Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Tuesday, September 17, 2024
Tuesday, September 17, 2024

మోదీ మార్కు ప్రజాస్వామ్యం

బండారు రాధాకృష్ణ

రా బావ ఈసారి చాలా రోజులైంది వచ్చి. అది సరేగాని నువ్వు సిద్దమా. దేనికి ఏంటలా అడుగుతున్నావ్‌. అదేనయ్యా జగన్‌, చంద్రబాబు నేను సిద్దం అంటే నేను సిద్దం అంటున్నారు కదా. అదా సంగతి. వారిద్దరు మరో మూడు నెలల్లో జరగబోయె ఎన్నికలకు సిద్దం అంటున్నారు. నువు నన్ను సిద్దమా అంటే నేనేమి చెప్పను. నాకు రాజకీయంగా పార్టీ లేదు కదా. అదికాదయ్యా వారు ఎన్నికలకు సిద్దం అంటే మనం ఏదో పార్టీకి ఓటేయడానికి సిద్దపడాలి కదా. అందుకు నువు సిద్దమా అని అడుగుతున్నా. అదా భలేవాడివయ్యా విషయం చెప్పకుండా రాగానే సిద్దమా అంటే నీతో కుస్తీ పట్టాలేమో అని కంగారుపడ్డాను. అదే బావ ఈసారి నిజంగా పోటాపోటీగా కుస్తీకి సిద్దమా అన్నట్లుగా ఉంది. అంతకు ముందు మళ్లీ జగనే అనుకున్న ఓటర్లు పవన్‌, చంద్రబాబు కలసి పోటీకి సిద్దపడటంతో నువు అన్నట్లు నువ్వా నేనా అన్నట్లుగానే ఉంది. పందెం కోళ్లు బరిలో కాలు దువ్వినట్లుగానేె యిరుపక్షాల మాటలున్నాయి. అదిసరే యిరుపక్షాలు మోదీకు తల ఒగ్గినట్లు మాట్లాడుతున్నారు. ఇక్కడ ఉంటే కమ్యూనిస్టుల ప్రభావం ఉండవచ్చుగాని మోదీ కేముందని అలా తలవొగ్గి మాట్లాడుతున్నారు. అదేనయ్యా కొత్తగా మోదీ మార్కు ప్రజాస్వామ్యం ఒకటి సృష్టించాడు కదా. అదేంటి అంటావేమిటయ్యా కేంద్రం అన్ని రాష్ట్రాలను సమాన దృష్టితో చూడాలి. అదిలేదు సరికదా ప్రతిపక్ష పార్టీల నాయకులను కేసుల్లో యిరికించి గుప్పెట్లో పెట్టుకుని తనకిష్ట మొచ్చినట్లు ఆడిస్తున్నాడు కదా. అంతెందుకు యిటీవల బాలరాముణ్ణి ప్రతిష్ఠించారు కదా. ఆయన వ్యక్తిగతంగా మోదీగా కాకుండా ప్రధానిగా వెళ్లినట్లే అక్కడ ఆర్భాటాలన్నీ జరిగాయి. నిజమే బావ నాకు తెలియక అడుగుతాను. మన ప్రజాస్వామ్యంలో అన్ని మతాలను సమ దృష్టితో చూడాలి కదా. మరి మసీదుకు చర్చికి కూడా అలాగే వెడతాడా. అదేనయ్యా వ్యక్తిగతంగానేె తను నమ్మిన దేవున్ని యింట్లోనే పూజించుకోవాలి కాని యిలా ఒక ప్రధానిగా ఒక మతానికే విలువిచ్చ మాట్లాడటం కరెక్టు కాదుకదా. అదేనయ్యా అసలు అడిగేదెవరు. అందుకే ఒక ప్రజాస్వామ్య దేశానికి ప్రధాని కాకుండా ఒక రాజ్యానికి రాజుగా, నియంతగా మారాడు. నిర్మాణం పూర్తి కాకుండా ప్రతిష్ఠించడం మంచిది కాదన్న పీఠాధిపతుల మాటలు పెడచెవిన పెట్టి కార్యక్రమం పూర్తి చేశాడు. అసలు విషయం అదికాదయ్యా ఎన్నికలు దగ్గరపడటంతో రామాలయ నిర్మాణం పేరిట హిందువుల మనసు కొల్లగొట్టి మూడవసారి ప్రధాని కావడమే ఆయన ధ్యేయం. అందుకోసం పీఠాధిపతుల మాట ఖాతరు చేయలేదు. అది సరే నిత్యావసరాల వస్తువుల ధరలు పెరిగి పేదలు బతకటమే కష్టంగా మారిన సమయంలో మరల బీజేపీ విజయం సాధిస్తుందంటావా. ప్రతిపక్షాల అనైక్యత, బలహీనమే బీజేపీ విజయానికి కారణం.
ప్రతిపక్షాలన్నీ కలసి ఇండియా అనగానేె ప్రజలు మోదీ పతనం ఖాయమనుకున్నారు. అంతలోనేె నితీశ్‌ జంపై 9వ సారి ముఖ్యమంత్రి అయి ఇండియాకు గండికొట్టాడు. అది సరెే బావ అసలు ఇప్పుడు నిర్మించిన రామాలయం అంతకు ముందు మసీదు కద. అదేనయ్యా అంతకుముందు రామాలయం ధ్వంసం చేసి మసీదు నిర్మించారని కోర్టుకెళ్లి విజయం సాధించి మరల రామాలయం నిర్మించారు. అంతటితో ఆగకుండా కాశీలోని జ్ఞానవాపి మసీదు పక్కన హిందు ఆలయం ఉందని దాన్ని కూడా కూల్చే దిశలో ప్రయత్నాలు సాగుతున్నాయి. ఇప్పటికే జ్ఞానవాపిలో హిందువులు వెళ్లి పూజలు చేసుకోవచ్చునని కోర్టు అనుమతించింది. వారికి రాముడొకడేె దేముడు. అది సరెే నాకు ఆశ్చర్యం కల్గించె విషయమేమిటంటె పక్క మనిషిని గౌరవించరు హీనంగా చూస్తారు. పరమత సహనం లేదు. గుడి కట్టిన మనిషికి కనపడని దేవునికి నమస్కరించి కోట్లు ఖర్చు చేసి ఉత్సవాలు చేస్తారు. కాని పూట గడవని నిరుపేదకు సాయం చేయరు. నిజంగా దేవుడుంటేె యిటువంటి భక్తుల్ని క్షమిస్తాడా అని నాకు సందేహం. అయోధ్య రాముడు దేశ పౌరులందరిని ఏకం చేశాడని ప్రధాని భాష్యం. రాజ్యాంగ కర్తలందరు రామున్ని ఆదర్శంగా తీసుకోవాలని హితవు. ఇకపై రాజ్యాంగ రూపకర్త అంబేద్కరు లాంటి వారితో పనిలేదు. రాముల వారెే దేశాన్ని పరిపాలిస్తాడట. అయితేె రాముని పాలనలో ఒక రజకుని మాటకు విలువిచ్చి భార్యను అడవిలో వదిలేశాడు. మరి మోదీ కూడా అట్టడుగు వర్గాల మాటలకు విలువిచ్చి సమతా ధర్మం పాటించి ఎస్‌సి, బీసీలకు ప్రాధాన్యమిచ్చి రాబోయే ఎన్నికలలో వారికి సీట్లు యిచ్చి వారినే ప్రధానిని చేస్తాడా అని నాకనుమానం బావ. భలేవాడివయ్యా రాజకీయ నాయకులు చెప్పేదొకటి, చేసేది మరొకటని తెలిసి అలా అడుగుతావేంటి నువు కూడా నమ్మినట్లు నటించాలి అంతే.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img