Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Tuesday, September 17, 2024
Tuesday, September 17, 2024

ధర్మవరంలో కదం తొక్కిన తెలుగుదేశం పార్టీ శ్రేణులు

ధర్మవరం నియోజకవర్గంలో టిడిపిని బ్రతికించండి.. టిడిపి నాయకులు, కార్యకర్తలు.

విశాలాంధ్ర -ధర్మవరం:: పరిటాల శ్రీరామ్కు టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు ఎమ్మెల్యే సీటు ఇవ్వకపోవడంతో ధర్మవరం పట్టణంలో టిడిపి శ్రేణులు కదం తొక్కారు. ధర్మవరంలో టిడిపిని బ్రతికించండి అంటూ భారీ ర్యాలీని టిడిపి నాయకులు, కార్యకర్తలు నిర్వహించారు. మాజీ ఎమ్మెల్యే గోనుగుంట్ల సూర్యనారాయణకు తప్ప మరో ఎవరికైనను టికెట్ ఇచ్చినా తాము గెలిపించుకుంటామని తెలిపారు. గత నాలుగు సంవత్సరాలుగా టిడిపి పార్టీని కాపాడింది పరిటాల శ్రీరామ్ అని వారు ఆవేదన వ్యక్తం చేశారు. నియోజకవర్గంలోని అన్ని మండలాల నుంచి టిడిపి శ్రేణులు పరిటాల అభిమానులు వేలాది సంఖ్యలో ధర్మారంలోని కాలేజీ సర్కిల్కు చేరుకొని అక్కడినుండి గాంధీ సర్కిల్ వరకు భారీ నిరసన ప్రదర్శనను నిర్వహించారు.”సూరి మాకొద్దు” అంటూ నినాదాలను హోరెత్తించారు. అనంతరం టిడిపి నాయకులు మాట్లాడుతూ ఎక్స్ ఎమ్మెల్యే సూరి ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో ఏ రోజు కార్యకర్తలను పట్టించుకున్న పాపాన పోలేదని వారు మండిపడ్డారు. 2019 ఎన్నికల్లో పార్టీ ముఖం చూసి సహకరించడం జరిగిందని తెలిపారు. ఓడిపోయిన కొద్ది రోజులకే సూరి నమ్ముకున్న మమ్మల్ని వదిలేసి పోయి బిజెపిలో చేరడం ఎంతవరకు సమంజసమని తెలిపారు. పార్టీ పరిస్థితి ఏంటి ఎలా అని ఆలోచన లేకుండా కేవలం తన వ్యాపారాలను కోసం పార్టీని విడిపోవడం దారుణం కాదా అని ప్రశ్నించారు. ఆనాడు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు నాయకులు అనాధల మారితే పరిటాల శ్రీరామ్ ధర్మారం కొచ్చి, అందరికీ అండగా, తోడుగా ఉంటూ మాకెంతో ధైర్యాన్ని కల్పించాలని తెలిపారు. ఆనాడు చంద్రబాబుకు తాము విజ్ఞప్తి చేస్తే పరిటాల శ్రీరాముని ఎమ్మెల్యే అభ్యర్థిగా ప్రకటన చేయడం నిజం కాదా అని ప్రశ్నించారు. నాడు పరిటాల శ్రీరామ్ ధర్మవరం నియోజకవర్గంలో పార్టీకి ఊపిరి పోయడం జరిగిందన్నారు. గత నాలుగు సంవత్సరాలుగా పరిటాల శ్రీరామ్ నియోజకవర్గంలోని అన్ని మండలాలలో గ్రామ గ్రామాన టిడిపి యొక్క సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకొని వెళ్లి, గట్టి ప్రచారం కూడా నిర్వహించడం జరిగిందని తెలిపారు. కానీ అధిష్టానం మాత్రం పొత్తులు అంటూ ఆ టికెట్లు బిజెపికి కేటాయించడంలో మర్మమేమో తెలియదని తెలిపారు. చంద్రబాబు నాయుడు చెప్పిన ప్రకారం టిడిపి బిజెపికి ఇస్తామంటే తాము అడ్డుకోమని కానీ ఆనాడు సూరి పార్టీని విడిచిపెట్టిన వారికి తిరిగి టికెట్ ఇవ్వడం మాకు చాలా బాధాకరమని వారు తెలిపారు. ఇప్పుడు కూడా టిడిపి భారీ మెజారిటీతో గెలుపొందే సందర్భంగా టికెట్టును టిడిపికి కేటాయించకపోవడం దారుణమని ఆవేదన వ్యక్తం చేశారు. అందుకే టిడిపి టికెట్ను పరిటాల శ్రీరామ్కు మరోసారి పునః ఆలోచించి పొత్తులో భాగంగా శ్రీరామకు ఇవ్వాలని వారు విజ్ఞప్తి చేశారు. పరిటాల శ్రీరామ కు టికెట్ ఇవ్వకుండా మాజీ ఎమ్మెల్యే గోనుగుంట్ల సూర్యనారాయణకు టికెట్ ఇస్తే తామంతా మూకుమ్మడిగా రాజీనామాలు చేస్తామని తెలిపారు. యుద్ధ సైనికుల ఈ భారీ ర్యాలీలో టిడిపి శ్రేణులు పాల్గొనడంలో ఈ ర్యాలీ నిరసన విజయవంతమైంది. ఈ ర్యాలీని విజయవంతం చేసినందుకు సీనియర్ టిడిపి నాయకులు పేరుపేరునా కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో వేలాది మంది నాయకులు, కార్యకర్తలు, పార్టీ అభిమానులు, శ్రేయోభిలాషులు, నియోజకవర్గ ప్రజలు, మహిళలు, అత్యధిక సంఖ్యలో నియోజకవర్గ ప్రజలు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img