Sunday, April 28, 2024
Sunday, April 28, 2024

తెలుగు యువత సమావేశం

విశాలాంధ్ర – విజయనగరం అర్బన్ : విజయనగరం నియోజకవర్గం “తెలుగు యువత సమావేశం” గురువారం అశోక్ బంగ్లాలో నిర్వహించడం జరిగింది. ఈ సమావేశమునకు ముఖ్య అతిధిగా తెలుగుదేశం-జనసేన-బీజేపీ కూటమి విజయనగరం శాసనసభ ఉమ్మడి అభ్యర్థి పూసపాటి అదితి విజయలక్ష్మి గజపతి రాజు హాజరయ్యారు. ఈ సమావేశంలో తెలుగు యువత, TNSF ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న “My First Vote for CBN”, “కలలకు రెక్కలు” మరియు సోషల్ మీడియా అంశాలపై చర్చించడం జరిగింది. ఈ సందర్భంగా పూసపాటి అదితి విజయలక్ష్మి గజపతి రాజు మాట్లాడుతూ ప్రస్తుతం జరుగుతున్న ఎన్నికలలో యువత కీలకపాత్ర పోషిస్తున్నారని, రాష్ట్రంలో గత ఐదేళ్లుగా జరిగిన విధ్వంసాన్ని అందరు చూసారని, దేశ భవిష్యత్తు అయిన యువతను అన్ని విధాలుగా మోసం చేసిన జగన్ ప్రభుత్వాన్ని ఇంటికి పంపించాలని యువతకు పిలుపునిచ్చారు. రాష్ట్రంలో పారిశ్రామిక అభివృద్ధి లేక నిరుద్యోగం పెరిగి, నిరుత్సాహానికి గురైన యువత డ్రగ్స్ కు బానిసలవుతున్నారని విమర్శించారు, మన రాష్ట్రంలో డ్రగ్స్ ను ఏ స్థాయికి తీసుకువచ్చారంటే గ్రామాలలో కూడా విచ్చలవిడిగా దొరికే స్థితికి తీసుకువచ్చిన ఘనత జగన్ ప్రభుత్వానిదే అని, అందుకు ఉదాహరణే ఇటీవల విశాఖపట్నం లో దొరికిన 25వేల కిలోల డ్రగ్ అని అన్నారు. అదే విధంగా ప్రతి ఏడాది జనవరి లో జాబ్ కాలెండర్ రిలీజ్ చేస్తానని చెప్పి వారిని మోసం చేశారన్నారు.
యువతను డ్రగ్స్ కు బానిసలను చేస్తే వారిని ప్రశ్నించే వారే ఉండరని జగన్ నమ్ముతున్నాడని, అందుకే యువతకు ఉద్యోగాలకు బదులు డ్రగ్స్ ఇస్తున్నారని, ఇలాంటి ప్రభుత్వంపై యువత పోరాడవలసిన అవసరం ఉన్నదని, తల్లిదండ్రులు కూడా ఈ విషయాన్ని గుర్తించాలని కోరారు. అందుచేత గతంలో 2020 విజన్ తో ఆంధ్ర ప్రదేశ్ ను, హైదరాబాద్ ను ఎంతో అభివృద్ధి చేసిన శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వాన్ని బలపరచి, ఈ ఎన్నికలలో NDA అభ్యర్థిగా తెలుగుదేశం పార్టీ తరపున పోటీ చేస్తున్న నన్ను గెలిపించాలని కోరడం జరిగింది.
ఈ సమావేశంలో నియోజకవర్గంలో గల యువత సభ్యులు అందరు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img