Sunday, May 5, 2024
Sunday, May 5, 2024

తెలుగుదేశం పార్టీలోకి చేరిన ప్రముఖ వైకాపా చేనేత నాయకుడు సందా రాఘవ

విశాలాంధ్ర ధర్మవరం:: పట్టణానికి చెందిన వైకాపా నాయకుడు ప్రముఖ చేనేత ప్రముఖుడు పట్టు చీరల వ్యాపారి సంధ్యా రాఘవ తెలుగుదేశం పార్టీలో చేరారు. కనేకల్ లో నిర్వహించిన కార్యక్రమంలో ధర్మవరం నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇంచార్జ్ పరిటాల శ్రీరామ్ సమక్షంలో వారు పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు కండువా వేసి పార్టీలోకి ఘనంగా ఆహ్వానించారు. సంధ్యా రాఘవ తో పాటు సోదరుడు రవీంద్ర పలువురు చేనేతలు చందా రవి,దాసరి నర్సి,,జింకా పురుషోత్తం, చందూలతో పాటు 100 మంది కలిసి పార్టీలో చేరారు. చేనేత మగ్గం నమూనాను చంద్రబాబు నాయుడుకి అందజేశారు. అనంతరం చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ సార్వత్రిక ఎన్నికల్లో కూటమి అభ్యర్థి సత్య కుమార్ యాదవ్ విజయానికి కృషి చేయాలని, పార్టీకి కష్టపడి పని చేస్తే తగిన ప్రాధాన్యత ఉంటుందని తెలిపారు.ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి పరిటాల సునీత, ధర్మవరం తెలుగుదేశం పార్టీ నాయకులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img