Saturday, May 25, 2024
Saturday, May 25, 2024

ఎన్నికల వ్యవ పర్యవేక్షణకు నిఘా అధికారుల నియామకం

జిల్లా ఎన్నికల అధికారి నాగలక్ష్మి
విశాలాంధ్ర -విజయనగరం : ఎన్నికలలో మోడల్ కోడ్ అమలు, మోడల్ కోడ్ ఉల్లంఘన , ఫిర్యాదులు, అభ్యర్ధులు, పార్టీల ఎన్నికల వ్యయం తదితర అంశాల పై పర్యవేక్షణ కోసం నియోజకవర్గం వారీగా నిఘా అధికారులను (స్టాటిక్ సర్వేలేన్సు టీమ్స్ ) ను నియమిస్తూ జిల్లా ఎన్నికల అధికారి నాగలక్ష్మి ఉత్తర్వులు జారీ చేసారు. ప్రతి నియోజకవర్గానికి మూడేసి బృందాలను నియమించడం జరిగిందని, ఈ బృందం డిప్యూటీ తఃసిల్దార్లు ఆధ్వర్యం లో పని చేస్తుందని, ఇందులో పోలీస్ కాన్స్టేబుళ్ళు తో పాటు రెవిన్యూ సిబ్బంది, ఒక వీడియో గ్రాఫర్ టీం సభ్యులుగా ఉంటారని తెలిపారు. ప్రతి రోజు ఉదయం 6 గంటల నుండి 2 గంటల వరకు ఒక బృందం, మధాహ్నం 2 గంటల నుండి రాత్రి 10 గంటల వరకు రెండో టీం , రాత్రి 10 నుండి ఉదయం 6 గంటల వరకు మూడో బృందం పని చేస్తుందని తెలిపారు. మండల రెవిన్యూ అధికారి వారి కార్యాలయం నుండి ఈ బృందాలు అని చేస్తాయని తెలిపారు.
ఈ నిఘా బృందాలు వెంటనే సంబంధిత రిటర్నింగ్ అధికారి కి రిపోర్ట్ చేయాలనీ, వారు పని చేసే అధికారులు వారిని వెంటనే రిలీవ్ చేయాలనీ ఆదేశించారు. ఈ బృందాలు ప్రధానంగా చెక్ పోస్టుల వద్ద పని చేస్తూ అక్రమ నగదు రవాణా, అక్రమ మద్యం, ఆయుధాలు, బహుమతుల రవాణా పై దృష్టి పెట్టాలని , చెక్ పోస్ట్ వద్ద పట్టుబడిన వాటికీ వీడియోగ్రఫీ తప్ప తీయాలని తెలిపారు. వీడియో లను డి వి డి లుగా చేసి అకౌంటింగ్ టీం కు ఫైలింగ్ కోసం అందజేయాలని తెలిపారు. ప్రతి రోజు సీజ్ చేసిన నగదు, ఇతర వస్తువులు, ఫిర్యాదులను ఒక అనెక్షర్ లో ఏ రోజుకారోజు రిపోర్ట్ చేయాలనీ తెలిపారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img