Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Sunday, September 8, 2024
Sunday, September 8, 2024

వామపక్ష విద్యార్థి నేతలపై పోలీస్‌ జులుం

. హైదరాబాద్‌లో లాఠీచార్జి
. అనేక జిల్లాల్లో అక్రమ అరెస్టులు
. విద్యాసంస్థల బంద్‌ విజయవంతం
. నేడు నిరసనలు: విద్యార్థి సంఘాల పిలుపు

హైదరాబాద్‌ : విద్యారంగ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ వామపక్ష విద్యార్థి సంఘాలు తలపెట్టిన రాష్ట్ర వ్యాప్తం విద్యాసంస్థల బంద్‌ కార్యక్రమం విజయవంతమైందని వామపక్ష విద్యార్థి సంఘాలు ప్రకటించాయి. అయితే హైదరాబాద్‌, రంగారెడ్డి, సిద్దిపేట, హన్మకొండ, ఖమ్మం, నిజామాబాద్‌ జిల్లాల్లో పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించి శాంతియుతంగా బంద్‌ నిర్వహిస్తున్న విద్యార్థులను పోలీసులు బలవంతంగా అరెస్ట్‌ చేశారు. హైదరాబాద్‌లో వామపక్ష విద్యార్థి సంఘాల రాష్ట్ర కమిటీల అధ్వర్యంలో మంత్రుల నివాసాల ముట్టడికి ప్రయత్నించిన నాయకులపై పోలీసులు లాఠీచార్జి చేసి గాయపర్చారు. బూతులు తిడుతూ మహిళా నేతలను కూడా లాగి బలవంతంగా అరెస్ట్‌ చేశారు. అంతకు ముందు విరించి హస్పిటల్‌ సిగ్నల్‌ నుంచి ర్యాలీగా చేరుకున్న విద్యార్థులపై పోలీసులు ఒక్కసారిగా పిడిగుద్దులు గుద్దుతూ దాడి చేశారు. ఈ సందర్భంగా పోలీసులుకు,విద్యార్థులకు తీవ్ర తోపులాట జరిగింది. లాఠీలతో విద్యార్థులను కొడుతూ చొక్కాలు చించి దాడి చేసి మరి బలవంతపు అరెస్టులు చేశారు. ఖమ్మం జిల్లా కేంద్రంలో బంద్‌ పాటించాలని కోరిన వామపక్ష విద్యార్థి సంఘాల నాయకులపై దిల్లీ పబ్లిక్‌ స్కూల్‌ యాజమాన్యం బౌన్సర్లను పెట్టి దాడి చేయించింది. ప్రభుత్వ అణచివేత చర్యలను విద్యార్థి సంఘాలు రాష్ట్ర కమిటీలు తీవ్రంగా ఖండిరచాయి. విద్యార్థి సంఘాల నాయకులపై పోలీసుల లాఠీచార్జి, అరెస్టులకు నిరసనగా రాష్ట్ర వ్యాప్తంగా గురువారం నిరసన కార్యక్రమాలకు పిలుపునిచ్చాయి.
ఈ సందర్భంగా విద్యార్థి సంఘాల నాయకులు ఆర్‌ఎల్‌ మూర్తి, టి.నాగరాజు(ఎస్‌ఎఫ్‌ఐ), పుట్టా లక్ష్మణ్‌(ఎఐఎస్‌ఎఫ్‌), పరుశురాం (పి.డి.ఎస్‌.యు), ఎస్‌.నాగేశ్వరరావు, రామకృష్ణ, మహేష్‌ (పీడీఎస్‌యూ), మల్లేష్‌ (ఏఐడిఎస్‌ఓ), గవ్వ వంశీధర్‌ రెడ్డి (ఏఐఎస్‌బీ),మురళీ (ఏఐఎఫ్‌డీఎస్‌), విజయ్‌ (పీడీఎస్‌యూ`వి) మాట్లాడుతూ రాష్ట్రంలో విద్యాసంవత్సరం ప్రారంభం అయ్యి నెల రోజులు గడుస్తున్నా ఇప్పటి వరకు ప్రభుత్వం సక్రమంగా పాఠ్యపుస్తకాలు ఇవ్వలేదన్నారు. హాస్టల్స్‌, గురుకులాల విద్యార్థులకు నోట్‌ పుస్తకాలు ఇవ్వలేదని తెలిపారు. సొంత భవనాలు లేకుండా గురుకులాలు చాలీచాలని సౌకర్యాలతో అద్దె భవనాల్లో నడుస్తున్నాయి. నాణ్యమైన భోజనం అందించడంలేదు. కేజీబీవీలు, మోడల్‌ స్కూల్స్‌ టీచర్స్‌ లేరు. రాష్ట్రంలో ఖాళీగా ఉన్న 24 వేల టీచర్‌ పోస్టులను భర్తీ చేయడంలేదని అన్నారు. రాష్ట్రంలో బిల్లులు రాక భోజనం పెట్టకుండా మూతబడిన పాఠశాలలు అనేకం ఉన్నాయి. ఇంటర్మీడియట్‌ లో మధ్యాహ్నం భోజనం పథకం అమలు చేస్తామని 2018లో ప్రకటించిన ప్పటికీ ఇప్పటివరకు నోచుకోలేదు. ఈ సంవత్సరం చాలా కళాశాల్లో ల్యాబ్స్‌, లైబ్రరీ, అదనపు తరగతి గదులు లేక విద్యార్థులు చేరలేదు. మన ఊరు -మన బస్తీ – మన బడి పథకాన్ని అన్ని పాఠశాలలకు వర్తింపజేయాలి. రాష్ట్రంలో కార్పొరేట్‌, ప్రైవేట్‌ విద్యాసంస్థల ఫీజుల దందాను అరికట్టేందుకు ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోలేదు. లక్షల రూపాయలు ఫీజులు, డోనేషన్లు పేరుతో దోచుకుంటున్నప్పటికీ కనీసం ప్రభుత్వం తల్లిదండ్రులకు భరోసానిచ్చే ప్రయత్నం కూడా చేయడం లేదు. రాష్ట్రంలో ఐదేళ్ల నుంచి రూ.5,177 కోట్లు ఫీజు రీయింబర్స్‌మెంట్‌ బకాయి లను విడుదల చేయకుండా ప్రభుత్వం కావాలనే పేద విద్యార్థులను ఉన్నత చదువులకు దూరం చేస్తోంది. అలాగే రాష్ట్రంలో బడ్జెట్‌ పాఠశాలలకు ప్రభుత్వం ఎలాంటి రాయితీలు ఇవ్వడం లేదు. కార్పొరేట్‌ విద్యాసంస్థల మాదిరిగా కమర్షియల్‌ ట్యాక్స్‌, కరెంట్‌ బిల్లులు, వాటర్‌ బిల్లులు కూడా కమర్షియల్‌ పరిధి నుండి డొమెస్టిక్‌ పరిధిలో మార్చాలి. కేసీఆర్‌ తన మానస పుత్రిక గురుకుల పథకం అని ప్రకటించారు. కానీ ఎక్కడా డైట్‌ చార్జీలు అమలు కావడం లేదు. మెస్‌, కాస్మోటిక్‌ చార్జీలు పెంచాలని విద్యార్థి సంఘాల నేతలు కోరారు. ప్రభుత్వం ఇకనైనా విద్యార్థుల సమస్యల్ని పరిష్కరించకుంటే రానున్న రోజుల్లో వామపక్ష విద్యార్థి సంఘాల అధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తు ఉద్యమాన్ని నిర్మిస్తామని వారు హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో తాటికొండ రవి, బి.శంకర్‌, కె.అశోక్‌ రెడ్డి ,లెనిన్‌,రమేష్‌, స్టాలిన్‌, శ్రీమాన్‌,(ఎస్‌ఎఫ్‌ఐ), క్రాంతి గ్యార, రెహామాన్‌,హరీష్‌, అన్వర్‌, వినయ్‌ ( ఎ.ఐ.ఎస్‌.ఎఫ్‌), గణేష్‌, నాగరాజు, సైదులు, యశ్వంత్‌ (పి.డి.ఎస్‌.యు),గడ్డం శ్యామ్‌, గణేష్‌, గౌతమ్‌, ఆసిఫ్‌(పి.డి.ఎస్‌.యు), రాజు, అరవింద్‌ రెడ్డి, అఖిల్‌ ,అవినాష్‌(ఎ.ఐ.ఎస్‌.బి), ప్రతిభ, వెంకటేష్‌, సృజన్‌, ఉషాశ్రీ(ఎ.ఐ.డి.ఎస్‌.ఓ),అనిల్‌, సుమంత్‌, పవిత్ర, తిరుపతి,పాషా(పి.డి.ఎస్‌.యు),భాను, నవీన్‌,సాయి(ఎ.ఐ.ఎఫ్‌.డి.ఎస్‌) తదితరులు విద్యార్ధి నాయకులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img