Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Tuesday, September 17, 2024
Tuesday, September 17, 2024

ప్రమాద రహిత డిపోగా ప్రతి ఉద్యోగి కృషి చేయాలి..

డిపో మేనేజర్ సత్యనారాయణ

విశాలాంధ్ర ధర్మవరం::(శ్రీ సత్య సాయి జిల్లా) ప్రమాద రహిత డిపోగా ప్రతి ఆర్టీసీ ఉద్యోగి కృషి చేయాలని డిపో మేనేజర్ సత్యనారాయణ తెలిపారు. ఈ సందర్భంగా వారు జిల్లా ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు “రోడ్డు భద్రత మాసోత్సవాలను” వారు ప్రారంభించారు. తదుపరి రోడ్డు భద్రత వారోత్సవాలు యొక్క భద్రతా సూక్తులను చదివి, వినిపించి, అందరి చేత ప్రతిజ్ఞ చేయించారు. అనంతరం వారు మాట్లాడుతూ ఈ రోడ్డు భద్రతా మాసోస్తవాలు ఈనెల 15 నుంచి ఫిబ్రవరి 14వ తేదీ వరకు నెల రోజులు పాటు నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. ప్రతిరోజు విధులకు వెళ్లే డ్రైవరు, కండక్టర్లకు ఆర్టీసీ నియమ నిబంధనలను తెలపడం జరుగుతుందన్నారు. ప్రమాద రహిత డిపోకు ప్రతి డ్రైవర్ కృషి చేస్తే, ధర్మవరం డిపోకు మంచి గుర్తింపు లభిస్తుందని తెలిపారు. అదేవిధంగా ధర్మవరం డిపో యాక్సిడెంట్లో జీరో గా ఉండాలని, డ్రైవర్లు మద్యం సేవించకుండా విధులకు వెళ్లాలని, క్రమశిక్షణతో విధులు చేసి భద్రతా సూక్తులను పాటించి, సంస్థకు మంచి ఆదాయంతో పాటు మంచి పేరును కూడా చేకూర్చాలని తెలిపారు. తదుపరి ఆర్టీసీ డ్రైవర్లకు, కండక్టర్లకు, అధికారులకు, కార్యాలయ సిబ్బందికి, డిపో సిబ్బందికి డిపో మేనేజర్ సంక్రాంతి, భోగి, కనుమ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ట్రాఫిక్ గ్యారేజ్ ఇంచార్జ్ వెంకటేశులు, సికిందర్ సాహెబ్, యూనియన్ ప్రతినిధులు, డ్రైవర్లు, కండక్టర్లు, గ్యారేజీ సిబ్బంది, కార్యాలయ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img