Bahis Siteleri Bahis Siteleri Bahis Siteleri Bahis Siteleri Bahis Siteleri Bahis Siteleri Bahis Siteleri Bahis Siteleri Bahis Siteleri Bahis Siteleri Bahis Siteleri Bahis Siteleri Bahis Siteleri Bahis Siteleri Bahis Siteleri deneme bonusu bonus veren siteler deneme bonusu veren siteler deneme bonusu veren siteler https://lexilight.com casino siteleri https://www.paletdepom.com.tr
Tuesday, October 1, 2024
Tuesday, October 1, 2024

అంతర్జాతీయ యోగా దినోత్సవం

విశాలాంధ్ర- రాజాం : రాజాం కోర్ట్ ఆవరణలో తేదీ 21-06-2024న ఉదయం 9.00 గం.లకు అంతర్జాతీయ యోగా దినోత్సవం సంధర్భముగా యోగా కార్యక్రమము నిర్వహించడము జరిగింది. ఈ కార్యక్రమములో మండల న్యాయ సేవా సంఘ అధ్యక్షులు మరియు సీనియర్ సివిల్ జడ్జి సి. హెచ్. వివేక్ ఆనంద్ శ్రీనివాస్ , జూనియర్ సివిల్ జడ్జి పి.యెస్.వి.బి.కృష్ణ సాయి తేజ పాల్గొన్నారు. ఈ కార్యక్రమములో మనిషి దైనందిన జీవితములో యోగా విశిష్టతను తెలియజేస్తూ యోగాసనాలు, ప్రాణాయమము, తదితర యోగా ప్రక్రియలను పాల్గొన్నవారితో యోగా శిక్షకులు (ట్రైనెర్స్) కె.శ్రీనివాసరావు, శ్రీమతి కె. సౌందర్య చేయించారు. ఈ సంధర్భముగా టైనర్ – శ్రీ కె. శ్రీనివాసరావు మాట్లాడుతూ నేటి ఆధునిక కాలములో కాలముతోపాటు మనుషులు పరుగులు తీస్తూ అనేక ఒత్తిడిలకు గురిఅవుతూ ఆరోగ్యంపై శ్రద్ధ వహించటంలేదని, అది మనిషి మనుగడకే ప్రమాదమని, మానసిక, శారీరక, సామాజిక ఆధ్యాత్మిక ఆరోగ్యముల గురించి ఆయన వివరించారు. యోగా చేయటంవలన అనేక ఒత్తిడిలనుండి మనం బయటపడొచ్చని, ఆరోగ్యముగా మన జీవనము సాగించవచ్చని అన్నారు. రోజులో కొంతసమయము యోగా, ప్రాణాయమములకు కేటాయించినట్లయితే అనేక వ్యాధులనుండి మనిషి బయటపడొచ్చని అన్నారు. యోగా టైనెర్స్ ఇరువురు రాజాంలో యోగా శిక్షణ కేంద్రాన్ని నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ఈ కార్యక్రమములో మండల న్యాయ సేవా సంఘ అధ్యక్షులు సీనియర్ సివిల్ జడ్జి సి.హెచ్. వివేక్ ఆనంద్ శ్రీనివాస్ మాట్లాడుతూ, యోగా యొక్క ఉపయోగాలను తెలియజేశారు. ఉద్యోగులే కాకుండా అందరూ దినచర్యలో యోగా ను ఒక భాగముగా చేసుకున్నట్లయితే ఆరోగ్యముగా ఉంటామని అన్నారు. మరి ముఖ్యముగా నేటి కాలములో ఒత్తిడి ప్రతిఒక్కరికి అధికమవుతుందని, దానిని అధిగమించడానికి యోగాకి మించినది లేదని అన్నారు. అంతర్జాతీయ యోగా దినోత్సవం సంధర్భముగా ఈ కార్యక్రమమును యోగా బోధకుల సమక్షములో నిర్వహించడము ఆనందముగా ఉందని, యోగా బోధకుల సూచనలు సలహాలను అందరూ పాటించి అందరూ ఆరోగ్యముగా ఉండాలని కోరారు. ఈ కార్యక్రమములో రాజాం జూనియర్ సివిల్ జడ్జ్ పి.యెస్.వి.బి.కృష్ణ సాయి తేజ, రాజాం జూనియర్ సివిల్ జడ్జ్ కోర్ట్ ఏపిపి- కె.సూర్య కుమార్, రాజాం బార్ అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్ ఆర్.ఈ.సి. హెచ్.జయదేవ్, జాయింట్ సెక్రెటరీ ఏం. శ్రీనివాసరావు, రాజాం బార్ అసోసియేషన్ నుండి న్యాయవాదులు సీనియర్ మరియు జూనియర్ కోర్టు సిబ్బంది, మండల న్యాయ సేవాసంస్థ సిబ్బంది, పోలీసు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img