Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Sunday, September 8, 2024
Sunday, September 8, 2024

సమ సమాజ స్థాపనే సమాజ్ వాదీ పార్టీ లక్ష్యం

పాడేరు నియోజకవర్గం ఇన్చార్జ్ గా మినుముల రాంబాబు కు నియామక పత్రం అందజేసిన
సమాజ్ వాదీ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు వెంకటేశ్వర్లు

విశాలాంధ్ర – చింతపల్లి (అల్లూరి సీతారామరాజు జిల్లా) :- సమ సమాజ స్థాపనే లక్ష్యంగా పేద బడుగు బలహీన మైనార్టీ వర్గాల అభివృద్ధి, సంక్షేమం కోసం సమాజ్ వాదీ పార్టీ పనిచేస్తుందని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పాశం వెంకటేశ్వర్లు అన్నారు. ఆ పార్టీ పాడేరు నియోజకవర్గ ఇన్చార్జి మినుముల రాంబాబు ఆధ్వర్యంలో లబ్బంగి హిల్ రిసార్ట్స్ వద్ద సోమవారం ఏర్పాటు చేసిన పార్టీ సమావేశానికి ఆ పార్టీ రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు, ఉత్తరాంధ్ర సమన్వయకర్త జాలాది విజయ, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కోన గురవయ్య లతో కలిసి విచ్చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆ పార్టీ రైల్వే కోడూరు సమన్వయకర్త విజయ్ కుమార్ అధ్యక్షతన నిర్వహించిన కార్యక్రమంలో ముందుగా మినుముల రాంబాబుకు నియోజకవర్గ ఇన్చార్జిగా నియామక పత్రం అందజేశారు. అనంతరం సమావేశాన్ని ఉద్దేశించి వారు మాట్లాడుతూ అడవి బిడ్డలు సాగు చేస్తున్న పోడు భూములకు పట్టాలు లేవని, ఆంధ్ర కశ్మీర్ గా పేరొందిన లంబసింగి ప్రాంతంలో ఉష్ణోగ్రతలు అత్యల్ప డిగ్రీలు గా నమోదయి చలి తీవ్రత అధికంగా ఉండే ఈ ప్రాంతాన్ని పర్యాటకంగా ఉపయోగించుకుంటే ఆశించిన ఆదాయ వనరుగా ఉంటుందన్నారు. ఎన్నికల సమయంలో వాగ్దానాలు చేయడం తప్ప ఏ ప్రభుత్వాలు ఈ ప్రాంత ప్రజలను చైతన్యపరిచిన దాఖలాలు లేవన్నారు. పర్యాటక అభివృద్ధిలో 40% ఈ ప్రాంతీయుల అభివృద్ధికి ఉపయోగించాలన్నారు. టూరిజం శాఖ నిర్మించే దుకాణ సముదాయాలను, స్థానికులకు వారు పండించిన, తయారు చేసే ఉత్పత్తులను క్రయవిక్రయాలు చేసేందుకు తక్కువ రుసుముతో ఇచ్చినట్లయితే గిరిజనులు అభివృద్ధి చిందేందుకు వీలుంటుంది అన్నారు గ్రామకంఠలు రెవెన్యూ సమస్యలు ఉన్నాయని, 22 (a) లో ఉన్న వారిని తీసేసి వారు జీవిస్తున్న భూమిపై హక్కు కల్పించాలన్నారు. మన కన్నీళ్లు మనమే తుడుచుకోవాలి, అదే విధంగా మన సమస్య మనమే పరిష్కరించుకోవాలన్నారు. మన వలన ఏమీ కాదు అనే న్యూనత భావాన్ని విడనాడాలన్నారు. ఎన్నో ప్రభుత్వాలు వచ్చినా హామీలు తప్ప అమలు లేదన్నారు. అమలు చేసే దిశగా సమాజ్వాది పార్టీ నిర్ణయాలు చేస్తుందన్నారు వారి కన్నా చిన్న పిల్లలే నయమని సూక్తిని చెప్పారు. 2024లో జరగబోవు సార్వత్రిక ఎన్నికలలో రాష్ట్రంలో 175 స్థానాలలో తమ పార్టీ పోటీ చేస్తుందన్నారు గిరిజనులకు జరిగే అన్యాయాలపై, అడవి బిడ్డల అవసరాలు తీర్చేందుకు తమ పార్టీ కృషి చేస్తుందన్నారు. ప్రస్తుత ప్రభుత్వాలు చేస్తున్న మాఫియాలపై గిరిజనులను చైతన్యపరచి ఈ ప్రభుత్వాలకు బుద్ధి చెప్పాలని లక్ష్యంతో అన్ని జిల్లాలలో పర్యటిస్తూ పార్టీ శ్రేణులను చైతన్య పరుస్తున్నామన్నారు. ఈ సందర్భంగా సమాజ్ వాదీ పార్టీ తరపున నాయకులను తయారు చేస్తున్నామని ఈ సందర్భంగా వారు తెలిపారు ఈ కార్యక్రమంలో ఆ పార్టీ రాష్ట్ర బ్రిగేడు యువ అధ్యక్షుడు టి కళ్యాణ్, యువజన నాయకుడు బి చందు యాదవ్, మాతా శ్రీ లలితాదేవి, నాయకులు, కార్యకర్తలు, అధిక సంఖ్యలో అభిమానులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img