Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Sunday, September 8, 2024
Sunday, September 8, 2024

తాగునీటి సమస్య లేకుండా చూడాలి.. కలెక్టర్ అరుణ్ బాబు

విశాలాంధ్ర ధర్మవరం:: డివిజన్ పరిధిలో ఎక్కడ కూడా తాగునీటి ఇబ్బందులు తలెత్తకుండా అధికారులు తప్పక చర్యలు తీసుకోవాలని కలెక్టర్ అరుణ్ బాబు అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా ఆర్డీవో కార్యాలయ సమావేశ భవనంలో అధికారులతో తాగునీటి సమస్య వివరణ ఉపాధి హామీ పనులపై వారు సమీక్ష జరిపారు. అనంతరం వారు మాట్లాడుతూ డివిజన్ పరిధిలో తాగనీటి సమస్య ఉత్పన్నమయ్యే గ్రామాలను ముందుగా గుర్తించి వెనువెంటనే తగు చర్యలు గైకొనేలా అధికారులు తమ విధులను నిర్వహించాలని తెలిపారు. విధుల్లో ఎవరైనా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే సహించేది లేదని వారు హెచ్చరించారు. అలాగే వేసవిలో ఉపాధి హామీ కూలీలకు ఇబ్బందులు కలగకుండా పని ప్రదేశాలలో అన్ని సౌకర్యాలు ఉండేటట్లు చూసుకోవలసిన బాధ్యత అధికారులదేనని వారు స్పష్టం చేశారు. ఏప్రిల్ 1వ తేదీ నుంచి రోజు వారి కూలి 300 రూపాయలకు పెరిగిన విషయాన్ని కూలీలకు తప్పక తెలియజేయా లన్నారు. అదేవిధంగా సార్వత్రిక ఎన్నికల విషయంలో అందరూ తమ సహాయ సహకారాలను అందిస్తూ, ఎన్నికల నియమ నిబంధన ప్రకారం ప్రతి ఒక్కరూ నడుచుకోవాల్సిన బాధ్యత ఉందని వారు తెలిపారు. పోలింగ్ బూత్ కేంద్రాలలో అన్ని వసతులు ఉండేటట్లు తప్పక పరిశీలిస్తూ ఎప్పటికప్పుడు సమస్యలను పరిష్కరించేలా చర్యలు గైకొనాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆర్డిఓ వెంకట శివరామిరెడ్డి, మున్సిపల్ కమిషనర్ రామ్ కుమార్, ఆర్ డబ్ల్యు ఎస్-వెంకటనారాయణ, డ్రామా పీడీ. విజయప్రసాద్, స్థానిక ఎమ్మార్వో రమేష్, డివిజన్ పరిధిలోని ఎంపీడీవోలు, ఎమ్మార్వోలు, ఆర్డబ్ల్యూఎస్ అధికారులు తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img