Wednesday, May 8, 2024
Wednesday, May 8, 2024

పదేళ్లలో నాశనమైన వ్యవసాయం

భారత పార్లమెంటుకు, మన రాష్ట్ర శాసనసభకు మే 13న జరిగే ఎన్నికలకు రాజకీయ పార్టీలు సమాయత్తమవుతున్నాయి. రాష్ట్రంలో రైతాంగ స్థితిగతులను దృష్టిలో పెట్టుకొని ప్రతి రాజకీయపార్టీ తమ ఎన్నికల ప్రణాళికలో రైతాంగ శ్రేయస్సు దృష్ట్యా వ్యవసాయరంగానికి ప్రాధాన్యత కల్పించాలి. మన దేశ ఆర్ధిక, సామాజిక నిర్మాణంలో వ్యవసాయానికి అత్యంత ప్రాధాన్యత ఉన్నది. దేశ జనాభాలో 48.6శాతం ప్రజలు పూర్తిగా వ్యవసాయంపై ఆధారపడి జీవిస్తున్నారు. దేశంలో ఉన్న 14.58 కోట్ల రైతు కుటుంబాల చేతుల్లో 38.82 కోట్ల ఎకరాల సాగుభూమి ఉన్నది. సుమారు 7 కోట్ల మంది ఏ మాత్రం భూమిలేని నిరుపేద దళితులు, గిరిజనులు, మైనారిటీలు, బి.సీ.లు కౌలు రైతులుగా జీవనం సాగిస్తున్నారు. వీరే కాకుండా అనుబంధ రంగాలైన పశుపోషణ, పౌల్ట్రీ, ఆక్వా, ఫిషరీస్‌ తదితర రంగాలపై ఆధారపడినవారు పెద్ద సంఖ్యలో గ్రామీణ ప్రాంతాల్లో నివసిస్తున్నారు. పాలకుల విధానాల ఫలితంగా రైతు తన భూమిలోనే కూలీగా మారే పరిస్థితులు ఏర్పడుతున్నాయి.
77 సంవత్సరాల స్వాతంత్రానంతరం బీజేపీ ప్రభుత్వ విధానాలవల్ల ఆర్థిక అసమానతలు పెరిగిపోతూ ప్రపంచ ఆకలిసూచిలో 125 దేశాలకుగాను 111వ స్థానానికి మనదేశం దిగజారింది. దీంతో పేదలు ఆకలి చావులకు, రైతుల ఆత్మహత్యలకు గురవుతున్నారు. 15 కోట్ల మంది నిరుపేదలు ఒక్క పూట తిండికికూడా నోచుకోవడం లేదు. ప్రధాని స్వంత రాష్ట్రం గుజరాత్‌లో 38శాతం మంది పోషకాహార లోపంతో బాధపడుతున్నారు. మరో ప్రక్క ఆర్థిక అసమానతలలో మనదేశం 157 దేశాల్లో 129వ స్థానంలో ఉన్నది. 122 దేశాల నీటి నాణ్యత సూచిలో 120వ స్థానానికి దిగజారింది. స్వచ్ఛమైన గాలి అందించే దేశాల పరిశీలనలో 180 దేశాల్లో 179వ స్థానంలో మనం ఉన్నాము. సంతోషసూచిలో 156 దేశాల్లో 144వ స్థానాన్ని, పత్రికా స్వేచ్ఛలో 180 దేశాల్లో 140వ స్థానాన్ని, పర్యావరణ పరిరక్షణలో 187 దేశాలకుగాను 167వ స్థానానికి దిగజారిందంటే మన దేశం ఆయా రంగాలలో ఎంత వెనకబడి ఉన్నదో అవగతమౌతున్నది. రైతులు గౌరవప్రదంగా కుటుంబ అవసరాలు తీరేలా ఉండాలంటే సమగ్ర పంటల ఉత్పత్తి వ్యయానికి 50శాతం కలిపి చట్టబద్ద మద్దతు ధరలు నిర్ణయించాలని డా.యం.యస్‌.స్వామినాథన్‌ కమీషన్‌ 2006లో సిఫారుసు చేసింది. నేటికి ఆ సిఫారుసులు అమలు కాకపోవడంతో రైతాంగం ప్రతి సంవత్సరం సుమారు 3 లక్షల కోట్లు నష్టపోతున్నారు. పెరుగుతున్న ఉత్పత్తి ఖర్చులకనుగుణంగా మద్దతు ధరలు పెరగకపోవడం, ప్రకృతి వైపరీత్యాలు, తెగుళ్ళతో పంట నష్టాలు, రుణాలు సక్రమంగా అందక అధిక వడ్డీల భారం, పంటల బీమా వర్తించకపోవడం తదితర కారణాలవల్ల రైతాంగ ఆదాయం తగ్గిపోతున్నది. ఫలితంగా వ్యవసాయ రంగ ప్రభావంతో గ్రామీణ ప్రజలు, చేతివృత్తిదారులు, నిరుపేదలు ఆకలితో అలమటించే పరిస్థితి ఏర్పడుతోంది. వ్యవసాయ సంస్కరణల ప్రభావంతో గత 25 సంవత్సరాల కాలంలో సుమారు 4 లక్షల మందికి పైగా రైతులు ఆత్మహత్యలపాలయ్యారు. స్వామినాథన్‌ కమీషన్‌ సిఫార్సుల ప్రకారం మద్దతు ధరలు కల్పిస్తామని రైతుల ఆదాయాన్ని రెట్టింపుచేస్తామన్న మోదీ ప్రభుత్వ హయాంలో సుమారు లక్షన్నర మంది రైతులు ఆత్మహత్యలకు పాల్పడ్డారంటే నేటి వ్యవసాయరంగ దుస్థితికి అద్దం పడుతున్నది. వ్యవసాయం గిట్టుబాటుకాక ప్రతి రోజూ సగటున 2400 మంది రైతులు వ్యవసాయాన్ని వదిలి ఇతర వృత్తుల్లోకి వెళుతున్నారు. ప్రతిరోజూ 30 మంది రైతులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. దేశ వ్యాప్తంగా ప్రతి రైతుకుటుంబంపై సగటున 74 వేల రూపాయల రుణభారం ఉన్నది. 1950 దశకంలో వ్యవసాయ, వ్యవసాయేతర రంగాల సగటు ఆదాయ నిష్పత్తి 1:2 ఉండగా ప్రస్తుతం ఈ వ్యత్యాసం 1:12కు పెరిగింది. 2000 సంవత్సరం నుండి 2017 వరకు మద్దతు ధరలు సక్రమంగా లభించని కారణంగా మన దేశ రైతాంగం 45 లక్షల కోట్లు నష్టపోయినట్లు ఐ.సి.ఎ.ఐ.ఆర్‌. నివేదిక స్పష్టం చేసింది. ఇదిలాఉండగా వ్యవసాయానికి, రైతాంగానికి తీవ్ర నష్టదాయకంగా కేంద్రం రూపొందించిన మూడు వ్యవసాయ నల్ల చట్టాలు (1)రైతుల ఉత్పత్తి- వ్యాపారం-వాణిజ్య చట్టం-2020, (2) రైతులకు ధరల హామీ – వ్యవసాయ సేవల ఒప్పంద చట్టం-2020, (3) నిత్యావసర సరుకుల (సవరణ) చట్టం – 2020, విద్యుత్‌ బిల్లు- 2020 రద్దు చేయాలని డా.ఎం.ఎస్‌. స్వామినాథన్‌ కమీషన్‌ సిఫార్సుల ప్రకారం (సి2ం50%) చట్టబద్ద ఎమ్‌ఎస్‌పీ నిర్ణయించా లని, ఒక్క పర్యాయం పంట రుణాలు మాఫీ చేయాలని, కేరళ తరహా రుణ విమోచన చట్టం చేయాలన్న రైతాంగ డిమాండ్లను ఆమోదించి లిఖితపూర్వక హామీ ఇచ్చిన కేంద్రం నేటికి అమలు చేయకుండా మోసం చేయ్యడంతో దేశవ్యాప్తంగానూ, దిల్లీ సరిహద్దుల్లోనూ మరో మారు రైతాంగం ఉద్యమించక తప్పలేదు. రైతాంగంపట్ల, ప్రజలపట్ల దుర్మార్గంగా, నిర్లక్ష్యంగా ఉంటూ పేదరికాన్ని పెంచి పోషిస్తూ కార్పోరేట్‌ ఆస్తుల పెంపునకు నిస్సుగ్గుగా దోహద పడుతున్న బీజేపీి మరోమారు అధికారంలోకి రాకుండా నిరోధించాలి. రైతు వ్యతిరేక చట్టాలు, విధానాలు రూపొందించి నేటి వ్యవసాయరంగ దుస్థితికి కారణమైన మోదీ విధానాలకు రాష్ట్రంలోని అధికార వైసీపీ, ప్రతిపక్ష తెలుగు దేశం వత్తాసు పలుకుతూ ‘‘డూడూ బసవన్నల’’ మాదిరి వ్యవహరిసు ్తన్నాయి. 65శాతం జనాభా ఉన్న రాష్ట్రంలో వ్యవసాయరంగంపై ఆధారపడ్డారు. సుమారు 76.24 లక్షల వ్యవసాయ కమతాలు ఉన్నాయి. 136 రకాల పంటలు మన రైతాంగం పండిస్తున్నారు. వ్యవసాయరంగంలో మార్పులతో కౌలు రైతుల సంఖ్య గణనీయంగా పెరిగింది. సాగుభూమిలో 70శాతం, సాగుదారులుగా 80శాతం ఉన్న కౌలు రైతుల సంక్షేమానికి చట్టాలు చేసినా అమలులో చిత్తశుద్ది కొరవడిరది. కౌలు రైతుల ఆత్మహత్యలలో మన రాష్ట్రం 2వ స్థానంలో ఉన్నదంటే పాలకుల నైజం అర్ధమవుతున్నది. పంటలకు గిట్టుబాటు ధరలులేక, ప్రభుత్వాల ప్రోత్సాహాలు లభించక రైతాంగం అప్పుల భారంతో సత మత మౌతున్నారు. రాష్ట్రంలో ప్రతి రైతు కుటుంబంపై 2.45 లక్షల రుణభారం ఉన్నది. అప్పులు తీరే దారిలేక చివరకు ఆత్మహత్యలే శరణ్యంగా రైతాంగం భావిస్తున్నారు. రైతాంగ ఆత్మహత్యల్లో రాష్ట్రం 3వస్థానంలో ఉన్నది. మరోపక్క పర్యావరణ మార్పులతోపాటు మద్దతు ధరలు నోచుకోక రాష్ట్రంలో సాగునీటి ప్రాజెక్టులు పూర్తికాక నీటి సదుపాయం అందక ఏ ఏటికాఏడు పంటలసాగు తగ్గిపోతున్నది. తెలుగుదేశం, వైసీపీ ప్రభుత్వాలు మైక్రో ఇరిగేషన్‌ పథకాలకు నిధులు మంజూరుచేయక ఆ పథకాలు నిలిచిపోయాయి. పోలవరంతోపాటు సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణం ముందుకుసాగక గత 5 సంవత్సరాలకాలంలో ఒక్క ఎకరా అదనంగా సాగు జరిగింది లేదు. అట్టహసంగా 2020లో ప్రారం భించిన జలకళ పథకంలో బోర్లు వేయించుకునేందుకు 2,32,789 దర ఖాస్తులు రైతాంగం చేసుకుంటే బోర్లు వేసింది మాత్రం కేవలం 23,115 మాత్రమే. బోర్లు వేసుకున్న రైతుల్లో విద్యుత్‌ సౌకర్యం కల్పించింది 3,500 మందికి మాత్రమే. ఏతా వాతా జలకళ పథకం పూర్తిగా అటకెక్కింది. కేంద్ర ప్రభుత్వం వ్యవసాయ, అనుబంధ రంగాలకు చెందిన వివిధ పథకాలకు రాష్ట్ర ప్రభుత్వం చెల్లించాల్సిన మ్యాచింగ్‌ గ్రాంట్‌ కూడా ప్రభుత్వం ఇవ్వలేక సదరు పథకాలు రైతాంగానికి అందకుండా దుర్వినియోగం అయ్యాయి. అష్టకష్టాలు పడుతూ వ్యవసాయం చేస్తున్న రైతాంగాన్ని ఆదుకోవడంలోనూ తమ విధానాల కారణంగాను అప్పుల భారంతో ఉన్న రైతులకు రుణమాఫీ చేయడంలోనూ వైసీపీ ప్రభుత్వం ఏ మాత్రం పట్టించుకోలేదు. ప్రస్తుతం ప్రతిపక్షంగా ఉన్న గత తెలుగుదేశ ప్రభుత్వ హయాంలో రైతుల రుణమాఫీ చేస్తామని చెప్పి కేవలం 24,500 కోట్లు మాఫీ చేయడానికి సిద్దపడి 15,000 కోట్లు మాత్రమే మాఫీ చేసి మిగిలిన 9,500 కోట్లు మాఫీ చెయ్యకుండా రైతాంగాన్ని మోసం చేసింది. రైతాంగాన్ని ఆదుకోవడంలో తెలుగుదేశం, వైసీపీ ప్రభుత్వాలు ఒకరిని మించి ఒకరు మోసం చేస్తూనే ఉన్నారు. రాజధాని ప్రాంత రైతులు రాష్ట్ర విభజనతో రాజధాని నిర్మాణం కోసం సుమారు 30 వేల మంది 34,387 ఎకరాల భూములను భూ సమీకరణ చట్టం మేరకు ఇచ్చారు. వైసీపీ అధికారంలోకి వచ్చిన అనంతరం రాజధానికి భూములిచ్చిన రైతు కుటుంబాల భవిష్యత్తు పశ్నార్థకమైంది. రాజధాని నిర్మాణం నిలిచిపోయింది. రాజధాని పరిరక్షణే లక్ష్యంగా భూములిచ్చిన రైతులు అలుపెరగని పోరాటం చేస్తున్నారు. ఈ దశలో రాష్ట్రంలో మే 13న జరిగే పార్లమెంటు, అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీల జెండాలు కాకుండా ప్రణాళికలకు ప్రత్యేక ప్రాధాన్యతనిచ్చేలా ఒత్తిడి తేవాల్సిన ఆవశ్యకతను రైతాంగం గుర్తిం చాలి. రాజకీయ పార్టీలు మోసపూరితమైన హామీలు విడనాడి వ్యవసాయరంగ పురోభివృద్ధికి రైతుల ఆదాయం పెరిగే రీతిలో ప్రణాళికలు రూపొందించి చిత్తశుద్ధితో అమలుకు కృషి చేయాలి. ఇందుకోసం రైతాంగపక్షాన రైతాంగ అభి పాయాలతో కూడిన ఈ క్రింది ఆంశాలను రాజకీయ పార్టీలు దృష్టిలో పెట్టుకొని తమరు రూపొందించే ప్రణాళికలో పొందుపర్చాలి.

ఏపీ రైతు సంఘం ప్రధాన కార్యదర్శి
సెల్‌: 9490952737

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img