Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Tuesday, September 17, 2024
Tuesday, September 17, 2024

సహకారానికి ఆర్బీఐ సంకెళ్లు

డాక్టర్‌ సీ.ఎన్‌. క్షేత్రపాల్‌రెడ్డి

సహకార వ్యవస్థ (కోపరేటివ్‌ మూమెంట్‌) ఆదర్శాలతో బ్యాంకింగ్‌ రంగంలో కృషిచేస్తున్న సంస్థలే సహకార బ్యాంకులు. బ్రిటీష్‌ కాలంలో కోఆపరేటివ్‌ క్రెడిట్‌ సొసైటీస్‌ చట్టం1904, 1912 నాటి సహకార సంఘాల చట్టాల ద్వారా సహకార బ్యాంకుల ఏర్పాటు జరిగింది. సెంట్రల్‌ కమిటీ ఫర్‌ కోఆపరేటివ్‌ ట్రైనింగ్‌ సెంటర్‌ ఏర్పాటై శిక్షణ ఇవ్వడంతో 1950ల నాటికి దేశవ్యాప్తంగా గ్రామీణ, పట్టణ ప్రాంతాలలో తమ సేవలను ప్రారంభించాయి. సభ్యులే ఈ బ్యాంకులకు యజమానులు. డెరైక్టర్ల (బ్యాంకు పాలకవర్గం) ఎంపిక చాలా ప్రజాస్వామ్యయుతంగా జరుగుతుంది. స్టేట్‌ రిజిస్ట్రార్‌ ఆఫ్‌ కో-ఆపరేటివ్‌ సొసైటీస్‌, సెంట్రల్‌ రిజిస్ట్రార్‌ ఆఫ్‌ కో-ఆపరేటివ్‌ సొసైటీస్‌ల ఆధ్వర్యంలో ఆయా చట్టాల పరిధిలో ఈ ప్రక్రియ సాగుతుంది. బ్యాంకు సభ్యుల నుంచే డైరెక్టర్లు, బోర్డు సభ్యులు ఎన్నికల ద్వారా పాలకవర్గంగా ఏర్పడి కార్యకాలాపాలను నిర్వహిస్తారు. బ్యాంకింగ్‌ రెగ్యులేషన్స్‌ యాక్ట్‌1949 కి 1965లో చేసిన సవరణల ప్రకారం ద్వంద్వ నియంత్రణ అమలులోకివచ్చి బ్యాంకింగ్‌ కార్యకలాపాలు మాత్రమే ఆర్బీఐ నియంత్రణలో జరుగుతున్నాయి. ‘నష్టం`లాభం’ లేని పద్దతిలో పరస్పర సహకారమే ఈ బ్యాంకుల ప్రధాన లక్ష్యం. తమ కార్యకలాపాల ద్వారా సాధిస్తున్న మిగులులో నుండి 25 శాతం నిధులను రిజర్వుడ్‌ ఫండ్‌గా, 10 శాతం నిధులను విపత్కర పరిస్థితుల కోసం, 1 శాతం సహకార విద్యానిధికి కేటాయించి తక్కిన నిధులను సభ్యులకు డివిడెండ్ల రూపంలో, ఉద్యోగులకు బోనస్‌, సభ్యుల సంక్షేమ నిధికి కేటాయింపులు చేసి ఆర్బీఐ నుంచి ఆర్థిక ప్రయోజనాలను, ప్రభుత్వ సహకారాన్ని ఆశించకుండా పనిచేస్తున్నాయి. పేద, మధ్యతరగతి సహా వివిధ రంగాలకు చేయూతనిస్తూ ఆర్థిక వ్యవస్థ అభివృద్ధిలో, ప్రజల్లో పొదుపు అలవాటును ప్రోత్సహించడంలో ముందున్నాయి.
అయితే ఇటీవల ఆర్బీఐ తీసుకుంటున్న నిర్ణయాలు, మితిమీరిన అనవసర జోక్యం, సహకార బ్యాంకుల ఉనికిని ప్రశ్నార్థకం చేస్తున్నాయి. బ్యాంకింగ్‌ కార్యకలాపాల విషయంలోనే కాకుండా తమకు ఏ మాత్రం సంబంధంలేని పాలకవర్గాల విషయంలోనూ అనవరంగా జోక్యంతో ఆధిపత్యాన్ని ప్రదర్శించేందుకు ఉవ్విళ్లూరుతోంది. పాలకవర్గం విషయంలో ఆర్బీఐకి ఎటువంటి హక్కులు లేవు. బ్యాంకింగు కార్యకలాపాలవరకే నియంత్రణ ఉన్నా పాలకవర్గాలపైనా తీవ్రమైన నిర్బంధాలకు దిగుతోంది. బహుళ రాష్ట్రాల్లో కార్యకలాపాలను నిర్వహిస్తోన్నది విశాఖపట్నం కోపరేటివ్‌ అర్బన్‌ బ్యాంకు పాలకవర్గం విషయంలో చూపిన అత్యుత్సాహమే ఇందుకు తాజా ఉదాహరణ. అయితే 2022, ఏప్రిల్‌ 21న దేశంలోని కొన్ని అర్బన్‌ బ్యాంకులు తమ పాలకవర్గంలో డైరెక్టర్లుగా ఎన్నికకాని వ్యక్తులను ఎమిరిటస్‌ చైర్మన్‌, గ్రూప్‌ చైర్మన్‌ పేర్లతో ప్రత్యేక హోదాలిస్తున్నారని, తక్షణమే ఆ పదవులను తొలగించాలని ఆదేశిస్తూ సర్కులర్‌ను జారీ చేసింది.
విశాఖ కోపరేటివ్‌ బ్యాంకు సర్వసభ్య సమావేశంలో బ్యాంకు సభ్యులు ఎన్నుకున్న డైరెక్టర్‌, మాజీ చైర్మన్‌గానూ పనిచేసిన వ్యక్తి ఎమిరటస్‌ చైర్మన్‌గా ఉన్నారు. ఈ ఎన్నికకోసం బ్యాంకు బైెలాను కఠినమైన నిబంధనలతో సవరణలుచేసి 2014లోనే కేంద్ర సహకార సంఘాల కమిషనర్‌ వద్ద నమోదు చేయించారు. ఈ నేపథ్యంలో ఆర్బీఐ జారీచేసిన సర్కులర్‌ ప్రకారం, తమ పాలకవర్గంలో సభ్యులచేత ఎన్నికకాని డైరెక్టర్‌ ఎమిరటస్‌ చైర్మన్‌గా వ్యవహరించడంలేదని, ఈ సర్కులర్‌ తమకు వర్తిస్తుందా లేదా వివరణ ఇవ్వాలని కోరుతూ ఆర్బీఐకి ఆ బ్యాంకు లేఖ రాసింది. ఈ లేఖపై స్పందించిన ఆర్బీఐ చాలా కటువుగా ఎమిరటస్‌ చైర్మన్‌ అనేది ఉండడానికి వీల్లేదంటూ ఆ బాధ్యతల్లో పనిచేస్తున్న వ్యక్తి పేరును ప్రస్తావిస్తూ హుకుం జారీ చేసింది. ఇది ఆర్బీఐ ఏకపక్ష ధోరణికి పరాకాష్ట. తమ పరిధిలోకి రాని పాలకవర్గం విషయంలో సర్క్యులర్‌ ఇవ్వడమే అన్యాయం. చట్ట ప్రకారం రూపొందిన సంస్థ బైలాకు విరుద్దంగా బ్యాంకు నడవాలని ఆర్బీఐ ఆదేశించడం బాధ్యతా రాహిత్యమే. ఇది ప్రజాస్వామ్యబద్దంగా పార్లమెంటు ద్వారా ఏర్పాటైన సంస్థ చేయాల్సిన పనికాదు. రాజ్యాంగ నియమాలు, 97 వ రాజ్యాంగ సవరణ అంశంపై ఇటీవల సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును పరిశీలించినా ఈ అంశం రుజువవుతుంది.
ఆర్బీఐ ప్రకారం దేశంలో 1,514 అర్బన్‌ కోపరేటివ్‌ బ్యాంకులు పనిచేస్తున్నాయి. వీటిలో 52 బ్యాంకులకే షెడ్యూల్డ్‌ హోదా ఉంది. గత 18 ఏళ్లుగా అర్బన్‌ బ్యాంకులకు షెడ్యూల్డ్‌ హోదా ఇవ్వకుండా ఆర్బీఐ నియంత్రణ పెట్టింది. చిన్న చిన్న ప్రైవేటు బ్యాంకులకు మాత్రం షెడ్యూల్డ్‌ హోదా కట్టబెట్టడం సహకార రంగంపై ఆర్బీఐకి ఉన్న వివక్షకు తార్కాణం. ప్రైవేటు బ్యాంకులు కోరడమే తడవుగా కొత్త బ్రాంచీల ఏర్పాటుకు అనుమతులు మంజూరుచేస్తూ సహకారరంగంలో పనిచేస్తున్న బ్యాంకుల విషయంలో ఇందుకు విరుద్ధంగా వ్యవహరిస్తోందనే విమర్శలున్నాయి. మోదీ ప్రభుత్వం కరోనా లాక్‌డౌన్‌ కాలంలో ఎటువంటి చర్చలకు అవకాశం లేకుండా బ్యాంకింగ్‌ నియంత్రణ చట్టం 1949కి అనేక సవరణలు చేసింది. ఈ సవరణలన్నీ సహకార అర్బన్‌ బ్యాంకులే లక్ష్యంగా వాటి ఉనికిని ప్రశ్నార్థకం చేయడానికేననే ఆరోపణలొచ్చాయి. సహకార సూత్రాలకు విరుద్దంగాచేసిన ఈ సవరణలపై కోర్టుల్లో కేసులు విచారణలో ఉన్నాయి. బ్యాంకు సీఈవో, ఎండీల నియామకాల విషయంలో ఆర్బీఐ జారీచేసిన ఉత్తర్వులపై వివిధ హైకోర్టులు స్టే విధించాయి. అయినా పాలకవర్గంలోని వ్యక్తుల అర్హతలు, పదవీ కాలం, సంస్థ నుంచి సభ్యులు వైదొలగడం, ఎన్నికలు, షేరు ధనం వాపసు తదితర అంశాల్లో దుందుడుకు చర్యలకు దిగుతోంది.
మోదీ ప్రభుత్వహయాంలో ఆర్బీఐ తన స్వతంత్రతను కోల్పోయిందనే విమర్శలున్నాయి. గత ఏడాది జరిగిన గుజరాత్‌, హిమాచల్‌ ప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికలు తరుణంలో ఆర్బీఐకి చెప్పకుండా ప్రభుత్వమే ఎన్నికల బాండ్ల గడువు పెంచడం వివాదాస్పదమైంది. ఇందుకు ఆర్బీఐ ఆమోదం లేదనే విషయం సామాజిక కార్యకర్త లోకేశ్‌ కె.బాత్రా దాఖలుచేసిన సమాచార దరఖాస్తు వెల్లడిరచింది. తాజాగా రెండు వేలనోటును వెనక్కు తీసుకుంటున్నట్టు ప్రకటించిన ఆర్బీఐ గతంలో వెయ్యి, రూ.500 నోట్లను రద్దు చేస్తున్నట్టు తామే ప్రకటించలేని నిస్సహాయతకు కారణం మిలియన్‌ డాలర్ల ప్రశ్న. ఆర్బీఐలో ఉండే ఆర్థిక నిల్వలపైనా అనేక వివాదాలు నెలకొన్నాయి. మోదీ హయాంలో లక్షల కోట్ల రిజర్వు నిధులను ఆర్బీఐ కేంద్ర ప్రభుత్వానికి బదిలీ చేయడం ఇందులో ప్రధానం.
దేశ బ్యాంకింగ్‌ రంగంలో ప్రస్తుతం అమలవుతున్న లైసెన్స్‌, నియంత్రణ విధానాలను పరిశీలించిన ఆర్బీఐ అంతర్గత కార్యనిర్వహణ గ్రూప్‌ నవంబరు 20, 2020 న సమర్పించిన నివేదికలో కార్పొరేట్లకు బ్యాంకులను ఏర్పాటుచేసుకునే అవకాశమివ్వాలని ప్రతిపాదించింది. 1949 బ్యాంకింగ్‌ నియంత్రణ చట్టానికి సవరణలుచేసి బడా కార్పొరేట్‌, పారిశ్రామిక సంస్థలను బ్యాంకింగ్‌లోకి అనుమతించాలని సూచించడం వివాదాస్పదం. రూ.50వేల కోట్ల ఆస్తులుండి, బ్యాంకింగేతర ఆర్థిక కార్య కలాపాలు నిర్వహిస్తున్న కంపెనీలకు పూర్తిస్థాయి బ్యాంకింగ్‌ కార్య కలాపాలు నిర్వహించుకునేందుకు అనుమతులు ఇవ్వాలనేది మరో సిఫారసు. ప్రసన్నకుమార్‌ మహంతి నాయకత్వంలో చేసిన సిఫారసుల వెనుక కార్పోరేట్ల ఒత్తిడి ఉందనే చర్చ నడుస్తోంది. కార్పొరేట్‌ల ఒత్తిడికి లొంగిపోతే ఇప్పటికే పెరిగిపోయిన మొండిబాకీల భారంనుండి బ్యాంకింగ్‌ రంగం బయటపడే అవకాశాలు సన్నగిల్లి పోతాయి. ఆ బ్యాంకులేవీ సామాజిక బాధ్యతను నిర్వర్తించవు కాబట్టే ఆర్బీఐ ఇప్పటి వరకూ ఏ కార్పొరేట్‌ సంస్థకూ బ్యాంకుల ఏర్పాటుకు ఆర్బీఐ అనుమతివ్వలేదు. కార్పొరేట్ల ఒత్తిడికి తలొగ్గకుండా ఇకపైనా పని చేస్తుందా అనేది ప్రశ్నార్ధకమే.
సెల్‌: 9059837847

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img