Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Tuesday, September 17, 2024
Tuesday, September 17, 2024

ఎన్నికలలో వాలంటీర్లను దూరంగా ఉంచండి

– సిటిజన్స్ ఫర్ డెమోక్రసీ సంయుక్త కార్యదర్శి వల్లం రెడ్డి లక్ష్మణ రెడ్డి

విశాలాంధ్ర – శ్రీకాకుళం టౌన్: ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికలు స్వేచ్ఛాయుతంగా , పారదర్శకంగా జరగాలంటే ఎన్నికల కమిషన్ ఆదేశాలను గౌరవించి వాలంటీర్లను ఎన్నికలలో దూరంగా ఉంచాలని సిటిజన్స్ ఫర్ డెమోక్రసీ జాయింట్ సెక్రటరీ వల్లం రెడ్డి లక్ష్మణరెడ్డి పేర్కొన్నారు. ఈనెల 27వ తేదీ శ్రీకాకుళంలో బాపూజీ కళామందిరంలో ఓటు వేద్దాం -ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేద్దాం అనే అంశంపై జరిగిన కళాజాతకు ఆంధ్ర విశ్వవిద్యాలయ దూర విద్యా కేంద్రం పూర్వ డైరెక్టర్ పి.హరి ప్రకాష్ అధ్యక్షత వహించారు. వల్లంరెడ్డి లక్ష్మణ రెడ్డి ప్రసంగిస్తూ రాజకీయ విలువలు పతనమవుతున్నాయని, ప్రజాస్వామ్యం ధనస్వామ్యంగా మారిందన్నారు. ప్రపంచంలో 167 దేశాలలో ప్రజాస్వామ్య సూచికను పరిశీలిస్తే భారతదేశం 74వ స్థానంలో ఉందన్నారు. దక్షిణాది రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్, కర్ణాటక , తమిళనాడు , తెలంగాణ రాష్ట్రాలలో ఎన్నికల వ్యయం గణనీయంగా పెరిగిందన్నారు. కులము, మతము,ధనము, మద్యం లాంటి ప్రలోభాలకు లోను కాకుండా ప్రతి ఒక్కరూ ఓటింగ్ లో పాల్గొనాలని పట్టణాలలో ఓటింగ్ శాతం పెరగాలని కోరారు. అధికార యంత్రాంగం లో కొందరు అధికార పార్టీ నేతలకు లొంగి అవినీతికి పాల్పడుతూ ఓటర్ల జాబితాను లోప భూయిష్టంగా రూపొందించారని అలాంటి వారిని ఇప్పటికే ఎన్నికల కమిషన్ సస్పెండ్ చేయడం కఠిన చర్యలు చేపట్టడం జరిగిందన్నారు. ఇకనైనా అధికార యంత్రాంగం నిష్పక్షపాతంగా వ్యవహరించి ఎన్నికలను పారదర్శకంగా నిర్వహించాలని కోరారు. ప్రభుత్వ వేతనం పొందుతూ సంక్షేమం పథకాలను క్షేత్రస్థాయిలో అమలు చేస్తున్న వాలంటీర్లను ఎన్నికలలో తమ సైన్యంగా , ఎన్నికల అంబాసిడర్ గా ఉపయోగించుకుని ఎన్నికల లబ్ధి పొందాలని రాష్ట్ర ముఖ్యమంత్రి భావించడం ప్రజాస్వామ్య స్ఫూర్తికి విఘాతం కలిగిస్తుందన్నారు. నేటికీ ఓటర్ల జాబితా లోప భూయిష్టంగా ఉందని చనిపోయిన వారి ఓట్లు ఓటర్ల జాబితాలో కొనసాగుతున్నాయని , ఒకరికి రెండు మూడు చోట్ల ఓట్లు కొనసాగుతున్నాయని, అనేకమంది అర్హులైన ఓటర్లకు ఓటర్ల జాబితాలో చోటు లభించలేదని , ఇలాంటి లోపాలను రాజకీయ పార్టీల పోలింగ్ ఏజెంట్లు గమనించాలని కోరారు. ఎన్నికల నోటిఫికేషన్ వచ్చిన తర్వాత కూడా నామినేషన్ ప్రక్రియ ప్రారంభం అయ్యేవరకు అర్హులైన వారు కొత్తగా ఓటర్లుగా నమోదు కావచ్చని తెలిపారు. ప్రొఫెసర్ పి .హరి ప్రకాష్ ప్రసంగిస్తూ యువత ఓటింగ్ లో పాల్గొనాలని , తమ భవిష్యత్తుకు నాంది పలికే ప్రభుత్వాలను ఎన్నుకోవాలని కోరారు. ఎన్నికలలో మద్యం ప్రభావం తగ్గించాలని , మంచి సమాజ అభివృద్ధికి రాజకీయ పార్టీలు తోడ్పడాలన్నారు. సీనియర్ పాత్రికేయులు నల్లి ధర్మారావు ప్రసంగిస్తూ ఎన్నికలలో అవినీతిపరులైన దొంగలు పోటీ బడుతున్నారని వారిలోని మంచి దొంగలను ఎన్నుకోవలసిన పరిస్థితి వచ్చిందన్నారు. అట్టాడ అప్పలనాయుడు ప్రసంగిస్తూ బ్యాలెట్ ని కూడా బుల్లెట్ లాగా ఉపయోగించాలన్నారు. నేడు దుర్మార్గమైన ప్రజాస్వామ్యం కొనసాగుతుందని దీనికి అంతం పలకాలన్నారు.
ఈ కార్యక్రమంలో ప్రముఖ కవి చింతాడ రామారావు, లైన్స్ క్లబ్ ప్రెసిడెంట్ పి.రవికుమార్, చైర్ పర్సన్ లైన్స్ ఇంటర్నేషనల్ ఎన్.మోహన్, జోనల్ చైర్ పర్సన్, లైన్స్ ఇంటర్నేషనల్ బి. దేవభూషణరావు తదితరులు ప్రసంగించారు.
రంగం ప్రజా సాంస్కృతిక వేదిక రాజేష్ బృందం నేతృత్వంలో పాడిన ఓటర్లను చైతన్యం పరిచే గేయాలను , నృత్య నాటికలు ఆకట్టుకున్నాయి.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img