Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Tuesday, September 17, 2024
Tuesday, September 17, 2024

ఎన్నికల నిర్వహణ సన్నాహాకాలను వేగవంతం చేయండి

ఇంటి పట్టా లబ్ధిదారులకు వేగవంతంగా రిజిస్ట్రేషన్ పనులకు కృషి చేయండి

. ఈవీఎం మరియు ఎన్నికల పంపిణీ కేంద్రం సిద్ధం
. జిల్లా కలెక్టర్ అరుణ్ బాబు

విశాలాంధ్ర – ధర్మవరం (శ్రీ సత్య సాయి జిల్లా) : ఎన్నికల నిర్వహణ సన్నాహకాలను వేగవంతం చేయాలని, ఇంటి పట్టా లబ్ధిదారులకు రిజిస్ట్రేషన్ కార్యక్రమం పనులకు అధికారులు మరింత కృషి చేయాలని జిల్లా కలెక్టర్ అరుణ్ బాబు తెలిపారు. ఈ సందర్భంగా గురువారం వారు ధర్మవరంలో ఆకస్మికంగా పర్యటించారు. తొలుత పట్టణంలోని గుట్ట కింద పల్లె లో గల మోడల్ స్కూల్ ను వారు సందర్శించారు. ఆ పాఠశాల గదులను, పరిస్థితులను వారు క్షుణ్ణంగా పరిశీలించి ఈవీఎం మరియు ఎన్నికల సామాగ్రి పంపిణీ కేంద్రముగా వారు నిర్ణయించారు. ఈ మోడల్ స్కూల్ అణువుగా ఉందని కలెక్టర్ అధికారులకు ఆదేశించారు. ఈ మోడల్ స్కూల్ నుండి అన్ని పోలింగ్ బూతు కేంద్రాలకు ఈవీఎంతోపాటు ఎన్నికల సామాగ్రిని పంపాలని వారు తెలియజేశారు. తదుపరి తాసిల్దార్ కార్యాలయంలో ఆర్డిఓ వెంకట శివారెడ్డి, తాసిల్దార్ రమేష్, మున్సిపల్ కమిషనర్ రామ్కుమార్, ఎంపీడీవో కార్యాలయ ఏవో. అబ్దుల్ నబీ, డి.ఎస్.పి శ్రీనివాసులు,సర్వేయర్ల అధికారులతో వారు సమావేశాన్ని నిర్వహించి, ఎన్నికల గడువు తేదీ దగ్గర పడుతున్నందున నియోజకవర్గంలో అన్ని ఎన్నికల ప్రక్రియ పనులు వేగవంతంగా అయ్యేలా చూడాలని వారు ఆదేశించారు. అన్ని పోలింగ్ బూత్ కేంద్రాలు ఓటర్లకు అనుకూలంగా ఉండే విధంగా చర్యలు చేపట్టాలని తెలిపారు. ఎక్కడ ఎటువంటి తప్పిదాలకు తావు ఇవ్వరాదని సూచించారు. 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరికి ఓటు నమోదు చేసుకొని ఓటు హక్కు పొందేలా చర్యలు చేపట్టాలని, అదేవిధంగా ఫారం-6,7,8 లలో క్లైమూలను పారదర్శకతో విచారణ జరిపి న్యాయం జరిగేలా చూడాలని తెలిపారు. ప్రతి క్లైమూను క్షుణ్ణంగా పరిశీలించి విచారణతో తగిన జాబితాను తయారు చేయాలని తెలిపారు. ఎటువంటి పరిస్థితుల్లో పొరపాట్లకు, నిర్లక్ష్యానికి తావు ఇవ్వరాదని సూచించారు. అనంతరం కలెక్టర్ మారుతీ నగర్ లోని సచివాలయ కేంద్రమునకు, ఎర్రగుంటలోని సచివాలయ కేంద్రమునకు వెళ్లి, అక్కడ సచివాలయం వ్యవస్థకు ప్రభుత్వ సంక్షేమ పథకాలు జరుగుతున్న తీరును సిబ్బంది ద్వారా అడిగి తెలుసుకున్నరు. సచివాలయాల్లో ఉన్న ఇంటి పట్టా పొందిన లబ్ధిదారులతో నేరుగా వారు మాట్లాడి ఇంటి పట్టా రిజిస్ట్రేషన్ విషయంలో కలుగు ప్రయోజనాలు గూర్చి అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వం చేపడుతున్న ఈ పథకాన్ని లబ్ధిదారులు సద్వినియోగం చేసుకోవాలని వారికి సూచించారు. ఇంటి పట్టా లబ్ధిదారులకు రిజిస్ట్రేషన్ ప్రక్రియను వేగవంతం అయ్యేలా అధికారులు తగిన పర్యవేక్షణను చేయాలని తెలిపారు. సచివాలయ కేంద్రాలలో ప్రభుత్వం ప్రవేశపెట్టిన నవరత్నాల కార్యక్రమాన్ని ప్రజలందరికీ అందే విధంగా తమ విధులను నిర్వర్తించాలని, సచివాలయ ఉద్యోగులను ఆదేశించారు. ఇంటి సర్వే విషయాలపై కూడా సర్వే అధికారులతో తగిన సమాచారాన్ని అడిగి తెలుసుకున్నారు. ఎన్నికల ప్రక్రియ విధానముపై గాని, ఇంటి పట్టాను రిజిస్ట్రేషన్ చేసే పనులయందు గానీ, ప్రజా సమస్యలు పరిష్కరించడంలో గాని అధికారులు, సిబ్బంది నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆర్డీవో వెంకట శివారెడ్డి, తాసిల్దార్ రమేష్, మున్సిపల్ కమిషనర్ రామ్ కుమార్, ఎంపీడీవో కార్యాలయ ఏవో. అబ్దుల్ నబీ, డీఎస్పీ శ్రీనివాసులు పాటు రెవెన్యూ, సచివాలయ ఉద్యోగులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img