విశాలాంధ్ర ధర్మవరం:: తీసుకురమ్మ పట్టణంలోని శివానగర్ కు చెందిన బాలికొండ సిల్క్స్ యజమాని కండ్లపల్లి రామ్మోహన్ విజయలక్ష్మి దంపతులు నంద్యాల జిల్లా బనగానపల్లి మండలం నందవరంలోని చౌడేశ్వరి దేవి ఆలయానికి వెండి కిరీటమును వితరణ చేశారు. దాతలు మాట్లాడుతూ 6,623 గ్రాములు వెండితో తయారుచేసిన ఒకటిన్నర అడుగుల ఎత్తు గల కిరీటాన్ని (విలువ 7 లక్షల పదివేలు) ఆలయ ఈవో రామానుజన్, తులసి రెడ్డిలకు బహుకరించడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో దాతల కుటుంబ సభ్యులు ఆలయ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.