Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Tuesday, September 17, 2024
Tuesday, September 17, 2024

ఎన్నికల నియమ నిబంధనలు అధికారులు తప్పక పాటించాలి..

జిల్లా కలెక్టర్ అరుణ్ బాబు
విశాలాంధ్ర -ధర్మవరం=రానున్న ఎన్నికల విజయవంతం కావడానికి తప్పనిసరిగా నియమ నిబంధనలు పాటించాలని అధికారులకు జిల్లా కలెక్టర్ అరుణ్ బాబు తెలియజేశారు. ఈ సందర్భంగా బుధవారం ఆకస్మికంగా వారు పలు కార్యాలయాలను తనిఖీ చేశారు. ఇందులో భాగంగా తొలుత పట్టణంలోని మార్కెట్ యార్డు గోడౌన్లోని ఈవీఎం యంత్రాల ను పరిశీలించారు. గోడౌన్లో భద్రపరిచిన వి అన్ని కరెక్ట్ గా ఉన్నాయా? లేదా? అన్న అంశంపై క్షుణ్ణంగా పరిశీలించారు. అనంతరం ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాల క్రీడామైదాన్ని వారు పరిశీలించారు. నియోజకవర్గానికి ఎన్నికల సమయంలో ఎన్నికల సామాగ్రిని పంపిణీ చేసేందుకు ఈ క్రీడా మైదానం సరిపోతుందా? లేదా? అన్న వాటిని నేరుగా పరిశీలించి, అధికారుల ద్వారా వివరాలను అడిగి తెలుసుకున్నారు. తదుపరి కాయగూరల మార్కెట్ వద్ద గల సబ్ రిజిస్టర్ కార్యాలయాన్ని కూడా వారు ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఇటీవల ప్రభుత్వం ద్వారా పట్టాల పొందిన లబ్ధిదారులకు సచివాలయ వ్యవస్థ ద్వారా సబ్ రిజిస్టర్ ఆఫీసులో రిజిస్టర్ చేసుకొనే పద్ధతులు పై వారు పరిశీలించారు. అక్కడ ఉన్న కొంతమంది లబ్ధిదారులతో వారు నేరుగా మాట్లాడారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ప్రభుత్వ ఇంటి పట్టాలను రిజిస్ట్రేషన్ చేసే పనిని వేగవంతంగా పూర్తి చేయాలని సబ్ రిజిస్టార్ అధికారి రమణారావుకు సూచించారు. ఈ కార్యక్రమంలో ఆర్డీవో రమేష్ రెడ్డి, ఇన్చార్జ్ ఎమ్మార్వో ఈశ్వరయ్య, మున్సిపల్ కమిషనర్ రామ్కుమార్, అసిస్టెంట్ కమిషనర్ మధుసూదన్ రెడ్డి, డీఈవో మీనాక్షి దేవి, మునిసిపల్ తాసిల్దార్, కార్యాలయ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img