థులు జాతీయ వ్యతిరేక శక్తులని ఆర్‌ఎస్‌ఎస్‌, బీజేపీ చివరకు ప్రధాని మోదీ ఆరోపిస్తూ అనేకమంది వామపక్ష విద్యార్థులను అరెస్టుచేయించి జైలుకు పంపారు. ఎటువంటి తప్పుచేయని జెఎన్‌యూ విద్యార్థి సంఘ నాయకుడు, స్కాలర్‌ ఒమర ఖాలిద్‌పై దేశవ్యతిరేకశక్తి అనే ఆరోపణచేస్తూ జైలుకు పంపారు. ఇప్పటికే ఆయన జైలులోనే ఉన్నారు. పౌరసత్వం సవరణ చట్టానికి(సీఏఏ) వ్యతిరేకంగా నిరసన తెలియజేసినందుకే ఉమర్‌ ఖాలిద్‌ను అరెస్టు చేశారు.
జెఎన్‌యూలో ఆర్‌ఎస్‌ఎస్‌, ఏబీవీపీలు విద్యార్థులందరినీ తమవైపు ఆకర్షించాలని పూనుకున్నప్పటికీ సాధ్యం కావడంలేదు. పైగా వామపక్ష విద్యార్థులను ‘తుక్‌డే తుక్‌డే’ గ్యాంగు అంటూ ఈ విద్యార్థులు పాకిస్థాన్‌కు అనుకూలంగా పనిచేస్తున్నారని కూడా సంఫ్‌ుపరివార్‌ శక్తులు ఆరోపించాయి. దాదాపు అన్ని విద్యార్థిసంఘాల నాయకులపై అత్యంత క్రూరమైన జాతివ్యతిరేక చట్టాలకింద కేసు నమోదు చేశారు. యూనివర్సిటీల్లో పాలనా యంత్రాంగాన్ని మోదీ ప్రభుత్వం తమకు అనుకూలమైనవారిని నియమించింది. అలాగే బోధకులను కూడా తమకు అనుకూలమైనవారిని, విద్యా ప్రమాణాలు లేనివారిని నియమించడంవల్ల బోధన నాణ్యతలేకుండా బలహీనమైపోయింది. ఆర్‌ఎస్‌ఎస్‌ భావజాలం కలిగిన వారిని బోధకులుగా నియమించడం వల్ల విద్యలో ప్రామాణికత లోపించింది. వామపక్ష విద్యార్థులంతా కలిసికట్టుగా ఎన్నికల్లో పాల్గొనడం అన్నివామపక్షాలు మార్గదర్శకంగా తీసుకోవలసిన అవసరం ఉంది. వామపక్షపార్టీల నాయకులు ఐక్యతకోసం గట్టిగా కృషి చేసినట్లయితే సాధ్యమవుతుందని అనేక మంది పార్టీ అభిమానులు, కార్యకర్తలు కూడా భావిస్తున్నారు. జెఎన్‌యూలో వామపక్ష విద్యార్థిసంఘాలు ఐక్యమైనప్పుడు విజయాలను సాధిస్తూనేఉన్నాయి. ఈసారి సీపీఐ, ఎంఎల్‌, లిబరేషన్‌కు అనుకూలమైన ఏఐఎస్‌ఎ నాయకుడు ధనుంజయ్‌ అధ్యక్షుడుగా ఎన్నిక కావడానికి కృషిచేసింది. ఇతర సంఘాలను కలుపుకునిపోయేందుకు ఏఐఎస్‌ఏ చొరవతీసుకున్నది. ఐక్యవామపక్ష విద్యార్థులు ఒక్కటిగా నిలిచారు. ఎస్‌ఎఫ్‌ఐ, ఏఐఎస్‌ఎఫ్‌, ఏఐఎస్‌ఏ, డెమొక్రటిక్‌ స్టూడెంట్స్‌ ఫెడరేషన్‌(డిఎస్‌ఎఫ్‌) విద్యార్థులు వివిధ పదవు లకు ఎన్నికయ్యారు. కాషాయదళాలు అన్ని విశ్వవిద్యా లయాల్లోనూ తమకు అనుకూలమైన వాతావరణాన్ని సృష్టించేందుకు ప్రయత్ని స్తున్నారు. ఇందుకు వ్యతిరేకించినవారిపైన దాడులు చేస్తున్నారు. బీజేపీకి ఓటువేసే విద్యార్థులనే ప్రోత్సహిస్తున్నారు. వర్సిటీలపై మత,మితవాద శక్తులుదాడులు సాగించి వామపక్ష విద్యార్థులపై తప్పుడు కేసులు బనాయించి హింసించారు. 5ఏళ్ల తర్వాత 2024లో జరగనున్న ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని యూనివర్సిటీలో గెలుపొం దేందుకు సంఫ్‌ుపరివార్‌ శక్తులు గట్టిగా పనిచేశాయి. అయినప్పటికీ వామపక్ష విద్యార్థులు ఒక్కటిగానిలిచి గెలుపొందారు. గతంలో ఏఐఎస్‌ఎఫ్‌ నాయకుడు కన్హయకుమార్‌, జెఎన్‌యూ విద్యార్థిసంఘ అధ్యక్షుడుగా పనిచేశారు. అయనపైనకూడా దేశద్రోహ నేరంమోపి జైలుపాలు చేశారు. ఈ విధంగా ఆర్‌ఎస్‌ఎస్‌ అనుబంధ శక్తులన్నీ కలిసి అన్ని వర్సిటీలలో, తమకు అనుకూల వాతావరణాన్ని సృష్టించేందుకు ప్రయత్నాలు కొనసాగిస్తూనే ఉన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img