ఆచూకీ తెలపాలని తల్లిదండ్రుల ఆవేదన
విశాలాంధ్ర ధర్మవరం:: పట్టణంలోని కళాజ్యోతి సర్కిల్ ధ్యాన మందిరము దగ్గర నివసిస్తున్న గోపాల్ నాయక్, అరుణ బాయీ ల పెద్ద కుమారుడు బుధవారం ఉదయం ఇంట్లో నుండి వెళ్లిపోయాడని తెలిపారు. తెలిసినచోట, తెలియని చోట,బంధువులు,మిత్రుల వద్ద కూడా వెదకడం జరిగిందని, కానీ ఫలితం లేదని తెలిపారు. మా కుమారుడు పట్టణంలోని సంజయ్ నగర్ లో ఏడవ తరగతి చదువుతున్నాడని, ఇంట్లో ఆనియమితిని బయటికి పోయిన అబ్బాయి ఇంతవరకు రాలేదని వారు కన్నీటి పర్యంతమయ్యారు. చివరకు వన్‌టౌన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడం జరిగిందని తెలిపారు. అబ్బాయి ఆచూకీ వివరాలు తెలిసిన యెడల సెల్ నెంబర్ 9494543702 కు తెరపాలని కోరారు. వన్ టౌన్ పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు.