Bahis Siteleri Bahis Siteleri Bahis Siteleri Bahis Siteleri Bahis Siteleri Bahis Siteleri Bahis Siteleri Bahis Siteleri Bahis Siteleri Bahis Siteleri Bahis Siteleri Bahis Siteleri Bahis Siteleri Bahis Siteleri Bahis Siteleri deneme bonusu bonus veren siteler deneme bonusu veren siteler deneme bonusu veren siteler https://lexilight.com casino siteleri https://www.paletdepom.com.tr
Wednesday, October 2, 2024
Wednesday, October 2, 2024

జిల్లాలో ఘనంగా వనమహోత్సవ కార్యక్రమం

పాల్గొన్న ఎమ్మెల్యేలు, జిల్లా అధికారులు ,ప్రజాప్రతినిధులు,నాయకులు
విశాలాంధ్ర,పార్వతీపురం/సీతానగరం/సీతమ్మపేట: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న వనమహోత్సవం కార్యక్రమంలో భాగంగా జిల్లాలో పెద్దఎత్తున మొక్కలు నాటే కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. సీతంపేటలో జరిగిన కార్యక్రమలో జిల్లా కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్, పాలకొండ శాసనసభ్యులు నిమ్మక జయకృష్ణ పాల్గొనగా, గుచ్చిమి- జోగమ్మపేటల రిజర్వ్ రక్షిత అటవీ ప్రాంతంలో నిర్వహించిన కార్యక్రమంలో పార్వతీపురం శాసనసభ్యులు బోనెల విజయ్ చంద్ర, కురుపాం శాసనసభ్యురాలు తోయక జగదీశ్వరి, జిల్లా ఎస్పి ఎస్ వి మాధవరెడ్డి, జిల్లా ఫారెస్ట్ అధికారి జిఎపి ప్రసూనలు పాల్గొన్నారు. వనమహోవకార్యక్రమంలో భాగంగా జిల్లా కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్, పాలకొండ శాసనసభ్యులు నిమ్మక జయ కృష్ణ సీతంపేటలో మొక్కలను నాటారు. జిల్లా కలెక్టరు శ్యాం ప్రసాద్ మాట్లాడుతూ ప్రతీ ఒక్కరూ మొక్కలు నాటడం తోపాటు సంరక్షణ బాధ్యత తీసుకోవాలన్నారు. వాతావరణ సమతుల్యానికి మొక్కలను విరివిగా పెంచాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందని, ప్రతి ఒక్కరు తమ జీవితంలో జరిగే వేడుకలకు గుర్తుగా మొక్కలను నాటాలని పిలుపునిచ్చారు. జిల్లా ఎస్పీ మాధవరెడ్డి మాట్లాడుతూ మొక్కలను పెంచడంతోపాటు సంరక్షణ చేయడం అందరూ అలవర్చుకోవాలన్నారు. గుచ్చిమి – జోగంపేట రక్షిత అటవీ ప్రాంతంలో అటవీశాఖ ఆధ్వర్యంలో జరిగిన వనమహోత్సవం కార్యక్రమంలో పార్వతీపురం శాసనసభ్యులు బోనెల విజయచంద్ర, కురుపాం శాసనసభ్యురాలు తోయక జగదీశ్వరి, ఎస్.పి. ఎస్ వి మాధవరెడ్డి, జిల్లా ఫారెస్ట్ అధికారి జిఎపి ప్రసూన, స్థానిక ప్రజాప్రతినిదులు, అధికారులు, విద్యార్దులు పెద్ద ఎత్తున మొక్కలు నాటే కార్యక్రమాన్ని చేపట్టారు. హెక్టారు ప్రాంతంలో వేయిమొక్కలు నాటారు . వనమహోత్సవం ప్రతిజ్ఞ చేసారు.
పార్వతీపురం శాసనసభ్యులు బోనెల విజయచంద్ర మాట్లాడుతూ ప్రకృతిని, పర్యావరణాన్ని కాపాడుకోవలసిన బాద్యత మనందరిపై ఉందని తెలిపారు. అటవీశాఖ ఆధ్వర్యంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన వన మహోత్సవంలో ప్రతి ఒక్కరు భాగస్వామ్యులై విరివిగా మొక్కలు నాటాలని పిలుపునిచ్చారు. మనిషి మనుగడ ప్రకృతిపై ఆధారపడి ఉంటుందని, ప్రకృతి బాగుండాలంటే చెట్లు ఎక్కువగా ఉండాలన్నారు. మొక్కలు నాటి సంరక్షించుకోవడంతో పాటు, చెట్లను పరిరక్షించుకోవాలని తెలిపారు. పర్యావరణ పరిరక్షణకు ప్లాస్టిక్ వినియోగాన్ని పూర్తిగా తగ్గించాలని, పేపరు కోసం విరివిగా చెట్లను వాడుతున్నారని కావున పేపరు రీసైకిల్, తిరిగి వినియోగం విధానాన్ని అమలుచేయడం ద్వారా చెట్లనరికివేతను అరికట్టవచ్చని తెలిపారు. భవనాలు నిర్మాణపనులు చేపట్టేటప్పుడు నిర్మాణ ప్రాంగణంలో సాధ్యమైనంతవరకు చెట్లను పరిరక్షించేవిధంగా నిర్మాణపనులు చేపట్టాలన్నారు. కురుపాం శాసనసభ్యురాలు తోయక జగదీశ్వరి మాట్లాడుతూ పర్యావరణ సమతుల్యం సాధించుటకు అడవులు, చెట్లు అవసరమని తెలిపారు. చెట్లను ఎక్కువగా పెంచుటద్వారా, అడవులను పరిరక్షించుకొనుటద్వారా సకాలంలో వర్షాలు పడతాయని, రుతువులు సక్రమంగా వస్తాయని, తద్వారా వ్యవసాయం దిగుబడులు పెరుతాయని తెలిపారు. గ్రామీణ ప్రాంత ప్రజలు పట్టణ ప్రాంత ప్రజలకంటే ఆరోగ్యంగా ఉంటారని, అందుకు కారణం వారు ప్రకృతిలో జీవించడమేనన్నారు. మొక్కలు పెంచడం పై విద్యార్థులకు అవగాహన కల్పించాలని, ఈ కార్యక్రమంలోయువతను భాగస్వామ్యం కల్పించాలన్నారు.
జిల్లాఫారెస్ట్ అధికారి జిఎపి ప్రసూన మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహిస్తున్న వన మహోత్సవంలో భాగంగా ఈరోజు గుచిమి రక్షిత అటవీ ప్రాంతంలో అటవీ శాఖ ఆధ్వర్యంలో హెక్టారు ప్రాంతంలో వేయిమొక్కలు నాటే కార్యక్రమం చేపట్టడం జరిగిందని తెలిపారు. అంతే కాకుండా అటవీ శాఖ ద్వారా నర్శరీలలో మొక్కలు పెంచి పెద్దఎత్తున మొక్కలు నాటడం జరుగుతుందని తెలిపారు. జోగంపేటలో జరిగిన కార్యక్రమంలో సర్పంచ్ కళ్యంపూడి.సింహాచలం, ఎంపీటీసీ చెల్లారపు జగదీష్, తహశీల్దార్ రాములమ్మ, ఈఓపిఆర్డీ కుమార్ వర్మ,ఆర్ఐ శ్రీనివాసరావు, వ్యవసాయ అధికారి అవినాష్, వెలుగు ఏపిఎం శ్రీరాములు నాయుడు, మండల విద్యాశాఖ అధికారులు సూరిదేముడు ,వెంకటరమణలు, ఐఆర్పి డబ్ల్యు డైరెక్టర్ ప్రకాష్, పాలకొండ సబ్ డివిజన్ ఫారెస్ట్ అధికారి వై. సంధం కుమార్, ఫారెస్ట్ రేంజ్ అధికారులు వి వి ఎస్ ఎన్ రాజు, మణి కంటేసు,శాస్త్రి,రామారావు, ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్లు మనోజ్ కుమార్, మహేంద్ర, నారాయణరావు, గంగ రాజు, దేవరాజు, సూర్య, అవతారం, శ్రీను,జోగంపేట సాంఘిక సంక్షేమ శాఖ గురుకుల కళాశాల ప్రిన్సిపాల్ మధు, పార్వతీపురం రిషి పబ్లిక్ స్కూల్ ప్రిన్సిపాల్ నాగేశ్వరరావు, అటవీశాఖ ఎఫ్ఎస్ఓలు, ఎఫ్ డి ఓలు,
ఏబిఓలు, జిల్లాల్లోని అటవీశాఖ సిబ్బంది, సీతానగరం పోలీస్ సిబ్బంది, జోగంపేట సచివాలయ సిబ్బంది, సాంఘిక సంక్షేమ శాఖ గురుకుల కళాశాల విద్యార్థులు రిషి పబ్లిక్ స్కూల్ విద్యార్థులు పాల్గొన్నారు. వీరితోపాటు టిడిపి జనసేన బిజెపి నాయకులు
సాల హరగోపాల్, దామినేని భాను ప్రసాద్,పెంట సత్యంనాయుడు, రౌతు వేణుగోపాలనాయుడు, జొన్నాడతేరేజమ్మ, కంకణాలపల్లి అరవింద్ కుమార్, బుడితి శ్రీనివాసరావు, సబ్బాన శ్రీనివాసరావు, తెంటు వెంకట అప్పలనాయుడు, ఉడమల సూర్యనారాయణ, వంజరాపుగుంప స్వామినాయుడు, , మూడడ్ల వెంకటనాయుడు, బలగ శ్రీనివాసరావు,తేలుచంద్రశేఖర్, బొన్నాడ సత్యనారాయణ,ఇజ్జాడ రాంబాబు,సబ్బాన జగన్నాథం, మర్రాపు శంకరరావు, కళ్యాణ బలరాం,బూరాడ చిరంజీవి, మరిశర్ల సంజీవినాయుడు, బొమ్మినాయినిలక్ష్మణరావు, గంగమ్మ, శ్రీనివాసరావు, పోల వెంకటనాయుడు, సత్యనారాయణ,
బోను శ్రీనివాసరావు, చింతాడ సత్యనారాయణ,సాయి, జక్కుపకీరునాయుడు , తాన్న సత్యనారాయణ, మర్రాపు సత్యనారాయణ,మర్రాపు యోగేశ్వరరావు, భోగి గుప్తఆదిత్య పట్నాయక్ , బాలూ యాదవ్ తదితరులు పాల్గొన్నారు. ఈకార్యక్రమానికి వ్యాఖ్యాతగా ప్రభుత్వ జూనియర్ కళాశాల అధ్యాపకులు ఆకుల రాజు వ్యవహరించారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img