Wednesday, April 17, 2024
Wednesday, April 17, 2024

మానవ సేవ దైవ సేవతో సమానం… శ్రీ సత్య సాయి సేవ సమితి

విశాలాంధ్ర ధర్మవరం:: మానవసేవ దైవ సేవతో సమానమని శ్రీ సత్య సాయి సేవ సమితి నిర్వాహకులు తెలిపారు. ఈ సందర్భంగా పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో లోని రోగులకు, సహాయకులకు దాదాపు 360 మందికి భోజనపు ప్యాకెట్లను, వాటర్ ప్యాకెట్స్ ను వైద్యులు, నర్సులు చేతుల మీదుగా పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి దాతగా వ్యవహరించిన కీర్తిశేషులు మలిశెట్టి మురళి గణేష్- కోమల సిల్క్స్ వారి కుటుంబానికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. అనంతరం నిర్వాహకులు మాట్లాడుతూ ప్రతి సేవా కార్యక్రమం దాతల సహాయ సహకారాలతో, పుట్టపర్తి బాబా ఆశీస్సులతో నిర్వహిస్తున్నందుకు మాకు ఎంతో తృప్తిని, ఆనందాన్ని ఇస్తోందని తెలిపారు. అనంతరం ఆసుపత్రి సూపర్డెంట్ డాక్టర్ మాధవి, డాక్టర్ నజీర్ మాట్లాడుతూ ఇటువంటి సేవా కార్యక్రమాలు శ్రీ సత్య సాయి సేవా సమితి వారు చేయడం రోగులకు వరం లాగా మారిందని, వారి సేవలు అనన్యమైన అని తెలిపారు. తదుపరి సత్యసాయి సేవా సమితి నిర్వాహకులకు, దాతలకు, వైద్యులు, సిబ్బంది కృతజ్ఞతలను తెలియజేశారు. ఈ కార్యక్రమంలో 27 మంది సేవాదళ్ సభ్యులు పాల్గొన్నారు. ఇటువంటి కార్యక్రమాలకు ఆసక్తి గల దాతలు సెల్ నెంబర్ 9966047044 కు గాని 903044065కు గాని సంప్రదించాలని కోరారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img