Saturday, May 18, 2024
Saturday, May 18, 2024

నియోజకవర్గ సమస్యలను తప్పక తీరుస్తాను.. ఉమ్మడి అభ్యర్థి సత్య కుమార్ యాదవ్

విశాలాంధ్ర ధర్మవరం:: నియోజకవర్గ సమస్యలను తప్పక తీరుస్తారని ఉమ్మడి అభ్యర్థి సత్య కుమార్ యాదవ్ పేర్కొన్నారు. ఈ సందర్భంగా వారు మండల పరిధిలోని మల్లేనిపల్లి, తుమ్మల, తిప్పేపల్లి, సుబ్బారావుపేట, నాగులూరు, గోట్ళూరు, మల్కాపురం,బడనపల్లి గొల్లపల్లి గ్రామాలలో పర్యటించారు. వీరి వెంట హిందూపురం పార్లమెంటు ఉమ్మడి అభ్యర్థి బి కే. పార్థసారథి, జనసేన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చిలకమ్ మధుసూదన్ రెడ్డి, ధర్మవరం రూరల్ మండల కన్వీనర్ పోతుకుంట లక్ష్మన్న, నియోజకవర్గ తెలుగుదేశం ఇంచార్జ్ పరిటాల శ్రీరామ్, ఉమ్మడి అభ్యర్థుల నాయకులు కార్యకర్తలు వందల సంఖ్యలో పాల్గొన్నారు. గ్రామాలలో వీరికి మంచి స్పందన రావడం జరిగింది. అనంతరం గ్రామాలలో ఇంటింటా తిరుగుతూ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చేసిన మోసాలను వివరిస్తూ, కరపత్రాలను పంపిణీ చేశారు. వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో బిజెపి టిడిపి టిడిపి జనసేన పార్టీల ఉమ్మడి అభ్యర్థిగా సత్య కుమార్ యాదవ్ అత్యధిక మెజార్టీతో గెలిపించాలని వారు ఓటర్లను కోరారు. ఇప్పటికే ఐదు సంవత్సరాలు రాష్ట్రం అప్పుల ఊబిలో కూరుకుపోయిందని, జగన్మోహన్ రెడ్డితో పాటు స్థానిక ఎమ్మెల్యే కేతిరెడ్డి అభివృద్ధి విషయంలో చేసింది శూన్యము అని తెలిపారు. గ్రామాలే దేశానికి పట్టుకొమ్మలు గా ఉన్నటువంటి ఈ గ్రామాలను స్థానిక ఎమ్మెల్యే ఏ మాత్రం పట్టించుకోకపోవడం దారుణం అని తెలిపారు. తనను ఎమ్మెల్యే గా గెలిపిస్తే నిరంతరం ప్రజలకు అండగా ఉంటూ అందరికీ అందుబాటులో ఉంటానని తెలిపారు. గ్రామ ప్రజల నుండి మంచి స్పందన రావడం నాకెంతో సంతోషాన్ని కలిగించిదని వారు తెలిపారు. గ్రామ ప్రజలందరూ ఉమ్మడి అభ్యర్థిగా అయిన కమలం గుర్తుకే ఓటు వేసి తనను ఎమ్మెల్యేగా గెలిపించాలని కోరారు. తాను నియోజకవర్గానికి కొత్త అయినా కూడా ప్రజలు నన్ను ఎంతగానో ఆదరిస్తున్నారని తప్పక మీ సమస్యలు పరిష్కరించే దిశలో తాను కృషి చేస్తానని తెలిపారు. ఈ గ్రామాలలో నీరు రోడ్లు డ్రైనేజీ తదితర సమస్యల్ని అధికారంలోకి రాగానే పరిష్కరిస్తారని హామీ ఇచ్చారు. టిడిపి, జనసేన, బిజెపి పార్టీలు ఇప్పటికే తనకు సహాయ సహకారాలు అందిస్తున్నాయని, పేరుపేరునా వారందరికీ సత్య కుమార్ యాదవ్ కృతజ్ఞతలు తెలియజేశారు. సత్య కుమార్ యాదవ్ గ్రామ ప్రజల్ని ఆప్యాయంగా పలకరిస్తున్నారు. ఉమ్మడి అభ్యర్థిగా కమలం గుర్తును ప్రజలందరూ గుర్తుపెట్టుకొని వచ్చే ఎన్నికల్లో అత్యధిక మెజార్టీతో గెలిపించాలని వారు కోరారు. అదేవిధంగా టిడిపి చేపట్టిన సూపర్ సిక్స్ పథకాలపై కూడా ఇంటింటా ప్రచారం చేస్తూ కరపత్రాలను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో బిజెపి జనసేన టిడిపి నాయకులు కార్యకర్తలు వందల సంఖ్యలో పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img