Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Tuesday, September 17, 2024
Tuesday, September 17, 2024

ఈనెల 10న గురుకులాల ప్రవేశపరీక్షకు అన్ని ఏర్పాట్లు పూర్తి

విశాలాంధ్ర, సీతానగరం: సాంఘిక సంక్షేమశాఖ పరిధిలోని గురుకులాల్లో ప్రవేశాలకోసం ఈనెల 10న ప్రవేశ పరీక్ష జరగనుండగా అన్ని ఏర్పాట్లు పూర్తిచేసినట్లు ఉమ్మడి జిల్లాల గురుకులాల సమన్వయకర్త టి.పద్మజ తెలిపారు.ఆమె మాట్లడుతూ 2024-25 విద్యా సంవత్సరానికి సంబంధించి 5వతరగతి, ఇంటర్మీడియట్లో చేరేందుకు ప్రవేశ పరీక్ష నిర్వహిస్తున్నట్లు గురుకులాల సమన్వయకర్త టి. పద్మజ తెలిపారు.విజయనగరం, పార్వతీపురం మన్యంజిల్లాల్లోని 13 కేంద్రాల్లో ఆదివారం ఉదయం 10 గంటలనుంచి 12 గంటల వరకు,మధ్యాహ్నం2 గంటలనుంచి 4.30 వరకు పరీక్షలు జరుగుతాయని తెలిపారు.
https//apbragcet.apcfss.in వెబ్ సైట్ లో బుధవారం నుండి హాల్ టికెట్లు
డౌన్ లోడ్ చేసుకోవచ్చనిచెప్పారు. మొత్తం 2080 సీట్లు అందుబాటులో ఉన్నాయని, 5వతరగతిలో బాలికలకు 640, బాలురకు 400 సీట్లు, ఇంటర్మీడియట్ బాలురకు ఎంపిసి, బైపిసి, ఎంఈసి, సిఈసీలో 400సీట్లు, బాలికలకు ఎంపిసి, బైపిసి, సిఈసి, హెచ్ఈసి, ఎంఈసిలో 640 సీట్లున్నాయని చెప్పారు. పరీక్షా కేంద్రాలకు గంట ముందుగా చేరుకోవాలన్నారు. హాల్ టికెట్ తో పాటు ఆధార్ కార్డు తప్పనిసరిగా తీసుకొని రావాలని కోరారు.వివరాలు తప్పుగా ఉంటే ప్రిన్సిపల్ ధ్రువీకరించిన స్టడీ సర్టిఫికెట్ తీసుకురావాలని ఆమె చెప్పారు. ఓఎంఆర్ ఇవ్వనున్న నేపథ్యంలో నలుపు లేదా నీలం ఇంకు పెన్నులు తెచ్చుకోవాలని సూచించారు. ఆలస్యంగా వస్తే ఆనుమతి ఉండదని చెప్పారు. మరిన్ని వివరాలు కోసం పరీక్ష కేంద్రాల చీఫ్ సూపరింటెండెంటులను సంప్రదించాలని కోరారు. ఆమెతో పాటు ప్రిన్సిపాల్ ఈశ్వరరావు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img