Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Sunday, September 8, 2024
Sunday, September 8, 2024

గెలుపు ఎవరిది..?

అభ్యర్థుల గుండెల్లో గుబులు..

జూన్ 4న నువ్వా? నేనా? అన్న గెలుపు ఆశా ఊహల్లో అభ్యర్థులు

ఓట్ల లెక్కింపుకునకు దగ్గర పడుతున్న సమయం

ఆయా పార్టీ సీనియర్ నాయకులతో గెలుపు ఓటమిలపై తీవ్రమైన మంతనాలు

ఎన్డిఏ పార్టీ, వైఎస్సార్సీపీ పార్టీ, కాంగ్రెస్ పార్టీ లలో గెలుపు ఎవరిది..?

విశాలాంధ్ర ధర్మవరం;; ధర్మవరం నియోజకవర్గంలో మే 13 వ తేదీన పోలింగ్ పూర్తి కావడంతో, జూన్ 4వ తేదీన ఎన్నికల ఫలితాలు రావడంతో ఎమ్మెల్యే అభ్యర్థుల్లో టెన్షన్.. టెన్షన్గా గా ఆయా ప్రధాన పార్టీలో నెలకొన్నాయి. అదేవిధంగా గెలుపు ఆశా ఊహల్లో అభ్యర్థులు నిరీక్షణ చేస్తున్నారు. ఓట్ల లెక్కింపునకు దగ్గర పడుతున్న సమయంలో ఆయా పార్టీ సీనియర్ నాయకులతో ఎమ్మెల్యే అభ్యర్థులు గెలుపు ఓటమిలపై తీవ్రంగా మంతనాలను నిర్వహిస్తున్నారు. ముఖ్యంగా ధర్మవరంలో వైఎస్సార్సీపీ పార్టీ తరఫున కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి, ఎన్డీఏ కూటమి (టిడిపి, జనసేన, బిజెపి) తరఫున సత్య కుమార్ యాదవ్, కాంగ్రెస్ పార్టీ తరఫున రంగన అశ్వర్థ నారాయణ బరిలో ఉన్నారు. వీరు ముగ్గురు తమదైన శైలిలో, అనుభవాన్ని దృష్టిలో ఉంచుకొని, సీనియర్ నాయకులు, కార్యకర్తలతో ఎండనక వాననక తమ ప్రచారాలను హోరెత్తించారు. ఓటు నాడి ఎలా ఉంటుందో… అన్న సందిగ్ధంలో మూడు ప్రధాన పార్టీ అభ్యర్థులు నిరీక్షణ చేయక తప్పడం లేదు. జూన్ 4వ తేదీన లేపాక్షి మండలం చోళ సముద్రం గ్రామ సమీపంలోని అంబేద్కర్ గురుకుల పాఠశాలలో కౌంటింగ్ కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ ఏర్పాటు చేశారు. ఆరోజు సాయంత్రం లోపు ఎన్నికల ఫలితాలు వెలువడేలా అధికారులు అందరూ కూడా ప్రణాళికలకు సిద్ధమయ్యారు. ప్రస్తుతం పట్టణంలో ఎక్కడ చూసినా ధర్మవరంలో ఈసారి ఏ పార్టీ అధికారంలోకి వస్తుంది..?, ఏ ఏ పార్టీకి ఎన్ని సీట్లు వస్తాయి..? జిల్లాలో అధిక మెజారిటీ ఏ పార్టీకి వస్తుంది అన్న విషయాలపై అన్నిచోట్ల తీవ్రంగా ప్రజలు చర్చించుకుంటున్నారు. అంతేకాకుండా ఈసారి ఎన్నికల్లో పోలింగ్ శాతం పెరగడంతో తమకు అనుకూలమని ఆయా పార్టీ అభ్యర్థులు అభిప్రాయపడుతున్నారు. ప్రస్తుతం అధికారంలో ఉన్న వైఎస్సార్సీపీ పార్టీ ప్రజలకు, ఉద్యోగులకు ఎంత మేర మేలు చేశారు…? అన్నది కూడా కీలకపాత్ర కౌంటింగ్ లో చోటుచేసుకుంటున్నాయి. అంతేగాక ఎన్నడూ లేని విధంగా పోస్టల్ బ్యాలెట్ లో కూడా అధిక సంఖ్యలో ప్రభుత్వ ఉద్యోగులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఈ పోస్టల్ బ్యాలెట్ ఓట్ల సంఖ్య కూడా కౌంటింగ్ ఫలితాలలో ఒక కీలకపాత్ర వహిస్తోందని పలువురు రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. అంతేకాకుండా మే 13వ తేదీ అర్ధరాత్రి వరకు ధర్మవరం ప్రజలు తమ ఓటు హక్కును ఎంతో సమన్వయంతో, ఓపికతో ఓటును వేయడం జరిగింది. మరి ప్రజల యొక్క ఓటు నాడి తెలుసుకోవాలి అంటే ఒకరకంగా కష్టమే. వైసీపీ ప్రభుత్వం పై ప్రజా వ్యతిరేకత ఉందా? లేదా? ఇతర పార్టీల వైపు ఉందా? అన్న అనుమానాలు రేకెత్తిస్తున్నాయి. ఈనెల 13న జరిగిన పోలింగ్లో మొత్తం84.82 శాతం ఓటింగ్ నమోదు అయిందని రిటర్నింగ్ ఆఫీసర్ వెంకట శివరామిరెడ్డి తెలిపిన విషయం పాఠకులకు విధితమే. ఈసారి మహిళల ఓటింగ్ సంఖ్య అధికం కావడంతో, కౌంటింగ్ లో మహిళల ఓట్లు తేల నున్నది. పట్టణములో, గ్రామీణ ప్రాంతాలలో ఏ ఏ పార్టీలు అధిక మెజార్టీతో గెలుస్తాయి అన్న అనుమానం ప్రజల్లో ఉండిపోయింది. శ్రీ సత్య సాయి జిల్లాలో ఏడు నియోజకవర్గాలలో ఏ ఏ పార్టీ గెలుపు కైవసం చేసుకుంటుంది అన్నది కూడా జూన్ 4న తేల నుంది. పెరిగిన ఓటింగ్ శాతం ఎవరికి లాభపడుతుంది అన్న విషయంలో కూడా ప్రధాన పార్టీలు చర్చించుకుంటున్నాయి. మరి నియోజకవర్గంలో కూడా గెలుపు ఓటమిలపై జోరుగా బెట్టింగులు కూడా సాగుతున్నాయి. ఈ బెట్టింగ్ విషయంలో పోలీస్ లు ప్రత్యేకమైన నిఘాతో, ప్రత్యేకమైన టీములు తో తమ విధులను కొనసాగించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మొత్తం మీద రాష్ట్రంలో ముఖ్యమంత్రి ఎవరు? జిల్లాలో ఏ ఏ పార్టీలు గెలుపొందుతారు? ధర్మవరం నియోజకవర్గంలో ఎవరు గెలుస్తారు అన్నది జూన్ 4వ తేదీ వరకు అటు ఎమ్మెల్యే అభ్యర్థులు, నియోజకవర్గ ప్రజలు నిరీక్షణ చేయక తప్పదు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img