Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Tuesday, September 17, 2024
Tuesday, September 17, 2024

ప్రతి ఓటరు ఓటు హక్కును వినియోగించే విధంగా చర్యలు చేపట్టాలి..

ఆర్డిఓ, నియోజకవర్గ ఎన్నికల అధికారి వెంకట శివరామిరెడ్డి
విశాలాంధ్ర ధర్మవరం:: ప్రతి ఓటరు ఓటు హక్కును వినియోగించుకునే విధంగా ప్రతి పోలింగ్ బూతులలో తగిన చర్యలు చేపట్టాలని ఆర్డిఓ, నియోజకవర్గ ఎన్నికల అధికారి వెంకట శివరామిరెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా ఆర్డీవో కార్యాలయంలో వివిధ రాజకీయ పార్టీ నాయకులతో ఎన్నికల విషయంపై వారు సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రానున్న ఎన్నికల దృష్ట్యా రాజకీయ పార్టీ నాయకులందరూ కూడా తమ తమ సహాయ సహకారాలను అందిస్తూ ఓటు హక్కు వినియోగించే విధంగా అందరికీ అవగాహన కల్పించాలని తెలిపారు. బిఎల్వోల, సూపర్వైజర్ ద్వారా ఇప్పటికే పారదర్శకతో కూడిన ఓటు జాబితాను తయారు చేయడం జరిగిందని తెలిపారు. తదుపరి రేషన్రైజేషన్ గూర్చి వివరిస్తూ స్కూల్ బిల్డింగులు మార్చేవి, స్కూల్ నేమ్స్ మార్చేవి, ప్రతి పోలింగ్ బూత్ లో 1500 మంది ఓటర్లు ఉన్న ఎడల వాటిని మరొక పోలింగ్ బూతుగా మార్చడం జరుగుతుందని తెలిపారు. ప్రస్తుతం ఏర్పాటైన పోలింగ్ బూత్ కేంద్రాలు శిథిల అవస్థగా ఉన్న యెడల, మరొక బిల్డింగుకు మార్పులు చేయడం జరుగుతుందని తెలిపారు. ఈ విషయంలో తాడిమర్రి మండలం పెద్దకోట, ముదుగుబ్బ మండలం రామస్వామి తండా ,బత్తలపల్లి మండలం అనంతసాగరం, ధర్మవరం మండలంలోని తుంపర్తి గ్రామాలను లొకేషన్ మార్పులుగా గుర్తించామనీ తెలిపారు. అదేవిధంగా నియోజకవర్గంలో ఐదు పోలింగ్ బూతులు యొక్క పేర్లను కూడా మార్చడం జరిగిందని తెలిపారు. అనంతరం నియోజకవర్గంలోని పోలింగ్ బూత్ కేంద్రాలపై పలు సమస్యలను రాజకీయ పార్టీ ప్రతినిధులు ఆర్డీవో దృష్టికి తీసుకొని వచ్చారు. స్పందించిన ఆర్డీవో సమస్యలని తప్పక విధిగా చర్యలు చేపడతామని తెలిపారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్సీపీ, టిడిపి, బిజెపి, కాంగ్రెస్, జనసేన పార్టీ ప్రతినిధులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img