Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Tuesday, September 17, 2024
Tuesday, September 17, 2024

రైల్వే ప్రయాణికులు గమ్యస్థానం చేరేంతవరకు జాగ్రత్తలు పాటించాలి.. రైల్వే- ఆర్పిఎఫ్- సిఐ. బోయ కుమార్

విశాలాంధ్ర ధర్మవరం:: రైల్వే ప్రయాణికులు అందరూ కూడా తమ గమ్యస్థానమును చేరేంతవరకు తగిన జాగ్రత్తలను పాటించాలని రైల్వే ఆర్పిఎఫ్సిఐ బోయ కుమార్ పేర్కొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రైలులో ప్రయాణం చేసేటప్పుడు తమ దగ్గర గల విలువైన వస్తువులు, నగలు, సెల్ ఫోన్ , ల్యాప్టాప్ లపై దృష్టి పెట్టి, తరచూ వాటిని చూస్తూ ఉండాలని తెలిపారు. మామూలుగా రైలులో బాత్రూం కి వెళ్ళినప్పుడు తమ విలువైన వస్తువులను మీ బంధువులకు అప్పగించి, వెళ్లాల్సి ఉంటుందని తెలిపారు. కానీ రైలులో పరిచయమైన వారందరూ మంచివారు కాదని, తెలివైన దొంగలు కూడా ఉంటారని గమనించాలని తెలిపారు. అంతేకాకుండా అపరిచిత వ్యక్తులతో మాట్లాడరాదని, వారు ఇచ్చే తినుబండారాలు కూడా తీసుకోరాదని తెలిపారు. అలా తీసుకున్నట్లయితే మత్తుగా పడిపోయిన తర్వాత తమ దగ్గర ఉన్న వస్తువులన్నీ కూడా దొంగలించబడతాయని తెలిపారు. రైలు ప్రయాణంలో తమ పక్కన ఉండే వారు కావచ్చు, లేదా ఇతరత్రా వాళ్లు ప్రయాణికుల్ని మాటలలో పడేలా ఆకర్షింపబడతారని తెలిపారు. అటువంటి వాటికి ప్రయాణికులు దూరంగా ఉండాలని తెలిపారు. దొంగలు అనేక రకాలుగా ఉంటారని, దొంగతనం చేయడానికి సులభతరమైన వాటిని దొంగలు ఎంచుకుంటారని తెలిపారు. అంతేకాకుండా రైలు ఏ ప్రాంతంలోనైనా నిలబడినప్పుడు ఫుడ్ తెచ్చుకోవడానికి, వాటర్ బాటిల్ తెచ్చుకోవడానికి దిగేముందు, ఆలోచించి తమ వస్తువుల దగ్గర తమ బంధువుల్ని పెట్టి రావాలని తెలిపారు. రాత్రి సమయాలలో ప్రయాణికులకు సంబంధించినటువంటి వస్తువులను జాగ్రత్తగా తమ వద్దే ఉంచుకుంటూ అప్పుడప్పుడు, ఆ వస్తువులను చూసుకోవాలని తెలిపారు. లేనియెడల ప్రయాణికులు గాడ నిద్రలో ఉన్నప్పుడు దొంగతనం జరిగే అవకాశాలు మెండుగా ఉంటాయని తెలిపారు. అంతేకాకుండా రైల్వే ట్రాక్ వద్ద ఎలక్ట్రికల్ వర్క్స్ జరుగుతున్నాయని, రైలు పట్టాలు ట్రాకు దాటేటప్పుడు ఎక్కువగా ప్రమాదాలు జరుగుతున్నాయని తెలిపారు, ఈ ప్రమాదాలు రైలు రాకను గమనించకనే ఈ ప్రమాదాలు జరుగుతున్నాయని తెలిపారు. కేవలం అరుదుగా మాత్రమే మరణాలు జరుగుతున్నాయని తెలిపారు. ప్రతి ట్రైన్ ఎలక్ట్రికల్ తో కూడుకొని వెళుతుందని, శబ్దం కూడా చాలా తక్కువగా ఉండటంతో ట్రాక్ దాటే సమయంలో జాగ్రత్తలు తప్పనిసరి పాటించాలని బాటసారులకు తెలియజేశారు. రైలు ఆస్తుల మీద ఆకతాయిలు, మైనారిటీ వాళ్లు అనేక దుశ్చర్యాలకు పాల్పడుతున్నారని, అటువంటి వారిపైన ఆర్పిఎఫ్ పోలీసులతో పాటు ఇతర విభాగాల అధికారులు కూడా పర్యవేక్షణ చేస్తుంటారని తెలిపారు. ట్రాక్ దగ్గర రాళ్లు ఉంచడం, రైళ్లపై రాళ్లు విసరడం లాంటివి చేయరాదని, అది చట్టరీత్యా నేరమవుతుందని, కచ్చితంగా పట్టుబడినప్పుడు కఠినమైన శిక్ష తోపాటు కేసు కూడా నమోదు చేయడం జరుగుతుందని తెలిపారు. అదేవిధంగా ట్రాక్ దగ్గర ఒక రూపాయి నాణ్యం (కాయిన్) ఉంచడం గాని, రాళ్లు వేయడం వల్ల సిగ్నల్స్ దెబ్బతినే అవకాశం ఉందని వారు తెలిపారు. రైళ్లలో ప్రయాణికులు సుఖమైన ప్రయాణం చేయాలంటే, ప్రతి విషయము క్షుణ్ణంగా జాగ్రత్తగా పరిశీలించుకుంటూ, దృష్టి పెట్టుకుంటూ, ప్రయాణించినప్పుడే సుఖవంతమైన ప్రయాణం రైళ్లల్లో మాత్రమే సాధ్యమవుతుందని తెలిపారు. కావున ప్రయాణికులు పై విషయాలు గమనించి రైళ్ల అధికారులతో సహకరించాలని తెలిపారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img