Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Sunday, September 8, 2024
Sunday, September 8, 2024

పేదలకు వైద్య సేవ చేయుటలో ఎంతో సంతృప్తి ఉంది..

రోటరీ క్లబ్ అధ్యక్ష, కార్యదర్శులు
విశాలాంధ్ర ధర్మవరం:: పేదలకు వైద్య సేవ చేయుటలోనే ఎంతో సంతృప్తి ఉందని రోటరీ క్లబ్ అధ్యక్షుడు బి. జయసింహ, కార్యదర్శి డి. నాగభూషణ, కోశాధికారి సుదర్శన్ గుప్తా, క్యాంపు చైర్మన్ పి.కృష్ణమూర్తి, ఉపాధ్యక్షులు కే. నరేందర్ రెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా పట్టణంలోని ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాలలో రోటరీ క్లబ్బు, శంకరా కంటి ఆసుపత్రి- బెంగళూరు, జిల్లా అంధత్వ నివారణ సంస్థ- శ్రీ సత్యసాయి జిల్లా వారి సహకారంతో ఉచిత కంటి ఆపరేషన్ల వైద్య శిబిరమును నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈ శిబిరానికి 176 మంది కంటి రోగులకు గాను ఇందులో 126 మంది కంటి ఆపరేషన్లకు ఎంపిక కావడం జరిగిందని, వీరిని 22వ తేదీ ఉచితంగా బెంగళూరు ఆసుపత్రికి తీసుకొని వెళ్లి ఆపరేషన్లు చేసి తిరిగి రావడం జరుగుతుందని తెలిపారు. తదుపరి ఈ శిబిరానికి దాతలుగా కీర్తిశేషులు బండి చిన్న పుల్లన్న, కీర్తిశేషులు బండి నారాయణమ్మ కుమారులు బండి వెంకట నరసింహయ్య, బండి హరినాథు, కీర్తిశేషులు పాలగిరి సుశీలమ్మ, వీరి కుమారుడు పాలగిరి శంకరనారాయణ, కీర్తిశేషులు పాలగిరి నాగలక్ష్మి ,భర్త పాలగిరి నాగభూషణము వ్యవహరించడం పట్ల అభినందన శుభాకాంక్షలు తెలుపుతూ, కృతజ్ఞతలు తెలియజేశారు. రోటరీ క్లబ్ ప్రారంభం నుంచి ఇప్పటివరకు దాదాపుగా 30 వేలకు పైగా ఆపరేషన్లు చేయించి ఉచితంగా అద్దాలను కూడా పంపిణీ చేయడం జరిగిందని తెలిపారు. రోటరీ క్లబ్ వివిధ రకాల సేవలను చేస్తూ పేద ప్రజల కు అండగా నిలుస్తోందని తెలిపారు. అంతేకాకుండా ప్రజలందరూ కూడా నేత్రదానంపై అవగాహన పొంది, అందత్వాన్ని నివారించడానికి రెండు జీవితాలలో వెలుగు నింపడానికి నేత్రదానంకు కూడా పూనుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో మనోహర్ గుప్తా, మాజీ అధ్యక్షులు కృష్ణమూర్తి, క్లబ్బు అసిస్టెంట్ గవర్నర్ రత్నశేఖర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img