Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Sunday, September 8, 2024
Sunday, September 8, 2024

కంటి క్యాన్సర్ ప్రాథమిక దశలోనే గుర్తించాలి..

రిటైర్డ్ జిల్లా అంతత్వ నివారణ అధికారి, కంటి వైద్య నిపుణులు, డాక్టర్.ఎస్. నరసింహులు
విశాలాంధ్ర ధర్మవరం:: కంటి క్యాన్సర్ ను ప్రాథమిక దశలోనే గుర్తించాలి, లేనియెడల కంటిచూపు కోల్పోయే ప్రమాదం ఉందని రిటైర్డ్ జిల్లా అందత్వ నివారణ అధికారి, కంటి వైద్య నిపుణులు డాక్టర్. ఎస్. నరసింహులు పేర్కొన్నారు. ఈ సందర్భంగా వారు ఎస్బిఐ కాలనీలోని మధు కన్ను వైద్యశాల లో ప్రపంచ కంటి క్యాన్సర్ (రెటీనా బ్లాస్ట్టోమా) అవగాహన వారోత్సవాల యొక్క ప్రాముఖ్యతను తెలియజేశారు. అనంతరం వారు మాట్లాడుతూ మామూలుగా ప్రజలందరూ కూడా కంటికి క్యాన్సర్ ఉంటుందా అని ఆశ్చర్యపడతారని, శరీరంలో వెంట్రుకలు, గోళ్ళకు తప్ప మిగిలిన అన్ని అవయవాలకు క్యాన్సర్ వచ్చే అవకాశం ఉందని, పుట్టినప్పటి నుండి చనిపోయే వరకు ఎప్పుడైనా ఈ క్యాన్సర్ ఎక్కడైనా రావచ్చునని తెలిపారు. ఈ కంటి క్యాన్సర్ ముఖ్యంగా చిన్నపిల్లలకు అనగా పుట్టిన బిడ్డ నుండి రెండు సంవత్సరాల వయసు లోపల, ఐదేళ్ల వరకు, ఆడ మగ అనే తేడా లేకుండా రెండు కళ్ళకు రావచ్చునని తెలిపారు. తల్లిదండ్రుల నుండి వచ్చే జీన్స్ మార్పుల వలన పిల్లలు కూడా షోకే ప్రమాదం ఉందని తెలిపారు. కంటిలోని రెటీనా పొర నుండి వస్తు, రెటీనాలో ప్రారంభమై, కంటిలోని అన్ని భాగాలకు వ్యాపిస్తుందని, కంటి నరము ద్వారా మెదడుకు కూడా సోకుతుందని, అప్పుడు అది ప్రాణాంతకం అవుతుందని తెలిపారు. ఈ కంటి క్యాన్సర్ ను కంటి యొక్క నల్ల గుడ్డు లోని కంటిపాపలో తెల్లటి చుక్క గా కనిపిస్తుందని తెలిపారు. వీటిని ప్రథమంగా తల్లి గుర్తించే అవకాశం ఉంటుందని, గుర్తించిన వెంటనే కంటి డాక్టర్ని తప్పక సంప్రదించాలని తెలిపారు. కంటిలోని శుక్లము కూడా ఈ విధంగా కనిపిస్తుందని, కంటి డాక్టర్లు తేలికైన పరీక్షల ద్వారా ఈ క్యాన్సర్ ను గుర్తించే అవకాశం ఉందని తెలిపారు. అధునాతనంగా సిటీ స్కానింగ్ ఎంఆర్ఐ స్కానింగ్ ల ద్వారా ఈ వ్యాధి వ్యాపించిన భాగాలను వెంటనే తెలుసుకునే అవకాశం, క్యాన్సర్ యొక్క స్థాయిని కూడా నిర్ధారించవచ్చునని తెలిపారు. నేడు ఈ క్యాన్సర్ ను చికిత్స పద్ధతిలో విప్లవాత్మకమైన మార్పుల వలన కంటిని తొలగించకుండా కంటి చూపును పునరుద్ధంప చేసే అవకాశం కూడా కలదని తెలిపారు. కంటిపట్ల అజాగ్రత్తగా ఉంటే “చావు తప్పి కన్ను మాత్రమే లొట్టు పడుతుందని” అన్న సామెత నిజమవుతుందని తెలిపారు. అందుబాటులో వివిధ చికిత్స పద్ధతులలో క్యాన్సర్ కు మందులు, లేజర్ చికిత్స, రేడియేషన్ చికిత్స లు ఫలించని ఎడల కంటిని తొలగిస్తారని, తొలగించిన తర్వాత కృత్రిమ కంటిని అమర్చుకోవచ్చునని తెలిపారు. చివరిగా కుశ మెరుపుగా తెలుపుతూ భయంకరమైన ఈ కంటికి క్యాన్సర్ స్వాభావికంగా దానికదే కరిగిపోయే అవకాశం కలదు అని, కానీ ఆ అవకాశం కోసం ఎదురుచూడడం ఏ మాత్రము సమంజసం కాదు అని స్పష్టం చేశారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img