Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Sunday, September 8, 2024
Sunday, September 8, 2024

నోటీస్ బోర్డు రాత్రికి రాత్రే మాయం

నోటీస్ బోర్డ్ మాయం పై సిపిఐ నాయకులు ఆరా

విశాలాంధ్ర, ఎన్ పి కుంట: మండల కేంద్రంలోని తహసిల్దార్ కార్యాలయం దగ్గరలో అక్రమంగా వేసిన లేఔట్ ల పై నిర్మాణాలు చేపట్టరాదంటూ పంచాయతీ పాలకులు ఏర్పాటు చేసిన నోటీసు బోర్డు రాత్రికి రాత్రే మాయం కావడంతో మండలంలో చర్చనీయాంశంగా మారింది. పంచాయతీ పాలకులు బుధవారం ఏర్పాటు చేయగా గురువారం ఉదయం చూసే సరికి బోర్డు మాయం కావడంతో పలువురు పలు రకాలుగా చర్చించుకుంటున్నారు. నోటీసు బోర్డు ఏర్పాటు చేసి ఒక రోజు కూడా కాకుండానే మాయం కావడంతో మండల సిపిఐ కార్యదర్శి వంక మద్ది జి రమణ, సిపిఐ రాష్ట్ర రైతు సంఘం కమిటీ సభ్యులు సూర్యనారాయణ రెడ్డి, మండల రైతు సంఘం అధ్యక్షులు రామ్మోహన్ లు పంచాయతీ కార్యదర్శి రమేష్ ను నోటీసు బోర్డు మాయంపై అడిగి తెలుసుకున్నారు. అక్రమ లే అవుట్ లలో ఇప్పటికే పలువురు లక్షలు పెట్టి కొనుగోలు చేశారని ఆరోపణలు వస్తున్నాయి. అయితే లే అవుట్ ల నిర్వహణదారుడు వ్యవసాయ భూమిని కన్వర్షన్ చేసిన తర్వాత ప్లాట్లు వేయాల్సి ఉన్న సంబంధిత భూమికి ఎలాంటి కన్వర్షన్ చేయకుండానే ప్లాట్లు అమ్మకాలు మొదలు పెట్టినట్లు తెలుస్తోంది. తహసిల్దార్ కార్యాలయానికి కోత వేటు దూరంలో వ్యవసాయ భూమిని కన్వర్షన్ చేయకుండానే ప్లాట్లు వేసి అమ్మకాలు జరుపుతుంటే సంబంధిత అధికారులు కన్ను నుండి కూడా చూడలేని విధంగా వ్యవహరిస్తున్న తీరుపై మండల ప్రజలు పలు విధాలుగా విమర్శిస్తున్నారు. ఈ ప్రాంతంలో (ప్లాట్లు) ఎలాంటి నిర్మాణాలు చేపట్టవద్దని నోటీసు బోర్డు ఏర్పాటు చేశామని పంచాయతీ కార్యదర్శి సిపిఐ నాయకులకు వివరించారు. నోటీస్ బోర్డ్ రాత్రికి రాత్రి మాయం కావడంతో ఈ విషయంపై పంచాయతీ చట్ట ప్రకారం సంబంధిత యజమానిపై ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లడం జరుగుతుందని పంచాయతీ కార్యదర్శి పేర్కొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img