Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Sunday, September 8, 2024
Sunday, September 8, 2024

మారుమూల గిరిజనగ్రామానికి మూడు నెలల్లో బిటిరోడ్డు వేయించిన ఎమ్మెల్యే


*గుర్రంపై కూర్చోబెట్టి రెండు కిలోమీటర్ల దూరం పువ్వులు జల్లుతూ తీసుకొని వెళ్ళిన రేపటివలస గ్రామస్తులు
*గ్రామస్తుల కృతజ్ఞతకు ఫిదాఅయిన ఎమ్మెల్యే జోగారావు
రోడ్డు ప్రారంభంచేసిన ఎమ్మెల్యే

విశాలాంధ్ర – సీతానగరం: నియోజక వర్గంలోని ఎమ్మెల్యే జోగారావు చేస్తున్న అభివృధ్ధి పనులు, మారుమూల ప్రాంతాలకు రోడ్లు నిర్మాణాలుచూసి తమ నాయకుడికి విభిన్న రీతిలో కృతజ్ఞతభావాన్ని ఊరిలోఉన్న ప్రజలంతా కలిసికట్టుగా చేస్తున్న సత్కారాలు,సన్మానాలుచూసి ఎమ్మెల్యే ఫిదా అవుతున్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తనకుఇచ్చిన అపూర్వ అవకాశాన్ని సక్రమంగా సద్వినియోగం చేసుకోవడంవల్లనే ప్రజల అనురాగాలు, అభిమానాలు పొందడం ఎంతోఆనందంగా ఉందన్నారు.ఇటీవల బలిజిపేట మండలంలోని నూకలవాడలో పల్లకిపైకూర్చోబెట్టి గ్రామానికి ఘన స్వాగతంపలికి సత్కారాలుతో తీసుకొని వెళ్లగా,మరొకసారి ఇదేమండలంలోని పి. చాకరపల్లి గ్రామంలో అంతా కలిసికట్టుగా తనకు గుర్రపుబగ్గీపై తీసుకుని వెళ్లి పాలాభిషేకంచేసిన అంశాన్ని తాను మర్చిపోకముందే గురువారంనాడు సీతానగరం మండలంలోని మారుమూల గిరిజనగ్రామమైన రేపటివలసలో గ్రామస్తులంతా కలసికట్టుగా గుర్రంపై కూర్చోబెట్టి పులుగుమ్మి నుండి రేపటివలసవరకు రెండుకిలోమీటర్ల పొడవున పూలుజల్లుతూ ఘనస్వాగతం పలికారు.గురువారం ముందుగా పులిగుమ్మి కూడలివద్ద రేపటివలసకు నిర్మించిన బిటిరోడ్డును ఎమ్మెల్యే
అలజింగి జోగారావు ప్రారంభం చేశారు.ఈసందర్భంగా రేపటివలసలో గ్రామస్తులు ఏర్పాటుచేసిన సమావేశంలో మాట్లాడుతూ మూడునెలలు క్రిందట ఒక కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగ గ్రామంలోగల 70కుటుంబాలకు చెందిన అందరూకూడా తమ గ్రామానికి రోడ్డులేక పోవడం కలిగిన ఇబ్బందులు చెప్పారని తెలిపారు. దీంతో వారంరోజుల్లో రోడ్డుకు శంకుస్థాపన చేస్తానని చెప్పగా ఇదే మాటలను గత ముప్ఫై ఏళ్లనుండి రాజులు, రాజకీయ నాయకులు ఇలాగే చెప్పడం చేస్తున్నారని తెలిపారన్నారు. దీంతోవారం రోజులలోపు ఒకేఒక్క గ్రామానికి కోటి 26లక్షలు మంజూరు చేయించి రెండు కిలోమీటర్ల బిటిరోడ్డుకు శంకుస్థాపనచేసిన సమయంలో వారి ఆనందంకుఅవదులు లేవన్నారు. మూడు నెలలువ్యవదిలోపు రోడ్డు పనులు పూర్తి చేయాలని ఆదేశించడంతో గుత్తేదారు పూర్తి చేసినట్లు చెప్పారు. ఇటీవల పెద్ద ఎత్తున లింకురోడ్లు నిర్మాణాలు పెద్ద ఎత్తున చేపట్టడం జరిగిందని తెలిపారు. నేడు తనకు జరిగిన సత్కారంకు
ముఖ్యమంత్రి వైఎస్ జగ్మోహన్రెడ్డి, వైఎస్సార్సీపీ ప్రభుత్వ ఆశీస్సులేనని చెప్పారు.ఇటువంటి మంచిపనులు చేయడం ఎంతో ఆనందంగా ఉందన్నారు. గ్రామపెద్ద బేతనపల్లి అప్పలనాయుడు,
బేతనపల్లి వినయ్,గ్రామస్తులు,మహిళలు ఎమ్మెల్యే జోగారావుకు కృతజ్ఞతలు తెలిపి ఆయనకు జీవితాంతం రుణపడి ఉంటామని చెప్పారు. తమకు రోడ్డు వస్తాదని కలలో కూడా ఊహించలేదని, ఎమ్మెల్యే జోగారావు వల్లనే సాధ్యం అయిందన్నారు. ఎమ్మెల్యే జోగారావుతో పాటు రోడ్డుపనులు నాణ్యతగా మూడు నెలల్లో పూర్తి చేసిన గుత్తేదారు దండు శివరామరాజుకు కృతజ్ఞతలు తెలిపారు. ఈకార్యక్రమంలో మాజీ జెడ్పీ చైర్మన్ వాకాడ నాగేశ్వరరావు,సీతానగరం, పార్వతీపురం మండలాల ప్రజా ప్రతినిధులు, వైఎస్సార్సీపీ నాయకులు, తామరకండి గ్రామ పంచాయతీ సర్పంచ్, ఎంపిటిసి,కో ఆపరేటివ్ ప్రెసిడెంట్, రేపటి వలస గ్రామస్థులు పాల్గొన్నారు.పార్వతీపురం పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img