Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Sunday, September 8, 2024
Sunday, September 8, 2024

కష్టపడి, పార్టీని బలోపేతం చేసినా గుర్తుంపేది?: నియోజకవర్గ ఇన్చార్జి ఎన్ని రాజు

5 రోజుల్లో అధిష్టానం స్పందించి, స్పష్టత ఇవ్వాలి

లేదంటే, తామంతా సమావేశమై భవిష్యత్ కార్యాచరణ గూర్చి ఆలోచనచేస్తాం – అవసరమైతే రెబల్ గా పోటీ చేస్తాం

విశాలాంధ్ర. రాజాం : పొత్తులో భాగంగా రాజాం నియోజక నియోజకవర్గ టిడిపికి కేటాయించినప్పటికీ, జనసేన పార్టీ అధిష్టానం నుంచి నేటి వరకు అధినాయకుడే కాదు.. ఏ నాయకుని నుంచి కూడా ఒక్క ఫోన్ కూడా రాకపోవడం చాలా బాధాకరంగా ఉందని జనసేన పార్టీ రాజాం నియోజకవర్గం ఇంచార్జ్ ఎన్ని రాజు ఆవేదన వ్యక్తం చేశారు ఆయన సోమవారం రాజాంలో తన కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు .మూడేళ్ల పాటు అహర్నిశలు కృషి చేసి పార్టీ బలోపేతానికి తామంతా ఎంతగానో ప్రయత్నించామని చెప్పారు .టిక్కెట్టు ఇవ్వకపోవడం బాధాకరమైనప్పటికీ పొత్తులో టిడిపికి ఇవ్వడం పార్టీ అధిష్టానం నిర్ణయం అయి ఉండవచ్చు కానీ జన సైనికులుగా పనిచేసిన తమకు సమాచారం లేకపోవడం అవమానపరిచినట్లు అవుతోందన్నారు. అధిష్టానం నుంచి ఇప్పుడే ఇటువంటి పరిస్థితి ఉంటే భభవిష్యత్తు ఎలా ఉంటుందోననే ఆందోళన తామందరిలో కలుగుతోందని చెప్పారు రాజాం నియోజకవర్గంలో పేరుకుపోయిన అనేక సమస్యలు ముఖ్యంగా రహదారుల సమస్యలపై తాము చేసిన పోరాటంతో ప్రజల్లో మంచి స్పందన వచ్చిందన్నారు సుదీర్ఘ రాజకీయ చరిత్ర కలిగి రెండు సార్లు జడ్పిటిసిగా పనిచేసిన అనుభవం ఉండి వృత్తిపరంగా న్యాయవాదిని అయిన తనను పరిగణనలోకి తీసుకోకపోవడం విచారకరమని అన్నారు. తనతో పాటు పాలకొండ నియోజకవర్గం ఇన్ఛార్జ్ కూడా అధినేత పవన్ కళ్యాణ్ ను కలిసేందుకు చాలా సార్లు ప్రయత్నాలు చేసినప్పటికీ అపాయింట్మెంట్ దొరకని దయనీయమైన స్థితి ఎదురైందన్నారు. ఇటువంటి పరిస్థితుల్లో స్థానిక సంస్థలు ఎన్నికల్లో నియోజకవర్గంలో జనసైనికులకు ఏ మేరకు కేటాయిస్తారని లిఖితపూర్వకంగా అధిష్టానం ఇవ్వాల్సిన అవసరం ఉందన్నారు. ఐదు రోజుల్లోగా అధిష్టానం స్పందించకుంటే తాము రెబల్ గా పోటీ చేసే విషయమే ఆలోచన చేస్తామన్నారు….

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img