Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Sunday, September 8, 2024
Sunday, September 8, 2024

ఎన్నికల నిర్వహణలో పోలీసులపాత్ర ఎంతోకీలకం: జిల్లా కలెక్టర్

విశాలాంధ్ర – పార్వతీపురం : సాధారణ ఎన్నికల నిర్వహణలో పోలీసుశాఖ పాత్ర ఎంతో కీలకమని జిల్లా కలెక్టరు నిశాంత్ కుమార్ తెలిపారు. గురువారం కలెక్టరు కార్యాలయ సమావేశమందిరంలో పోలీసు సిబ్బందికి ఎన్నికల నిర్వహణపై శిక్షణా కార్యక్రమంను నిర్వహించారు. ఈకార్యక్రమంలో జిల్లా కలెక్టరు మాట్లాడుతూ ఎన్నికలు నిర్వహించుటలో పోలీసుపాత్ర కీలకమని తెలిపారు. ఇ.వి.ఎం.లు రాజ్యాంగ వ్యవస్థకు ప్రతీక అని, వాటి పరిరక్షణకు అన్ని చర్యలు తీసుకోవాలని అన్నారు. ఎన్నికల కమిషను నిబంధనలు, మార్గదర్శకాలు ప్రకారం ఎన్నికల విధులు నిర్వహించాలని స్పష్టం చేశారు. పోలీసు అధికారులు, సిబ్బంది ఎన్నికల కమిషను నియమావళిని ఖచ్చితంగా పాటించాలని తెలిపారు. ప్రతి నిముషం అప్రమత్తతతో ఉండాలని, ప్రతి విషయాన్ని క్షుణ్ణంగా పరిశీలించాలని, ప్రతి సమస్యను ఆదిలోనే పరిష్కరించి చర్యలు తీసుకున్నపుడు మాత్రమే పరిస్దితులు మన ఆధీనంలో ఉంటాయని తెలిపారు. ఎన్నికల నియమావళిలో ప్రతి విషయంపై పూర్తి వివరణ ఉంటుందని చేయవలసిన విధులు, చేయకూడని పనులు గూర్చి స్పష్టమైన అవగాహన ఉండాలని ఆయన పేర్కొన్నారు. అందుకుగాను ఎన్నికల నియమావళిని ప్రతిఒక్కరు చదివి తెలుసుకోవాలని, సందేహాలుంటే నివృత్తి చేసుకోవాలని తెలిపారు. ఎన్నికల విధులు నిర్వహణలో ప్రతి అంశం కీలకమని ఆయన సూచించారు. ఎన్నికల షెడ్యూలు ప్రకటించిన క్షణం నుండే ఎన్నికల కోడ్ అమలులోనికి వస్తుందని, ఎన్నికల కోడ్ అమలు చేయుటకు కావలసిన ఏర్పాట్లతో సిద్దంగా ఉండాలని ఆయన అన్నారు. నామినేషన్లు స్వీకరణ సమయంలో బందోబస్తు ప్రణాళిక, పోలింగు సమయంలో విధులు, సమస్యాత్మక పోలింగు కేంద్రాలు గుర్తింపు, బందోబస్తు, ఎన్నికల సమయంలో మద్యం, గంజాయి, డబ్బురవాణా నిరోదించుట తదితర అంశాలలో పోలీసులు అవగాహన, ముందస్తు ప్రణాళిక రూపొందించుకోవాలని తెలిపారు. ఎన్నికల కమిషను నిబంధనలు పాటిస్తూ ఎన్నికలను విజయవతం చేయాలని తెలిపారు.
జిల్లా పోలీసు సూపరింటెండెంట్ విక్రాంత్ పాటిల్ మాట్లాడుతూ ఎన్నికల విధులపై పోలీసు అధికారులు, సిబ్బంది పూర్తి అవగాహన కలిగిఉండాలని తెలిపారు. పోలింగు కేంద్రంలోనికి పోలీసులు ప్రవేశించకూడదన్నారు. ఎన్నికల నిర్వహణలో ప్రతి అంశం గూర్చి ఎన్నికల నియమావళిలో వివరణ ఉంటుందని, ప్రతి ఉద్యోగి చేయవలసిన, చేయకూడని పనులు గూర్చి తెలియజేస్తుందని కావున ఎన్నికల నియమావళిని క్షుణ్ణంగా తెలుసుకొని ఎన్నికల విధులు నిర్వహించాలని తెలిపారు. మారుమూల ప్రాంతాలలో పనిచేస్తున్న సిబ్బంది అప్రమత్తతతో మెలగాలని, ప్రతి అంశాన్ని ఉన్నతాధికారులకుతెలియజేయాలన్నారుశాంతిభద్రతలు పరిరక్షణ, బందోబస్తు విధులు విజయవంతంగా పూర్తిచేయాలని తెలిపారు. శిక్షణ కార్యక్రమంలో ఎన్నికలకు ముందు,తరువాతవిధులు, పోలింగు ప్రక్రియ, నామినేషన్లు స్వీకరణ, బందోబస్తు, నామినేషన్లు స్క్రూటినీ, సమస్యాత్మక పోలింగు కేంద్రాలు గుర్తింపు తదితర అంశాలపై శిక్షణ అందించారు.
ఈశిక్షణ కార్యక్రమంలో ఇంచార్జి జిల్లా రెవిన్యూ అధికారి జి కేశవ నాయుడు, డిఎస్పీ మురళీధర్, పార్వతీపురం, పాలకొండ డివిజనుకు చెందిన సర్కిల్ ఇనస్పెక్టర్లు, సబ్ ఇనస్పెక్టర్లు, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img