అంతర్జాతీయ పులుల సంరక్షణ దినోత్సవం కార్యక్రమంలో జంతుశాస్త్ర అధ్యాపకుడు డాక్టర్ రమణ.
సినారె జయంతిని ఘనంగా నిర్వహించిన కళాశాల అధ్యాపకులు, విద్యార్థులు.
విశాలాంధ్ర – చింతపల్లి(అల్లూరి సీతారామరాజు జిల్లా) :- అడవులతో పాటు, అటవీ జంతువులను సంరక్షించడం ద్వారానే మానవజాతి మనుగడకు మంచి జరుగుతుందని జంతు శాస్త్ర అధ్యాపకులు డాక్టర్ వి రమణ అన్నారు. అంతర్జాతీయ పులుల సంరక్షణ దినోత్సవం పురస్కరించుకొని స్థానిక ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో అంతర్జాతీయ పులుల దినోత్సవ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సంరక్షణ అంటే కేవలం పులుల సంతతిని పెంచడమే కాదన్నారు. అవి జీవించేందుకు అడవులను కూడా కాపాడుకోవాలన్నారు. అడవుల వలన జంతు జాతులు అభివృద్ధి అవ్వడమే గాక సకాలంలో వర్షాలు కురిసే అవకాశాలు ఉంటాయన్నారు. దీనివలన లక్షలాది మందికి నీరు, జీవనోపాధిని అందుబాటులో ఉంటాయన్నారు. అదే క్రమంలో
డాక్టర్ సి.నారాయణరెడ్డి జయంతి కార్యక్రమం నిర్వహించారు. తెలుగు విభాగానికి చెందిన ఎం. నాగేంద్రబాబు, ఇతర అధ్యాపకులు, విద్యార్థిని, విద్యార్థులు డాక్టర్ సి.నారాయణరెడ్డి జయంతిని ఘనంగా నిర్వహించారు. డాక్టర్ సినారె ప్రధానంగా కవి అయినప్పటికీ ఆ కాలం నుంచి పద్య కావ్యాలు, గేయ కావ్యాలు, వచన కవితలు, చలనచిత్ర గీతాలు, యాత్ర కథనాలు, సంగీత. నృత్య రూపకాలు. బుర్రకథలు, గజల్లు, వ్యాసాలు, విమర్శన గ్రంధాలు, అనువాదాలు మొదలైనవి ఎన్నో వెలుపడ్డాయని కళాశాల అధ్యాపకులు అన్నారు. ఈ కార్యక్రమాలలో కళాశాల వైస్ ప్రిన్సిపల్. ఎం శ్రీనివాస పాత్రుడు. కే లీలా పావని. డాక్టర్ రమణ. ఐ రవీంద్ర నాయక్. జి జగదీష్. పూర్ణారావు, ఎం నాగేంద్రబాబు. టీ జగత్ రాయ్. శ్రీనివాసరాజు, ప్రసాద్, కే శివరాం కుమార్. కే నాగేశ్వరరావు. పి సతీష్, కళాశాల సిబ్బంది, విద్యార్థిని, విద్యార్థులు పాల్గొన్నారు.