Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Sunday, September 8, 2024
Sunday, September 8, 2024

ఈనెల 26న నిర్వహించే బైక్ ర్యాలీని జయప్రదం చేయండి..

సంయుక్త కిశాన్ మోర్చా ట్రేడ్ యూనియన్లు

విశాలాంధ్ర ధర్మవరం:: దేశవ్యాప్తంగా జిల్లా కేంద్రాలలో ఈనెల 26వ తేదీన శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తిలో జరిగే బైక్ ర్యాలీని జయప్రదం చేయాలని ఏపీ రైతు సంఘం నాయకులు పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా వారు పట్టణంలోని సిఐటియు కార్యాలయంలో సమావేశాన్ని నిర్వహించిన తర్వాత మాట్లాడుతూ రైతుల పంటలకు గిట్టుబాటు ధరలు కల్పించాలని, పంటలకు నష్టపరిహారం చెల్లించాలని, రైతు రుణాలను మాఫీ చేయాలని, కేరళ ప్రభుత్వ తరహాలో విముక్తి చట్టాన్ని తీసుకొని రావాలని వారు తెలిపారు. 50 సంవత్సరాలు పూర్తి అయిన ప్రతి రైతుకు పదివేల రూపాయలు పెన్షన్ ఇవ్వాలని, రైతుల మోటార్లకు స్మార్ట్ మీటర్లు బిగించ రాదని, డాక్టర్ స్వామినాథన్ కమిషన్ సిఫార్సులు వెంటనే అమలు చేయాలని, పోలవరం ప్రాజెక్టు నిధులు కేటాయించాలని తెలిపారు. ఉపాధి హామీ పథకం కోసం రెండు లక్షల కోట్ల రూపాయలు కేటాయించాలని, అదేవిధంగా 404 కార్మిక చట్టాలను వ్యతిరేకిస్తూ నాలుగు కార్మిక కోడ్లు రద్దు చేయాలని, కార్మికుల కనీస వేతనం 20వేల రూపాయలు అమలు చేయాలని, సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని వారు డిమాండ్ చేశారు. కావున రైతులు, కార్మికులు, ప్రజలు పెద్ద ఎత్తున పుట్టపర్తికి శుక్రవారం ఉదయం 10 గంటలకు చేరుకోవాలని వారు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఏపీ రైతు సంఘం ప్రధాన కార్యదర్శి జే వి రమణ, మారుతి, రైతు సంఘం జిల్లా అధ్యక్షులు పెద్దన్న, సిఐటియు మండల అధ్యక్ష కార్యదర్శులు ఆదినారాయణ, అయూబ్ కాన్, ఏపీ చేనేత కార్మిక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు వెంకటనారాయణ, చేనేత జిల్లా నాయకులు వెంకటస్వామి తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img