Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Tuesday, September 17, 2024
Tuesday, September 17, 2024

ముగిసిన గ్రంథాలయ వేసవి శిక్షణ శిబిరం.. గ్రంథాలయ అధికారిని అంజలి సౌభాగ్యవతి.

విశాలాంధ్ర ధర్మవరం:: పట్టణంలోని బాబు జగ్జీవన్ రామ్ వీధిలో గల ప్రధాన గ్రంథాలయంలో వేసవి సెలవుల్లో 20 రోజులుగా శిక్షణా శిబిరాలను నిర్వహించారు. ఈ శిక్షణా శిబిరాలు శుక్రవారంతో విజయవంతంగా ముగిసిందని గ్రంథాలయ అధికారిని అంజలి సౌభాగ్యవతి తెలిపారు. అనంతరం అంజలి సౌభాగ్యవతి మాట్లాడుతూ ఈ ముగింపు వేడుకలు పాఠకుల నడుమ ఘనంగా నిర్వహించడం జరిగిందని తెలిపారు. ముఖ్యఅతిథిగా ఎల్ఐసి ఏజెంట్ నాగరాజు, మురళి, ముకుంద పాల్గొనడం జరిగిందని తెలిపారు. ముఖ్య అతిథులు మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ గ్రంథాలయమును సద్వినియోగం చేసుకొని భావిభారత పౌరులుగా ఈ గ్రంథాలయమును ఉపయోగాలను తెలపాలని తెలిపారు. నేడు టెక్నాలజీ పెరిగిన ప్రకారం మంచి కొరకే వాటిని వాడుకోవాలని కుటుంబంలో ఉన్న పిల్లలకు ఈ సెల్ ఫోన్ లను పిల్లలకు దూరంగా ఉంచాలని తెలిపారు. సమయాన్ని వృధా చేయకుండా అనుకున్న లక్ష్యాన్ని చేదించే విధంగా విద్యార్థులు కృషి చేయాలని తెలిపారు. ఎందుకు తల్లిదండ్రుల యొక్క ప్రోత్సాహకరము కూడా ఎంతో ముఖ్యమని వారు తెలిపారు. గ్రంథాలయంలో లభించే పలు రకాల పుస్తకాలు పై అవగాహన చేసుకుని భవిష్యత్తులో ఉన్నత స్థానంలో ఉంటారని తెలిపారు. అనంతరం వివిధ రకాల పోటీలను నిర్వహించి విద్యార్థులకు బహుమతులను ప్రధానం చేశారు. ఈ కార్యక్రమంలో సిబ్బంది సత్యనారాయణ, శివమ్మ, రమణ నాయక్, గంగాధర్, ఉపాధ్యాయులు, విద్యార్థులు, తల్లిదండ్రులు, అధిక సంఖ్యలో పాఠకులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img