Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Tuesday, September 17, 2024
Tuesday, September 17, 2024

నిబంధనలు పాటించని విద్యా సంస్థలపై చర్యలు తీసుకోవాలి.. ఏఐఎస్ఎఫ్

విశాలాంధ్ర ధర్మవరం:: ప్రభుత్వ నిబంధనలో ను అటకెక్కించి విద్యను వ్యాపారంగా మార్చిన కార్పొరేట్ ప్రైవేట్ విద్యా సంస్థలపై వెంటనే చర్యలు తీసుకోవాలని ఏఐఎస్ఎఫ్ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు పవన్, చంద్రశేఖర్ రెడ్డి పేర్కొన్నారు. ఈ సందర్భంగా వారు
పట్టణంలో ఏఐఎస్ఎఫ్ ముఖ్య నాయకుల సమావేశం నిర్వహించారు.
అనంతరం వారు మాట్లాడుతూ
జీవో నెంబర్ 1,42 ప్రతి
పాఠశాలలో అమలుకు చర్యలు చేపట్టాలి అని,
విద్యా పేరుతో కోట్ల వ్యాపారం చేస్తున్న కార్పొరేట్ విద్యాసంస్థలు విద్య హక్కు చట్టానికి తూట్లు పొడుస్తూ, ప్రైవేట్, కార్పొరేట్ కాసులకు విద్యాశాఖ అధికారులు అమ్ముడుపోతు, విద్యార్థుల తల్లిదండ్రులను మోసం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
విద్యను వ్యాపారం చేసిన ప్రైవేట్ కార్పొరేట్ విద్యాసంస్థలు
అనుమతి లేకుండా అక్రమ అడ్మిషన్ చేస్తున్న యాజమాన్యాలకి అమ్ముడుపోయిన విద్యాశాఖ అధికారులు పై చర్యలు తీసుకొని, ప్రభుత్వ నిబంధనలను తుంగలోకి తొక్కిన కార్పొరేట్ విద్యాసంస్థలు పాఠశాల పేరుతో ముద్రించిన పాఠ్యపుస్తకాల అమ్మకానికి పెట్టిన ప్రైవేట్ కార్పొరేట్ యాజమాన్యం పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. పేద, బడుగు బలహీన వర్గాల విద్యార్థులకు ఉన్నత విద్యను దూరం చేస్తున్న కార్పొరేట్ యాజమాన్యం విద్యా సంవత్సరం ప్రారంభం కాకమునపే అడ్మిషన్స్ ఫుల్ అయ్యాయని చెప్పడం విడురం అన్నారు.
ఫీజు నియంత్రణ చేయడంలో విద్యాశాఖ అధికారులు విఫలం అయ్యారని మండిపడ్డారు.
ప్రైవేట్, కార్పొరేట్ విద్యాసంస్థలు ఫీజులు పెంచాలంటే డిస్టిక్ ఫీ రెగ్యులేషన్ కమిటీ అనుమతి తీసుకోవాలని , ఇష్టానుసారంగా 5000 నుండి
2 లక్షల వరకు ఫీజులు వసూలు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
యూనిఫామ్స్, బుక్స్, ఇతర మెటీరియల్స్ విద్యాసంస్థలోనే అమ్మకానికి పెట్టినా ..పట్టీ పట్టనట్లు వ్యవహరిస్తున్న విద్యాశాఖ అధికారులు పై ఏఎస్ఎఫ్ నాయకులు మండిపడ్డారు. కావున వెంటనే విద్యాధికారులు ప్రభుత్వ నిబంధనలు పాటించని పాఠశాలలపై చర్యలు తీసుకోవాలని లేకపోతే దశలవారి పోరాటాలను రూపొందిస్తామని తెలిపారు ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షుడు అరుణ్ కుమార్ రెడ్డి, నియోజవర్గ నాయకులు విజయ్ కుమార్, నరేష్, గణేష్, సాదిక్,నవీన్ తదితరులు పాల్గొన్నారు..

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img